CM KCR Tour: రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
Alsor Read:Allari Naresh: కామెడీ వైపు అల్లరి నరేష్.. కొత్త సినిమా ప్రారంభోత్సవం
ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. మూడు రోజులు కురిసిన అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భారీ వర్షం, ఈదురుగాలులు, వడగండ్ల వానతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. నష్టం వివరాలను తెలుసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు గ్రామాల్లో పర్యటించి నివేదికలు సిద్ధం చేసి అందజేశారు. జిల్లాలో వరి, మామిడి, మిరప, మొక్కజొన్న, టమాటో తదితర పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న కోత దశలో కిందపడిపోవడంతో యంత్రాలతో కోయలేని పరిస్థితి నెలకొంది. వడగళ్ల వానకు ఆయా రైతులు భారీగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.
Alsor Read: Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 5 వరకు పొడిగింపు
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని టీఎస్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తెలిపారు. దాదాపు 18,000 మంది బాధిత రైతులను ఆదుకునేందుకు అధికారులు ప్రక్రియను వేగవంతం చేస్తారని తెలిపారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. జిల్లాలోని రామడుగు, చొప్పదండి మండలాల్లో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను నివారించే అవకాశం లేదన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!