ఈజిప్ట్‌లో బ‌య‌ట‌ప‌డిన సూర్య‌దేవాల‌యం… ఏ కాలానికి చెందిన‌దో తెలుసా…

ప్ర‌పంచంలో అనేక సూర్య‌దేవాల‌యాలు ఉన్న సంగ‌తి తెలిసిందే.  ప్ర‌తీ దేశంలో సూర్యుడిని కొలుస్తుంటారు.  ఇక పూర్వ‌కాలంలో సూర్యుడికి నిత్యం పూజ‌లు చేసే తెగ‌లు అనేకం ఉన్నాయి.  ఈజిప్ట్‌లో సూర్యుడిని వివిధ పేర్ల‌తో పూర్వం కొలిచేవారు.  ఆ దేశంలో సూర్యునికి అనేక ఆల‌యాలు నిర్మించారు.  ఈజిప్ట్ పురావ‌స్తుశాఖ నేతృత్వంలో అబు ఘ‌ర‌బ్ ప్రాంతంలో త‌వ్వ‌కాలు జ‌రుపుతుండ‌గా ఓ సూర్యుడి ఆల‌యం బ‌య‌ట‌ప‌డింది.  త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన ఆ ఆల‌యం సుమారు 4500 ఏళ్ల క్రితం నిర్మించిన ఆల‌యంగా పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.  

Read: క‌బేళా నుంచి త‌ప్పించుకొని 800 కిమీ ప‌రుగులు తీసిన గోవు… వైర‌ల్‌..

ఫారోహ్ పాల‌నా కాలంలో అప్ప‌టి రాజులు సూర్యునికి ఆరు ఆల‌యాలు నిర్మించారు.  కాగా, 1898లో త‌వ్వ‌కాల్లో ఓ ఆల‌యం బ‌య‌ట‌ప‌డ‌గా, తాజాగా రెండో ఆల‌యం బ‌య‌ట‌ప‌డింది.  శిధిలావ‌స్థ‌కు చేరిన టెంపుల్ స్టోన్ అనే ఆల‌యంలో త‌వ్వకాలు జ‌రుపుతుండ‌గా ఈ సూర్యాల‌యం బ‌య‌ట‌ప‌డిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.  ఫారోహ్ రాజులు నిర్మించిన ఇంకా నాలుగు ఆలయాలను గుర్తించాల్సి ఉంద‌ని పురావ‌స్తు నిపుణులు చెబుతున్నారు.  

Related Articles

Latest Articles