ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే కాదు, అమ్మాయి, అమ్మాయి మధ్యకూడా ఉండోచ్చు. చెప్పలేం. ఇటీవల కాలంలో అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకోవడమే కాదు, పెళ్లిల్లు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండే, ఆస్ట్రేలియాలో ఓ సాఫ్ట్‌బాల్ టోర్నీ జరుగుతున్నది. సారా రియో బేస్ బాల్ గేమ్ అడుతూ సడెన్ గా కిందపడిండి. కాలు నొప్పిగా ఉందని పడిపోయింది. సహచర క్రీఢాకారిణులంతా సారా దగ్గరకు వచ్చారు.
Read: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. భయంతో వణికిపోయిన ప్రజలు
స్టాండ్స్‌లో మ్యాచ్‌ను చూస్తున్న జసింతా పరిగెత్తుకుంటూ సారా దగ్గరకు వచ్చింది. వెంటనే సారా మోకాళ్లపై కూర్చొని జసింతాకు ప్రపోజ్ చేసింది. సారా సర్‌ప్రైజ్‌కు సహచర క్రీఢాకారిణిలే కాదు జసింతా కూడా షాక్ అయింది. మ్యారేజ్ ప్రపోజల్‌కు ఒప్పుకుంది. సారా-జసింతలు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆ మ్యాచ్ చూసేందుకు వచ్చిన సారా మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జసింతాకు ప్రపోజ్ చేయడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.
Wait for it… pic.twitter.com/gZ3tTxnJ9w
— Rex Chapman🏇🏼 (@RexChapman) December 10, 2021