Site icon NTV Telugu

Ajit Pawar: అజిత్ పవార్ బీజేపీలో చేరుతారా?

Ajit Pawar

Ajit Pawar

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ కూటమి కొనసాగుతోంది. ప్రస్తతం ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి మధ్య చీలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాయకుల మధ్య విభేదాల కారణంగా కూటమికి బీటలు వారాయి అని చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీకి చెందిన సీనియర్ నాయకుడు అజిత్ పవార్ బీజేపీలో చేరుతారనం జోరుగా ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో శిశివసేన (ఉద్ధవ్ బాల్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలుచేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)తో అజిత్ పవార్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని, ఆయన బిజెపిలో చేరకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అజిత్ పవార్ వారితో (బిజెపి) వెళ్తాడని తాను అనుకోవడం లేదన్నారు.
Also Read:Rozgar Mela : 71 వేల మందికి ఉద్యోగాలు.. అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ

ఎన్సీపీతో అజిత్ పవార్ రాజకీయ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది కాబట్టి చింతించాల్సిన పనిలేదన్నారు. ఆయన బీజేపీకి చేరి వారికి బానిస కాలేడని, అజిత్ పవార్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పారు. రానున్న రోజుల్లో అజిత్ పవార్, నానా పటోలేలతో చర్చలు జరుపుతామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మే 16న నాగ్‌పూర్‌లో ర్యాలీ చేస్తామన్నారు. ఆ ర్యాలీకి ముందు వారితో మాట్లాడతామని చెప్పారు. ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ని ఉద్ధవ్ ఠాక్రే శరద్ తో కలిసి చాలా విషయాలపై చర్చించామన్నారు. తమ కనెక్షన్ ఫెవికాల్ లాంటిది ఎవరూ వేరు చేయలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదని రౌత్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భేటీని శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ స్వాగతించారు. ప్రతిపక్ష నాయకులుగా తాము కలిసి ఉన్నామన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఖర్గేలను కలిసేందుకు నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్‌ల చర్యను తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఐక్యతకు ఇది సానుకూల అడుగు అని, ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడుతాయన్నారు. శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం సాయంత్రం ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్‌ను దక్షిణ ముంబైలోని సిల్వర్ ఓక్ నివాసంలో కలిశారు. ఈ సమావేశంలో సేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ నేతలెవరూ హాజరు కాలేదు.
Also Read:Manager Assaulted: దొంగతనం అనుమానంతో దాడి.. మృతదేహాన్ని ఆస్పత్రిలో పడేశారు

మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడిలో విభేదాలకు దారితీస్తున్నాయని అజిత్ పవార్ బుధవారం మండిపడ్డారు. చాలా సార్లు, నానా పటోలే మహా వికాస్ అఘాడిలో విభేదాలకు దారితీసే విషయాలు చెబుతారని, తనకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీడియాకు వెళ్లే బదులు జయంత్ పాటిల్ లేదా ఉద్ధవ్ ఠాక్రేతో లేవనెత్తాలి అని చెప్పారు.

Exit mobile version