తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోడు భూములపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులను పునరుజ్జీవింపజేయాలని కేసీఆర్ అన్నారు Read Also: అచ్చెదిన్: ఏడాదిలో రూ.306 పెరిగిన సిలిండర్ తెలంగాణలో అడవిపై…
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు అక్టోబర్ మూడోవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పోడు భూముల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఒక్క గజం జాగ అటవీ భూమి భవిష్యత్తులో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని, దురాక్రమణలు అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలని సిఎం స్పష్టం చేశారు. అడవులను రక్షించుకునేందుకు ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలకైనా వెనకాడబోదన్నారు. పోడు సమస్యను పరిష్కరించే క్రమంలో అఖిలపక్ష సమావేశం…