తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు : బండి సంజయ్ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. అయితే కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై బిజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు చేపట్టిన ” గరీబోళ్ల కోసం బిజెపి దీక్ష” ను వాయిదా వేస్తున్నామని బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ను రాష్ట్రంలో అమలు చేయాలని బిజెపి వివిధ మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం పై చేసిన ఒత్తిడి ఫలించిందని… ఆయుష్మాన్ భారత్ లో చేరాలని ఆలస్యంగానైనా తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేయడంతో పాటు పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
Also Read
తాజావార్తలు
-
Cleaning Tips: బాత్రూమ్లో వాడే ప్లాస్టిక్ డబ్బాకు మరకలు పోవడం లేదా..? ఈ చిన్న చిట్కాతో మెరిసిపోతుంది..
-
CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
-
Faria Abdullah: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. బోనాల నుంచి ఇస్లాం వరకు ఏం జరిగిందో చెప్పిన చిట్టి!
-
Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
-
AMCA Deal: ఇండియన్ డిఫెన్స్‌లో గేమ్‌చేంజర్ డీల్.. భారత్ ‘పవర్’ చూపించేందుకు చేతులు కలిపిన రిలయన్స్-రోల్స్ రాయిస్!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!