టీ20 వరల్డ్ కప్ : జట్టును ప్రకటించిన బీసీసీఐ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తుండగా తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించింది.
ఇక ఈ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా వ్యవరించనున్నాడు. అయితే ఈ జట్టులో అనూహ్యంగా కొంతమంది ఆటగాళ్లకు చోటు లభించింది. సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ జట్టులో స్థానం సంపాదించగా.. అనూహ్యంగా రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలతో పాటుగా అశ్విన్ ను కూడా ఎంపిక చేసింది బీసీసీఐ.
Also Read
- Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
- Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జట్టులో బ్యాట్స్మెన్స్ విభాగంలో కోహ్లీ, రోహిత్ లతో పాటుగా కేఎల్ రాహుల్, సూర్య కుమార్ లు ఉండగా వికెట్ కీపర్స్ గా ఇషాన్ కిషన్, పంత్ వ్యవరించనున్నారు. ఆల్ రౌండర్స్ విభాగంలో హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక స్పిన్నర్ లుగా అశ్విన్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలు ఎంపిక కాగా పేస్ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్ కుమార్, షమీని ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ. అలాగే స్టాండ్‌బై ప్లేయర్స్ గా శ్రేయాస్ అయ్యర్, శార్దూల ఠాకూర్, దీపక్ చాహర్ ఉన్నారు.
భారత జట్టును చూస్తేనే సెలక్టర్లు స్పిన్ కు పెద్దపీట వేసినట్లు అర్ధం అవుతుంది. ఎందుకంటే యూఏఈ లో ఉన్న పిచ్ లు ఎక్కువ స్పిన్నర్ లకే అనుకూలిస్తాయి. ఆ కారణంగానే అశ్విన్ జట్టులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ జట్టులో ఉంటాం అనుకున్న ధావన్, చాహల్, కుల్‌దీప్ యాదవ్, పృథ్వీ షా లకు షాక్ తగిలింది అనే చెప్పాలి.
అయితే ఈ ప్రపంచ కప్ జట్టుకు భారత మాజీ సారథి, మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని మెంటర్ గా వ్యవరించనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
భారత జట్టు : విరాట్ కోహ్లీ (C), రోహిత్ శర్మ (VC), కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wk), ఇషాన్ కిషన్ (wk), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా , భువనేశ్వర్ కుమార్, షమీ
స్టాండ్‌బై ప్లేయర్స్ : శ్రేయాస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్.
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్‌లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!