NTV Telugu Site icon

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే.. అన్ని ఎంపీ సీట్లు బీజేపీకే..

గత పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచాం.. మూడు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాం.. కానీ, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లు బీజేపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా… నిర్మల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు విమోచన శుభాకాంక్షలు తెలిపారు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని.. అది కేవలం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ సైనిక చర్యవల్లే సాధ్యం అయిందన్నారు.. నింజా రాక్షసపాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన రోజు ఇది.. సెప్టెంబర్‌ 17న విమోన దినోత్సవాన్ని నిర్వహించాలని అప్పట్లో కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు.. మరి ఇప్పుడు కేసీఆర్‌ డిమాండ్‌ ఏమైంది అని ప్రశ్నించారు.

ఇక, 2024లో తెలంగాణలో అధికారంలోకి వస్తాం.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని ప్రకటించారు అమిత్‌షా.. మజ్లీస్‌ పార్టీకికు బీజేపీ భయపడదని స్పష్టంచేసిన ఆయన.. తెలంగాణ ప్రజల్లో దీనిపై ఆలోచన మొదలైందన్నారు. మరోవైపు.. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే బండి సంజయ్‌ పాదయాత్ర నిర్వహిస్తున్నారన్నారు అమిత్‌షా.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని.. కాంగ్రెస్‌ కానేకాదన్నారు. తెలంగాణ పగ్గాలు చేపట్టే సామర్థ్యం బీజేపీకే ఉందన్నారు.