ఒమిక్రాన్ వేరియంట్‌పై ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు…

ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ది.  ప్ర‌మాద‌క‌ర‌మైన డెల్టా వేరియంట్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ కావ‌డంతో ఈ వేరియంట్ పై ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ హెచ్చ‌రించింది.  ఈ వేరియంట్ గురించిన వివ‌రాల‌ను ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా వివ‌రించారు.  ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్లో 30కిపైగా మ్యూటేష‌న్లు ఉన్నాయ‌ని, మ్యూటేష‌న్లే ప్ర‌మాద‌క‌రంగా మార‌వ‌చ్చ‌ని అన్నారు.

Read: బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత

స్పైక్ ప్రోటీన్లు దేహంలో ఇన్‌ఫెక్ష‌న్లు క‌లిగిస్తాయ‌ని అన్నారు.  స్పైక్ ప్రోటీన్ శ‌క్తి త‌గ్గించేందుకు టీకాల‌తో యాంటీబాడీలను ఉత్ప‌తి చేస్తార‌ని, స్పైక్ ప్రోటీన్ల‌లో మ్యూటేష‌న్లు పెరిగితే టీకా సామ‌ర్థ్యం త‌గ్గిపోతుంద‌ని, ఒమిక్రాన్‌పై ప్ర‌స్తుత వ్యాక్సిన్ల సామ‌ర్థ్యం ప‌రిశీలించాల్సి ఉంద‌ని, వైర‌స్ వ్యాప్తి, ఇమ్యునిటీపై ప్ర‌భావంతో భ‌విష్య‌త్ చ‌ర్య‌లు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు.  

Related Articles

Latest Articles