Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ బిల్‌గేట్స్‌ని దాటేశారు. గౌతమ్ అదానీ తాజాగా 4వ స్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్ తన సంపదలోని 20 బిలియన్ డాలర్లను దానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బిల్ &మిలిందా గేట్స్ ఫౌండేషన్ అనే తన కుటుంబ అధీనంలోని స్వచ్ఛంద సంస్థకి ఈ విరాళం ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయన నికర సంపద 102 బిలియన్ డాలర్లకు తగ్గింది. మరో వైపు గౌతమ్ అదానీ 114 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో బెస్ట్ ర్యాంక్ సాధించారు.
బిర్లా గ్రూప్ భారీ వ్యయం
బిల్డింగ్ మెటీరియల్స్ ప్రొక్యూర్‌మెంట్ సెగ్మెంట్‌లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(ఎంఎస్‌ఎంఈ)ల కోసం ఇ-కామర్స్ వెంచర్ అందుబాటులోకి రానుంది. దీనికోసం బిర్లా గ్రూప్ 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనుంది. బిజినెస్ టు బిజినెస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టేందుకే ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ని రూపొందించనున్నారు. గడచిన మూడేళ్ల ఈ సెక్టార్‌లో 14 శాతానికి పైగా వృద్ధి నమోదు కావటం గమనార్హం. ఇదిలాఉండగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది.
read more: Ravi Teja : ఆ వార్తల్లో నిజం లేదు.. ఇదే నిజం..
8-8.5 శాతం వృద్ధి సాధిస్తాం
వచ్చే ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో 8 నుంచి 8.5 శాతం వరకు వృద్ధి సాధిస్తామని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. హైఫ్రీక్వెన్సీ సూచికల ఆధారంగా సర్కారు ఈ అంచనాకొచ్చింది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని/సెస్‌ను కూడా తగ్గించామని చెప్పారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16,550 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్‌లను తగ్గిస్తున్నట్లు ప్రకటించటంతోపాటు ప్రపంచ మార్కెట్లలో పాజిటివ్ సాంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో కీలకమైన రంగాలకు భారీ లాభాలు వచ్చాయి. ఈ లిస్టులో ఐటీ, మెటల్, ఆయిల్, గ్యాస్ తదితర సెక్టార్లు ఉన్నాయి. వీటి షేర్ల విలువ నిఫ్టీలో 2 శాతం చొప్పున పెరిగింది.