NTV Telugu Site icon

Hyderabad: ఆన్‌లైన్ గేమ్‌లో బాలికను ట్రాప్.. ఆపై అత్యాచారం

Hyd Blackmail

Hyd Blackmail

పిల్లలు, యువత ఫోన్లు పట్టారంటే ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడటం ఎక్కువైపోయింది. ఆన్‌లైన్‌లో గేమ్స్‌కు బాగా అలవాటు పడిన యువత.. ఆ ఆటలకు సంబంధించి ఆన్‌లైన్‌లో తెలియని వేరే వారితో పరిచయం చేసుకుని గేమ్స్ ఆడుతున్నారు. అయితే.. ఇలా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతున్న ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మాయమాటలతో మోసపోయింది. ఆ బాలికను లొంగదీసుకుని ఆన్‌లైన్‌లో చాటింగ్‌లో స్వీట్ మెస్సేజ్‌లతో ఆమెను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా.. ఆమె ఫోటోలను తనకు షేర్ చేయాలని కోరాడు. దీంతో ఆ బాలిక తన ఫోటోలను ఆ వ్యక్తికి పంపించింది. ఆమె పంపించిన స్నాప్‌చాట్‌లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. దీంతో.. తల్లిదండ్రులతో పాటు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు యువకుడు ఖష్‌దేవ్. దీంతో.. అతను పూణే నుంచి హైదరాబాద్‌ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు.

TGSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షేక్‌పేట్‌ ప్రాంతానికి చెందిన బాలిక.. 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతుండేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. మొదట్లో స్నేహితుల్లా ఉండేవారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా చాట్ చేసుకున్న వారిద్దరూ.. చాట్ చేసే క్రమంలో బాలిక ఫోటోలు షేర్ చేయాల్సిందిగా యువకుడు కోరాడు. దీంతో.. బాలిక నిరాకరించింది. ఆ తర్వాత యువకుడు బాలికను బలవంతం చేయడంతో తన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. వాటిల్లో కొన్ని న్యూడ్ ఫోటోలు ఉన్నాయి.

Karnataka : తమ్ముడిని చంపి తప్పించుకుందాం అనుకున్నాడు.. కుంభమేళాక పోయివచ్చి దొరికిపోయాడు

దీంతో.. అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడు యువకుడు. తనను కలవాలని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్‌ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, యువకుడు ఖుష్‌డేవ్‌ అక్కడికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. అంతటితో ఆగకుండా.. మరుసటి రోజు అర్ధరాత్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడింది. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.. దీంతో ఆమె టీచర్‌ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్‌ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియడంతో.. ఫిలింనగర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.