ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్(5) తొలి వికెట్‌ను మహ్మద్ సిరాజ్ తీశారు. తొలుత టాస్ గెలిచి మ్యాచ్‌లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బౌలింగ్ ఎంచుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ గెలుపుతో మంచి ఊపు మీదున్న పాండ్యా సేన.. తొలి వన్డేలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఆసీస్ ఆదిలోనే చుక్కలు చూపిస్తున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ప్రస్తుతం క్రిజ్ లో ఉన్నాడు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య వాంఖడే వేదికగా తొలి వన్డే జరుగుతోంది.
Also Read:IND VS AUS: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా