ఆ దొంగలు దొంగతనం చేసి యజమాని కాళ్లకు మొక్కార‌ట‌… ఎందుకంటే…

సాధార‌ణంగా దొంగ‌లు దొంగ‌త‌నం చేసే స‌మ‌యంలో ఎవ‌రైనా అడ్డువ‌స్తే వాళ్ల‌ను చంప‌డానికైనా వెనుకాడ‌రు.  బెదిరించి దొంగ‌త‌నం చేస్తారు.  దొరికిన సొమ్మును ఎత్తుకుపోయే ముందు వార్నింగ్ ఇచ్చి మ‌రీ వెళ్తారు.  కానీ, ఈ దొంగలు మాత్రం దానికి విరుద్దంగా చేశారు.  బెదిరించి దొచుకున్న డ‌బ్బు, బంగారంతో తిరిగి వెళ్తూ ఆ ఇంటి యజ‌మాని కాళ్ల‌కు మొక్కార‌ట‌.  అంతేకాదు, తీసుకున్న డ‌బ్బులను ఆరునెల‌ల లోగా తిరిగి ఇస్తామ‌ని చెప్పి వెళ్లార‌ట‌.  వెళ్తూ వెళ్తూ రూ.500 ఆ ఇంటి య‌జ‌మానికి ఇచ్చి వెళ్లార‌ట‌.  ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో జ‌రిగింది.  ఘ‌జియాబాద్‌లోని రాజ్‌న‌గ‌ర్ లో నివ‌శిస్తున్న సురేంద్ర‌వ‌ర్మ ఇంట్లో జ‌రిగింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

Read: అతడిని కోటీశ్వరుడిని చేసిన 157 చేపలు…

Related Articles

Latest Articles

-Advertisement-