బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పకూలిన హెలికాప్టర్ వద్ద వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బ్లాక్ బాక్స్ సెర్చింగ్ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ కోసం నిపుణుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. బ్లాక్ బాక్స్ కోసం కాటేరు పార్క్ లో జల్లెడ పట్టనున్నారు వెల్లింగ్టన్ మిలటరీ క్యాంప్ అధికారులు.ఆ ప్రాంతానికి ఎన్టీవీ టీం వెళ్ళింది. అన్వేషణ జరుగుతున్న తీరుని పరిశీలించింది. ఏదైనా విమాన ప్రమాదం జరిగితే… అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలెట్ల సంభాషణలను రికార్డ్ చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేందుకు వీలవుతుంది.

ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ ఎక్కడ వుందో అన్వేషిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లోనే ఎందుకుంటుందో అనేదాని వెనక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాదసమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుంది.
Also Read
ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని రూపొందిస్తారు. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏవిధంగా ప్రమాదానికి గురైందో విచారణలో బయటపడనుంది. బ్లాక్ బాక్స్ లభ్యం అయితే అనేక విషయాలు బయటపడతాయి.
హెలికాప్టర్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయో తేలనుంది.వింగ్ కమాండర్ భరద్వాజ్ బ్లాక్ బాక్స్ సెర్చింగ్ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది.బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది.క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం మాత్రమే విశ్లేషణకు పనికొస్తుంది. బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11మంది మరణానికి కారణమయిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణలో ఏం తేలనుందో చూడాలి.
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!