Celina Jaitly:రోజంతా ఆ పని చేయించి చివరకు అలా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందంగా, తెల్లగ నాజుకుగా ఉండాలి.. అప్పుడే యువతను ఆకర్శించగలుగుతారు.. టాలెంట్ ఉన్నా అందంగా లేకుంటే మాత్రం అస్సలు రాణించలేరు.. అలా చాలా మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నారు. అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా ఈ విషయాన్ని ఆ హీరోయినే బయటపెట్టింది. అసలు అప్పట్లో ఏం జరిగిందో సోషల్ మీడియా ద్వారా తన అనుభవాలను పంచుకుంది.. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఆమె ఎవరో కాదు.. నటి సెలీనా జైట్లీ ‘నో ఎంట్రీ’, ‘అప్నా సప్నా మణి మణి’, ‘గోల్‌మాల్ రిటర్న్స్’ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. బాలీవుడ్‌లో చాలా సంవత్సరాలు పనిచేసిన ఈ నటి అకస్మాత్తుగా చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంది. తన కెరీర్ ప్రారంభంలో, ఆమె ఫ్యాషన్ పరిశ్రమలో పనిచేసింది. సెలీనా ఇటీవల తన మొత్తం ప్రయాణం గురించి అంతర్దృష్టిని అందించడానికి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను షేర్ చేసింది..2001లో ఫెమినా మిస్ ఇండియాగా నిలిచిన ఈ భామ.. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో రన్నరప్‌గా కొద్దిలో కిరీటాన్ని మిస్ చేసుకుంది. ఇది జరిగి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దాంతో పాటే ఎవరికీ తెలియని బోలెడన్నీ సంగతల్ని పంచుకుంది..
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
‘మిస్ యూనివర్స్ ‘ పోటీల్లో పాల్గొన్న 103 మందిలో నేను కాస్త పొట్టిదాన్ని. అయినాసరే రన్నరప్‌గా నిలిచాను. ఇది నేను గర్వపడే విషయమే. 15 ఏళ్ల వయసులోనే నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. చాలా స్ట్రగుల్స్ చూశాను. దానికి తోడు చదువు, పోటీ పరీక్షల ఒత్తిళ్లు ఉండేవి. దీంతో నా టీనేజీ అంతా చాలా కష్టంగా గడిచింది. మొటిమలు, పొత్తి కడుపులో నొప్పి సమస్యలు నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. ప్రతి నెల నెలసరి సమయంలో ఎక్కువ రక్తం పోయేది..నా వయసు వాళ్లందరూ అప్పట్లో వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం కోల్‌కతాలో షూటింగ్స్, ర్యాంప్ షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకునేదాన్ని. కొన్నిసార్లు నన్ను చాలా కష్టపెట్టేవారు. అనుమతి లేకుండా నా ఫొటోలు వాడేసుకునేవాళ్లు. చివరకు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. మరీ తెల్లగా, సన్నగా ఉన్నానని చెప్పి చాలాసార్లు రిజెక్ట్ చేశారు. అదే అందరిలో నన్ను స్పెషల్‌గా మార్చింది..తెలుగులో మంచు విష్ణు సూర్యం సినిమాలో నటించింది.. తర్వాత బాలివుడ్ లోనే సినిమాలు చేస్తుంది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!