ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉంటున్నాయి. ఆ దేశంలో ఉగ్రవాద శక్తులు బలం పుంజుకొని సాధారణప్రజలపై దాడులు చేస్తున్నారు. కొన్ని తెగల ప్రజలను లక్ష్యంగా చేసుకొని బాంబుదాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ రాజధానిలో వరసగా బాంబు పేలుళ్లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం కాబూల్‌లో ఓ బాంబుపేలుడు జరిగింది.
Read: ఈజిప్ట్‌లో బయటపడిన సూర్యదేవాలయం… ఏ కాలానికి చెందినదో తెలుసా…
ఉదయం జరిగిన పేలుడు సంఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరోచోట బాంబు పేలుడు జరిగింది. హజారా తెగ ప్రజలను లక్ష్యంగా చేసుకొని బాంబు పేలుడుకు పాల్పడ్డారని, ఈ పేలుళ్లో ఏడుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరు అన్నది తెలియాల్సి ఉన్నది. ఉదయం జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందగా, సాయంత్రం జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు.