ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి సెటిల్ కావాలని కలలు కంటుంటారు. అక్కడ అవకాశాలు, జీతాలు, జీవితాలు అలా ఉంటాయి. అయితే, 2000 సంవత్సరం తరువాత ప్రపంచ ఆర్థిక ప్రగతి ఒక్కసారిగా మారిపోయింది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మౌళిక సదుపాయాల రంగం అభివృద్ధి చెందడంతో ప్రపంచ సంపద భారీగా పెరిగింది. 2000 వ సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ సంపద 2020 వ సంవత్సరానికి వచ్చేసరికి 514 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
Read: భూమిపై సూర్యుడు అస్తమించని ప్రాంతాలు ఎక్కడున్నాయో తెలుసా?
20 ఏళ్ల కాలంలో మూడు రెట్లు పెరిగింది. ఇదే సమయంలో చైనా ఆర్థిక వృద్ధి భారీగా నమోదు చేసుకుంది. 21 వ శతాబ్దం ప్రారంభంలో చైనా సంపద 7 ట్రిలియన్ డాలర్లు ఉండగా, 2020 నాటికి అది 120 ట్రిలియన్ డాలర్లకు చేరింది. 2020 నాటికి అమెరికా సంపద 90 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ విషయంలో అమెరికాను మించిపోయింది చైనా. రాబోయే రోజుల్లో చైనా సంపద మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ పరిశోధన సంస్థ మెక్‌కిన్సే తెలియజేసింది.