Business Headlines: భూటాన్ టూర్ భారమే. మనోళ్లకి కాస్త నయం. వేరే దేశాలకు మరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Headlines: 82కి పడిపోనున్న రూపాయి
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ త్వరలోనే 82 రూపాయలకు పడిపోనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాణిజ్య లోటు, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగనుండటమే దీనికి కారణమని చెబుతున్నారు. రేపు, ఎల్లుండి నిర్వహించనున్న అమెరికా ఫెడరల్ బ్యాంక్ సమావేశంలో వడ్డీ రేట్లను 50 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Also Read
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ఇన్ఫోసిస్ లాభం రూ.5360 కోట్లు
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి మూడు నెలల్లో విశేషంగా రాణించింది. 5 వేల 360 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతోపాటు భారీ ప్రాజెక్టులను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది అదనంగా 16 శాతం వరకు ప్రాఫిట్స్ రావొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
read more: Komatireddy: కోమటిరెడ్డిలో కన్ఫ్యూజన్. ఎన్నాళ్లిలా?..
ఎల్&టీ నుంచి ఎడెల్‌వీస్‌కి
ఇంజనీరింగ్ రంగంలో పేరొందిన సంస్థ లార్సన్ అండ్ టూబ్రో తన అధీనంలోని 8 రోడ్ ప్రాజెక్టులను, ఒక ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును ఎడెల్‌వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి విక్రయిస్తోంది. ఈ ప్రాజెక్టుల విలువ 7 వేల కోట్ల రూపాయలు కావటం విశేషం. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఈ నెల మొదటి వారంలోనే ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలకు నేషనల్ హైవేస్ అథారిటీ మరియు సెబీ అనుమతులు లభించాల్సి ఉంది.
తగ్గనున్న ఐటీ కొనుగోళ్లు
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల కొనుగోళ్లు పడిపోయాయని ఐడీసీ తెలిపింది. వచ్చే ఏడాది మరింత తగ్గుతాయని తాజా నివేదికలో అంచనా వేసింది. వినియోగదారులు ఐటీ సంబంధిత ఖర్చులను తగ్గించుకుంటున్నారని పేర్కొంది. గత రెండేళ్లలో ఎక్కువ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇవ్వటంతో చాలా మంది అప్పుడే కొన్నారని గుర్తుచేసింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం మరో కారణమని అభిప్రాయపడింది.
పదేళ్లు 15 శాతమే పన్ను!
స్పెషల్ ఎకనమిక్ జోన్ల స్థానంలో డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్‌ను తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లులో పన్నులు, ప్రోత్సాహకాలపై స్పష్టత ఇవ్వనుంది. ప్రత్యక్ష పన్నులను 2032 వరకు 15 శాతమే విధించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ ఫీల్డ్ మరియు బ్రౌన్ ఫీల్డ్ పెట్టుబడులకు మాత్రమే ఈ నిబంధన విధించనున్నారు.
భూటాన్ టూర్ భారమే
భూటాన్ పర్యటన మరింత భారం కానుంది. ఆ దేశానికి వెళ్లేవాళ్లు ఇకపై భారీగా ఫీజు కట్టాలి. భారతీయులైతే రోజుకి 12 వందల రూపాయలు, ఇతర దేశాలవాళ్లయితే 16 వేలు చెల్లించాలి. ఎందుకంటే భూటాన్ ప్రభుత్వం సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫీజు పేరిట ఈ డబ్బు వసూలు చేయనుంది. ఈ మేరకు ఇటీవలే ప్రకటన చేసింది. రెండేళ్ల విరామం అనంతరం ఆ దేశ సరిహద్దులు సెప్టెంబర్ 23 నుంచి తెరచుకోనున్నాయి.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!