ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకున్నాక ప్రజలకు సరైన పనులు దొరకడంలేదు. పనులు లేక అవస్థలు పడుతున్నారు. తిండిలేక చిన్నారులు అలమటించిపోతున్నారు. ఎటు చూసినా ఆఫ్ఘన్‌లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల నుంచి వీలేనంత త్వరగా బయటపడకపోతే శీతాకాలంలో మరింత దయనీయంగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు వీలైనంతగా ఆహార ధాన్యాలను ఆఫ్ఘన్‌కు అందిస్తున్నారు.
Read: స్పోర్ట్ బైక్ తరహాలో ఎలక్ట్రిక్ స్కూటర్…
అయినప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. పుండుమీద కారం చల్లినట్టుగా తాలిబన్ ప్రభుత్వం విదేశీ కరెన్సీపై బ్యాన్ విధించడంతో ఆర్థికంగా మరింత దిగజారిపోయింది. విదేశీ మారక ద్రవ్యాలను ఫ్రీజ్ చేయడంతో ఆఫ్ఘన్‌కు ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు ప్రయత్నాలు చేస్తున్నా, ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉండటంతో గుర్తించేందుకు తటపడాయిస్తున్నాయి. ఆకలిని తట్టుకోలేని కుటుంబాలు చిన్నారులను అమ్మేస్తూ వచ్చిన డబ్బుతో కాలం వెల్లదీస్తున్నారు. శీతాకాలంలో ప్రజల జీవనం మరింత దిగజారే ప్రమాదం ఉన్నది. ఆకలితో అలమటించి మరణించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.