రైతులకు శుభవార్త… చివరి గింజ వరకు కొంటాం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలం పంటలో వచ్చే ధాన్యంలో చివరి గింజ వరకు కొంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. అయితే రైతులు ధాన్యం తేవడానికి తొందరపడకూడదని కేసీఆర్ సూచించారు. 2, 3 రోజులు వర్షాలు ఉన్నాయని, రైతులు తొందరపడి ఆగమాగమై పంట కోయవద్దని సూచించారు. కోతలు అయిన వాళ్లు మాత్రం జాగ్రత్తగా పంటను తీసుకురావాలని సూచించారు.

Read Also: సీఎం కేసీఆర్ డిమాండ్.. కొత్త విద్యుత్ చట్టం రద్దు చేయాలి

మరోవైపు యాసంగి కోసం రైతుబంధు కూడా ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. యాసంగిలో ఏ పంట వేయాలో ఢిల్లీ వెళ్లొచ్చాక చెబుతానని ఆయన వెల్లడించారు. దేశంలో వరి ప్రధానం. టార్గెట్ ఇస్తే దాని ప్రకారం పంటలు వేయిస్తామన్నారు. మోదీ తీసుకున్న వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం నిజంగా అమలవుతుందా అని… దీనిపై అందరిలో అనుమానాలు ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే మేం కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమం చేసిన రైతులను ఉగ్రవాదులు, ఆందోళన కారులుగా నిందలు వేశారన్నారు. ఇప్పుడు బీజేపీ నేతలే క్షమాపణలు కోరుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

Related Articles

Latest Articles