కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతోనే సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా కేసీఆర్‌కు ఎప్పుడు కోపం వచ్చినా బీజేపీని తిట్టడం ఆయనకు ఫ్యాషన్ అయిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వరి కొనుగోలు చేయబోమని చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయం అని చెప్పిందని రఘునందన్‌రావు గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పు చేస్తే కేంద్రం అరెస్ట్ చేస్తుందని మాత్రమే బండి సంజయ్ అన్నారని పేర్కొన్నారు.
Read Also: తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు
Also Read
తెలంగాణలో బీజేపీ బలపడుతుందని.. బీజేపీని ఎదుర్కోవడం కష్టం అని ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చిందని.. అందుకే కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి తమతో పనులు చేయించుకోవడం.. ఇక్కడకు వచ్చి తమపై ఆరోపణలు చేసి గొడవలు పెట్టుకోవడం కేసీఆర్‌కు తగదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ఇతర రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినప్పుడు తెలంగాణలో ఎందుకు తగ్గించరని రఘునందన్‌రావు నిలదీశారు. పెంచిన ధరలలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదా అని సూటిగా ప్రశ్నించారు.
తాజావార్తలు
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Producer Council Elections: ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో సందడి.. ఓటేసిన అగ్ర నిర్మాతలు, యువ హీరోలు!
-
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. 52 ఏళ్ల మలైకా 33 ఏళ్లు వజ్రాల వ్యాపారితో కొత్త జీవితం?
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!