NTV Telugu Site icon

Covid Cases Rise: దేశంలో మళ్లీ కరోనా కలవరం.. నేడు అన్ని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం

Covid 11

Covid 11

దేశంలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతిరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు. కరోనా కేసులు ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తుంది. దేశంలో రెండు వేలకు చేరవవుతున్నాయి.
Also Read:MLC Kavitha : కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

కొవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం ఐదు నెలల తర్వాత ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేంద్ర అప్రమత్తమైంది. ఇవాళ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. కరోనా కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలతో చర్చించనుంది. ఇప్పటికే కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది.

Also Read:TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజే ఆ టికెట్లు విడుదల

ఇప్పటికే కరోనా విజృంభనపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారిని నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. రంజాన్ పండుగ తో పాటు, ఇతరత్రా పండుగలు కూడా వస్తున్నవేళ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

దాదాపు ఏడాది పాటు కరోనా కేసులు పెరగలేదు. మహమ్మారి అదుపులోకి వచ్చింది. దేశవ్యా్ప్తంగా కేవలం పదుల సంఖ్యలోనే కేసులు నమోదు అయ్యాయి. అయితే, గత రెండు నెలలుగా కేసుల్లో పెరుదల కనిపిస్తోంది. ప్రజలంతా మళ్ళీ సాధారణ జీవనానికి అలవాటు పడిన సమయంలో మళ్ళీ తన పంజా విసురుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ పలు రాష్ట్రాలకు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.

Also Read:Harrassed : బండిపై వెళ్తున్న యువతిని కొట్టిన యువకులు.. మద్యంమత్తులో వీరంగం..

కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య తక్కువగానే ఉందని వివరించింది. ఇప్పుడు ఇన్ ఫ్లూయెంజా వ్యాధులు కూడా విస్తరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. ఈ క్రమంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రజల రద్దీని నియంత్రించాలి. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలి మరియు కరోనా లక్షణాలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని పేర్కొంది.