Akasa Air Lines Shutdown Rumors: బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఆకాశ ఎయిర్ లైన్స్ కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీని మూసేస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నెలలోనే ఏడాది పూర్తి చేసుకున్న ఎయిర్ లైన్స్ మొదటి వార్షికోత్సవం సంద్భంగా చాలా తక్కువ ధరకే టికెట్లు అందించింది. అయితే చివరి నిమిషంలో ఫ్లైట్లు రద్దు కావడంతో ఆ టికెట్ల డబ్బును వాపస్ చేశారు. ఇలా విమానాలు చివరి నిమిషంలో…
దేశీయ ప్రమఖ ఎయిర్ లైన్ సంస్థ అయిన ఆకాశ ఎయిర్ గతేడాది ఆగస్టులో దేశంలో తన విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి దశలో భాగంగా దేశంలోని ప్రముఖ నగరాలను కనెక్ట్ చేస్తూ తన విమాన సర్వీసులను ప్రారంభించిన ఆకాశ ఎయిర్.. ఇప్పుడు క్రమంగా దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించడానికి ప్రణాళికలను రూపొందించుకుంటుంది.