#Embassychallange: ‘నాటు నాటు’కు జర్మన్ ఎంబసీ డ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు ఫీవర్ బారిన పడని వారు ఎవరూ ఉండరు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ గెలవడంతో ఇప్పుడు ఎక్కడ విన్న నాటు నాటు పాటే వినిపిస్తోంది. ఆపాట, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డాన్స్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇటీవల, జర్మన్ ఎంబసీ సిబ్బంది పాత ఢిల్లీ వీధుల్లో ఈ నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశారు. కొరియన్ ఎంబసీ సభ్యుల తర్వాత, భారతదేశంలోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకర్‌మాన్, ఎంబసీలోని ఇతర సిబ్బంది ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో నాటు నాటుకు తమ ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్దులను చేశారు.
RRRలో ప్రధాన నటులలో ఒకరైన రామ్ చరణ్ కూడా వారి డ్యాన్స్ పై స్పందించారు.అద్భుతంగా చేశారంటూ కితాబు ఇచ్చారు. జర్మన్ ఎంబసీ సభ్యులు పగటిపూట వీధుల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జర్మన్‌లో ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
These are some brilliant moves!!!
Danke for all the love ❤️@AmbAckermann https://t.co/QVbX81HRXI— Ram Charan (@AlwaysRamCharan) March 22, 2023
ఢిల్లీలో నాటు నాటు విజయాన్ని జరుపుకున్నామని డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్ ట్వీట్ చేశారు. హీరో రామ్ చరణ్, RRR బృందానికి అభినందనులు తెలిపారు. అంతేకాదు నాటు నాటు ఛాలెంజ్ కోసం భారతదేశంలోని ఇతర రాయబార కార్యాలయాలను కూడా సవాలు విసిరారు డాక్టర్ ఫిలిప్ అకెర్‌మాన్. #embassychallange అంటూ ఛాలెంజ్ విసిరారు.
Also Read: Tower Ride Crashes: రాజస్థాన్ ఫెయిర్‌లో ప్రమాదం.. 11 మందికి తీవ్ర గాయాలు
కాగా, గత నెలలో దక్షిణ కొరియా రాయబార కార్యాలయం నాటు నాటు ట్రెండ్‌ను పవర్ ప్యాక్డ్ ప్రదర్శనతో ప్రారంభించింది. కొరియా రాయబారి చాంగ్ జే-బోక్, ఇతర రాయబార కార్యాలయ సిబ్బందితో కలిసి ట్రాక్‌కి వెళ్లారు. కాగా, నాటు నాటు చిత్రానికి సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి అందించారు. నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించగా, చంద్రబోస్ లిరిక్స్ రాశారు.
𝐍𝐚𝐚𝐭𝐮 𝐍𝐚𝐚𝐭𝐮 𝐑𝐑𝐑 𝐃𝐚𝐧𝐜𝐞 𝐂𝐨𝐯𝐞𝐫 – 𝐊𝐨𝐫𝐞𝐚𝐧 𝐄𝐦𝐛𝐚𝐬𝐬𝐲 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚
Do you know Naatu?
We are happy to share with you the Korean Embassy's Naatu Naatu dance cover. See the Korean Ambassador Chang Jae-bok along with the embassy staff Naatu Naatu!! pic.twitter.com/r2GQgN9fwC
— Korean Embassy India (@RokEmbIndia) February 25, 2023
తాజావార్తలు
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!