Ajit Pawar: అజిత్ పవార్ బీజేపీలో చేరుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ కూటమి కొనసాగుతోంది. ప్రస్తతం ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి మధ్య చీలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాయకుల మధ్య విభేదాల కారణంగా కూటమికి బీటలు వారాయి అని చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీకి చెందిన సీనియర్ నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరుతారనం జోరుగా ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో శిశివసేన (ఉద్ధవ్ బాల్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలుచేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)తో అజిత్ పవార్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని, ఆయన బిజెపిలో చేరకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అజిత్ పవార్ వారితో (బిజెపి) వెళ్తాడని తాను అనుకోవడం లేదన్నారు.
Also Read:Rozgar Mela : 71 వేల మందికి ఉద్యోగాలు.. అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ
ఎన్సీపీతో అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది కాబట్టి చింతించాల్సిన పనిలేదన్నారు. ఆయన బీజేపీకి చేరి వారికి బానిస కాలేడని, అజిత్ పవార్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పారు. రానున్న రోజుల్లో అజిత్ పవార్, నానా పటోలేలతో చర్చలు జరుపుతామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మే 16న నాగ్‌పూర్‌లో ర్యాలీ చేస్తామన్నారు. ఆ ర్యాలీకి ముందు వారితో మాట్లాడతామని చెప్పారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ని ఉద్ధవ్ ఠాక్రే శరద్ తో కలిసి చాలా విషయాలపై చర్చించామన్నారు. తమ కనెక్షన్ ఫెవికాల్ లాంటిది ఎవరూ వేరు చేయలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని రౌత్ స్పష్టం చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భేటీని శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ స్వాగతించారు. ప్రతిపక్ష నాయకులుగా తాము కలిసి ఉన్నామన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేలను కలిసేందుకు నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌ల చర్యను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఐక్యతకు ఇది సానుకూల అడుగు అని, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడుతాయన్నారు. శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం సాయంత్రం ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను దక్షిణ ముంబైలోని సిల్వర్ ఓక్ నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో సేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ నేతలెవరూ హాజరు కాలేదు.
Also Read:Manager Assaulted: దొంగతనం అనుమానంతో దాడి.. మృతదేహాన్ని ఆస్పత్రిలో పడేశారు
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడిలో విభేదాలకు దారితీస్తున్నాయని అజిత్ పవార్ బుధవారం మండిపడ్డారు. చాలా సార్లు, నానా పటోలే మహా వికాస్ అఘాడిలో విభేదాలకు దారితీసే విషయాలు చెబుతారని, తనకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీడియాకు వెళ్లే బదులు జయంత్ పాటిల్ లేదా ఉద్ధవ్ ఠాక్రేతో లేవనెత్తాలి అని చెప్పారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!