నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా ‘అఖండ’. సింహా, లెజెండ్ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. వీరిద్దరికి ఈ మూవీ హ్యాట్రిక్ అవుతుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్‌ను సినిమా యూనిట్ ప్రకటించింది.
Read Also: ఈ నెల 26న సంపూ ‘క్యాలీఫ్లవర్’
అఖండ మూవీ ట్రైలర్‌ను ఆదివారం రాత్రి 7:09 గంటలకు విడుదల చేయనున్నట్లు ద్వారకా క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ సరసన తొలిసారిగా ప్రగ్యా జైశ్వాల్ నటిస్తోంది. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్లు అభిమానులను ఉర్రూతలూగించాయి. కాగా డిసెంబరు తొలివారంలో అఖండ థియేటర్లలో రిలీజ్ కానుంది.