ముఖ్యమంత్రి కేసీఆర్…ఇవాళ యాదాద్రికి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11:30 గంటలకు యాదాద్రి బయల్దేరనున్నారు. లక్ష్మినరసింహాస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిశాయ్. దీంతో నిర్మాణం, గోపురాలన్నిటినీ మరోసారి కేసీఆర్ పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ తేదీలను ప్రకటించనున్నారు.యాదాద్రి పున: ప్రారంభం తేదీ, ముహూర్తాన్ని…త్రిదండి చినజీయర్ స్వామి…ఇప్పటికే ఖరారు చేశారు. ఆలయ ప్రారంభం రోజున నిర్వహించే…మహా సుదర్శన యాగం వివరాలు, తేదీలను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు.
కేసీఆర్ పర్యటనకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా…అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నిర్వహించనున్నారు. ప్రధానాలయం మాడవీధుల్లో, గర్భాలయం ప్రాంగణంలో అలంకరణలు.. విద్యుత్ లైట్లు.. శివాలయం విస్తరణ పనులను సీఎం పరిశీలించనున్నారు. స్వయంభువుల దర్శనానికి ముందు చేపట్టదలిచిన మహా సుదర్శన మహాయాగం కోసం… ఎంపిక చేసిన గండిచెర్వు సమీప ప్రాంత స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉంది. ఇటివలే నిర్మాణం పూర్తి చేసుకున్న లక్ష్మీ పుష్కరిణిలో అధికారులు ట్రయిల్ రన్ నిర్వహించారు. సీఎం సమక్షంలో మరోమారు ట్రయిల్ రన్ నిర్వహించే అవకాశాలున్నాయి.