టీమిండియా కోచ్‌గా…రవిశాస్త్రి ఉన్నంత కాలం…రన్‌మిషిన్ కోహ్లీ కు ఎదురులేదు. రవిశాస్త్రి హయాంలో…టీమిండియాకు కోహ్లీ చెప్పిందే వేదం. ఎన్నో టెస్టు సిరీస్‌లు, వన్డేలు, టీ20లు ఆడినా…రవిశాస్త్రి నుంచి కోహ్లీ సలహాలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సెంచరీ చేసి రెండేళ్లయినా…ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడన్న దానిపై దృష్టి పెట్టలేదు రవిశాస్త్రి. విదేశాలతో పాటు స్వదేశంలో జరిగిన టెస్టుల్లోనూ మంచి స్కోర్లు సాధించలేకపోయాడు కోహ్లీ. ఎక్కడ లోపముందో…చెప్పే ప్రయత్నం చేయలేకపోయాడు రవిశాస్త్రి.
ప్రస్తుతం టీమిండియా క్రికెట్లో పరిస్థితి మారిపోయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్ విరాట్ కోహ్లీకి పలు సూచనలు చేశాడు. ఈ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకుంది. గత కొద్ది కాలంగా విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. విదేశీ పిచ్‌లపై ఎలా రాణించాలన్న దానిపై ద్రవిడ్…కోహ్లీకి సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీ ఆడిన గత 13 టెస్టుల్లో 26 సగటుతో పరుగులు చేశాడు. అత్తుత్తమ స్కోరు 74. అయినా టెస్టుల్లో కోహ్లీ 50కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు.
చివరి సారిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో…టీమ్ఇండియా బ్యాటింగ్ భారం కోహ్లీపైనే పడింది. విదేశీ పిచ్‌లపై సమర్థంగా రాణించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి పలు సూచనలు సలహాలు తీసుకున్నాడు. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.