రేపటి నుంచే పిల్లలకు టీకా.. కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు కోవిడ్ వ్యాప్తి, మరోవైపు ఒమిక్రాన్ దాడితో ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై పడింది. అందుకే భారత ప్రభుత్వం 15-18 ఏళ్ళ వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ వేయడానికి రెడీ అయింది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వయసు పిల్లలకు 2022 జనవరి 3వ తేదీ నుంచి కోవిడ్ వ్యాక్సీన్లు ఇస్తామని.. వీరు కోవిన్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా కోవిడ్ వ్యాక్సీన్లకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. చిన్నారులకు కోవిడ్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినా.. అనేక యూరప్ దేశాలు అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, న్యూజీలాండ్ తదితర దేశాల కన్నా భారతదేశం కంటే ముందున్నాయి.
కరోనా పిల్లలపై చూపిన ప్రభావం తక్కువేనని చెప్పాలి. ప్రపంచం మొత్తం నమోదైన కేసుల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 2 శాతం మంది మాత్రమే. ప్రపంచం మొత్తం నమోదైన కోవిడ్ మరణాల్లో ఐదేళ్ల లోపు చిన్నారులు 0.1 శాతంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం నమోదైన కరోనా కేసుల్లో 5 నుంచి 14 ఏళ్ల వయస్సు లోపు పిల్లలు 7 శాతం మంది, ప్రపంచం మొత్తం నమోదైన కోవిడ్ మరణాల్లో వీరి సంఖ్య కేవలం 0.1 శాతంగా ఉంది. అయితే ముందు జాగ్రత్తగా పిల్లలకు టీకాలు ఇవ్వనున్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
పిల్లలకు టీకా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ అన్నారు. రేపటి నుంచే పిల్లలకు టీకా ఇస్తామన్నారు. ‘కొవిన్’ రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభమయిందని రాష్ట్రంలో 15-18 ఏళ్లవారు 22.78 లక్షలు పిల్లలున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీతో పాటు 12 కార్పొరేషన్లలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు.. మిగతా చోట్ల నేరుగా టీకాలు వేస్తామన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తారన్నారు. పిల్లలకు కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో వుంటుందన్నారు. వాక్సినేషన్ తర్వాత అబ్సర్వేషన్ తప్పనిసరి అన్నారు డాక్టర్ వెంకట్.
తాజావార్తలు
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ గజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్‌డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి