Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cm Jagan To Launch Oxygen Plants

ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్‌

Published Date :January 10, 2022 , 7:10 am
By Gogikar Sai Krishna
ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించనున్న సీఎం జగన్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప అడుగు ముందుకేసింది. రెండో వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరతను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి, మెడికల్‌ ఆక్సిజన్‌ విషయంలో స్వావలంబన సాధించే దిశగా పలు కీలక చర్యలను తీసుకున్నారు. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఒమిక్రాన్‌ ప్రభావంతో కేసులు వేగంగా విస్తరిస్తోందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ ప్లాంట్లు కోవిడ్‌ మహమ్మారిన బారినపడ్డ వారికి చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో మెడికల్‌ ఆక్సిజన్‌ అన్నది ప్రపంచంలోనూ, దేశంలోనూ అత్యంత కీలకంగా మారింది. ట్యాంకర్ల ద్వారా మెడికల్‌ ఆక్సిజన్‌ తరలింపు కూడా అత్యంత సవాలుగా మారింది. వీటికోసం ప్రత్యేక మార్గాలు, ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి మొదటి, సెకండ్‌ వేవ్‌లో స్పష్టంగా చూశాం. గడచిన రెండేళ్లుగా మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు శ్రీకారం చుట్టింది.

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • TVK Vijay: విజయ్ ప్రమాణస్వీకారం సమయం మార్పు.. ఎప్పుడంటే..!
  • Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
Add as a preferred
source on google

ఆస్పత్రుల ఆవరణలోనే ఈప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రెజర్‌ స్వింగ్‌ అబ్జార్షన్‌ పద్ధతిలో తయారైన ఆక్సిజన్‌, పైపులైన్ల ద్వారా నేరుగా రోగికి చేరుతుంది. అలాగే సిలిండర్లను కూడా ఈ ఆక్సిజన్‌తో నింపవచ్చు. వివిధ సామర్థ్యాలతో ఈ పీఎస్‌ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1000 ఎల్‌పీఎం ( లీటర్‌ పర్‌ మినిట్‌), 500 ఎల్‌పీఎం సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేశారు.

పరిస్థితిని బట్టి, ఆస్పత్రి సామర్థ్యాన్ని అనుసరించి ఒకటి కన్నా ఎక్కువ ప్లాంట్లు కూడా నెలకొల్పారు. శ్రీకాకుళంలో 12 చోట్ల, విజయనగరంలో 2 చోట్ల, విశాఖపట్నలలో 12 చోట్ల, తూర్పుగోదావరిలో 13 చోట్ల, పశ్చిమగోదావరిలో 7 చోట్ల, కృష్ణాలో 12 చోట్ల, గుంటూరులో 7 చోట్ల, ప్రకాశంలో 5 చోట్ల, నెల్లూరులో 7 చోట్ల, చిత్తూరులో 21 చోట్ల, కడపలో 8 చోట్ల, అనంతపురంలో 9 చోట్ల, కర్నూలులో 9 చోట్ల.. మొత్తంగా 124 ప్రాంతాల్లో 133 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అదనంగా మరో 11 ప్లాంట్ల పనులు జరుగుతున్నాయి. మొత్తంగా 144 ప్లాంట్లు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిమొత్తం సామర్థ్యం దాదాపుగా 1.2 లక్షల ఎల్‌పీఎం పైమాటే. అంటే ఒక నిమిషలలో 1.2 లక్షల లీటర్లకు పైగా ఈప్లాంట్లనుంచి తయారు అవుతుంది.

https://ntvtelugu.com/whats-today-updates-10-01-2022/

దీంతో పాటు కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా 18,268 ఆక్సిజన్‌ పైపులైన్లను రూ.40.07 కోట్లతో ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న పైపులైన్లను మరింత బలోపేతం చేయడానికి 6,151 ఆక్సిజన్‌ లైన్లు వేయడంతోపాటు మరో రూ.50 కోట్లు ఖర్చుచేశారు. లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వకోసం 399 కిలో లీటర్ల సామర్థ్యంతో ట్యాంకర్లను 35 ఆస్పత్రుల్లో రూ.15 కోట్లతో ఏర్పాటు చేశారు. మరో 39 ఆస్పత్రుల్లో 390 కిలోలీటర్ల సామర్థ్యంతో రూ. 16.3 కోట్లు ఖర్చు చేసి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. అంతేకాక లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వ, రవాణాకోసం 20 కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 25 క్రయోజనిక్‌ ఐఎస్‌ఓ ట్యాంకర్లను రూ. 15.25 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.

20 వీఆర్‌ఎల్‌ ల్యాబ్స్‌ను రూ. 6.22 కోట్లతో ఏర్పాటుచేసి టెస్టింగ్‌ సామర్థ్యాన్ని గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిచింది.
మరో రూ.21.93 కోట్లతో కీలకమైన సివిల్‌వర్క్స్‌ను పూర్తిచేసింది. 26,746 డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లను కొనుగోలు చేసింది. ఈసీఆర్పీ –2 కింద 64.05 కోట్లతో పీడియాట్రిక్‌ కేర్‌ ఆక్సిజన్‌ సపోర్ట్‌ఉన్న బెడ్స్‌ను 183 సీహెచ్‌సీల్లో ఏర్పాటు చేశారు. 230 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులను 23 ఆస్పత్రుల్లో రూ.8.05 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు.

పైన చెప్పబడిన అన్నింటికోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రూ.426కోట్లను ఖర్చు చేసింది. ఈ రూ.426 కోట్లే కాకుండా క్లినికల్‌మేనేజ్‌మెంట్‌ చర్యల్లో భాగంగా మెడికల్‌ పరికరాలు, కోవిడ్‌ కిట్లు, ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్‌కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.297.36 కోట్లు ఖర్చు చేసింది. ఇదంతా మూడోవేవ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగమే. ఒమిక్రాన్‌ వైరస్‌ నిర్ధారణ కోసం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో కేరళ తర్వాత మన రాష్ట్రంలోని విజయవాడలో ఈ ల్యాబ్‌ ఏర్పాటు అయ్యింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm jagan
  • corona effect
  • latest news
  • news updates
  • Oxygen Plants In AP

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం

  • Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్‌..

  • Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..

  • CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..

  • PM Modi: ప్రధాని మోడీ పర్యటనలో బాంబు కలకలం.. బెంగళూరులో హై టెన్షన్!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions