అల్లరే అతని ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(జూన్ 30న అల్లరి నరేశ్ పుట్టినరోజు)
మొదట్లో పెన్నూ, పేపర్ పట్టుకొని స్క్రిప్ట్ రాయాలి, డైరెక్షన్ చేయాలి అంటూ ఇ.వి.వి.సత్యనారాయణ చిన్న కొడుకు నరేశ్ ఆరాటపడేవాడు. అయితే అప్పటికే తండ్రి దర్శకత్వం వహించిన ఒకట్రెండు సినిమాల్లో బాలనటునిగా దర్శనమిచ్చాడు. కానీ, ఇ.వి.వి. మాత్రం తన పెద్దకొడుకు రాజేశ్ ను హీరోని చేయాలని ఆశించారు. కానీ, తొలుత తెరపై కనిపించిన నరేశ్ నే నటన ఆవహించింది. నటునిగా సక్సెస్ దరి చేరింది. ఈ తరం హీరోల్లో అతివేగంగా యాభై చిత్రాలు పూర్తి చేసిన హీరోగా నరేశ్ రికార్డ్ సృష్టించాడు.
Also Read
తొలి చిత్రం అల్లరితోనే నరేశ్ తనదైన బాణీ పలికించడంతో అవకాశాలు అతణ్ణి వెదుక్కుంటూ వచ్చాయి. అల్లరోడుగా జనం మదిని గెలిచాడు. తొట్టిగ్యాంగ్తో నవ్వుల పువ్వులు పూయించిన నరేశ్ ప్రాణం పెట్టి ప్రేమకథలోనూ నటించాడు. నేనులో నటునిగా మంచి మార్కులు కొట్టేశాడు. నువ్వంటే నాకిష్టంలోనూ నటునిగా మరోమెట్టు పైకి ఎక్కాడు. అయితే నరేశ్ చేసే అల్లరినే జనం మెచ్చారు. అందుకే నవ్వులు పూయిస్తూనే సరదాగా సక్సెస్ రూటులో సాగిపోయాడు. ఈ మధ్య వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ నాంది పలికాడు. అంతకు ముందు నవ్వులతోనే ఆకట్టుకున్న నరేశ్, నాందితో మరో కోణం చూపించాడు. దానిని జనం సైతం ఆమోదించారు. అంటే ఇక ముందు నరేశ్ ను వైవిధ్యమైన పాత్రల్లో చూడవచ్చుననే భరోసా కలుగుతోంది.
నరేశ్ రూపురేఖలు ఆరంభంలో కార్టూన్ ను తలపించాయి. అందుకే అతని నటన నవ్వులు పూయించింది. పేరున్న కామెడీ డైరెక్టర్లు అందరూ నరేశ్ తో చిత్రాలు తీసి అలరించారు. ఇక తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలోనూ నరేశ్ పండించిన నవ్వులు తక్కువేమీ కావు. కితకితలు, అత్తిలి సత్తిబాబు ఎల్.కే.జి, అల్లరే అల్లరి, సీమశాస్త్రి, సీమటపాకాయ్, గమ్యం, బెండు అప్పారావు ఆర్.ఎమ్.పి, బ్లేడ్ బాబ్జీ, సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం, కత్తికాంతారావు, అహ నా పెళ్ళంట, యముడికి మొగుడు, యాక్షన్ 3డి, సుడిగాడు వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నరేశ్ ను తరువాత పరాజయాలు పలకరించాయి. ఈ నేపథ్యంలో మహేశ్ తో కలసి మహర్షిలో రవిగా నటించి మంచి మార్కులు సంపాదించాడు. బంగారుబుల్లోడుతో మళ్ళీ కామెడీ టచ్ ఇచ్చాడు. అయితే మునుపటి స్థాయిలో సక్సెస్ దరి చేరలేదు. అప్పుడే నాంది నరేశ్ దగ్గరకు నడచుకుంటూ వచ్చింది. తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉన్న నాందిలో నటించి మెప్పించాడు నరేశ్. ఆరంభంలో ఈ సినిమాకు మంచి టాక్ ఉన్నా వసూళ్ళు రాలలేదు. కానీ, మౌత్ టాక్ తో నాంది నరేశ్ కు అనూహ్యమైన విజయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో అలాంటి వైవిధ్యమైన పాత్రలే ఇకపై నరేశ్ ను పలకరించేలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా నటునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నరేశ్ రాబోయే రోజుల్లో విలక్షణమైన అభినయంతో ఆకట్టుకుంటారేమో చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
-
Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
-
Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?