నౌకలో భారీ అగ్ని ప్రమాదం.. 40 మంది సజీవ దహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నదిలో ప్రయాణిస్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. నౌకమొత్తం వ్యాప్తించడంతో.. 40 మంది సజీవంగా దహనమైన విషాద ఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తెల్లవారుజామున బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝలోకతి సమీపంలోని సుగంధ నదిపై మూడు అంతస్తుల నౌక ప్రయాణం చేస్తుండగా.. మంటలు చెలరేగాయి.. నిమిషాల వ్యవధిలోనే పూర్తిస్థాయిలో నౌక మొత్తం వ్యాపించాయి మంటలు.. ఈ ఘటనలో 40 మంది సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీశామని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. మంటలకు భయపడి కొందరు నదిలోకి దూకేశారని.. నీటిలో మునిగి మరికొందరు మరణించారని స్థానిక పోలీసు చీఫ్ మొయినుల్ ఇస్లాం వెల్లడించారు.
నౌకలో 310 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నప్పటికీ కనీసం 500 మంది ప్రయాణం చేస్తున్నారని.. వీరిలో చాలామంది రాజధాని నుండి ఇంటికి తిరిగి వెళ్తున్నారని.. దాదాపు 100 మందిని కాలిన గాయాలతో బారిసాల్‌లోని ఆస్పత్రులకు తరలించామని తెలిపారు అఇకారులు.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. మేం గ్రౌండ్ ఫ్లోర్ డెక్‌పై చాప మీద నిద్రిస్తున్నాము. ప్రయాణీకులందరూ నిద్రిస్తున్నారు.. నా తొమ్మిదేళ్ల మనవడు కూడా ఉన్నాడు.. మంటల ధాటికి నా మనవడు నదిలోకి దూకాడు, అతనికి ఏమి జరిగిందో తెలియదంటూ ఓ వృద్ధురాలు కన్నీరు మున్నీరైంది.. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొంతమంది నిద్రిస్తున్న క్యాబిన్ల నుండి బయటకు రాలేకపోయారని.. చాలా మంది నదిలోకి దూకారాని.. బరిసాల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న మరో వ్యక్తి వెల్లడించారు. మంటలు చెలరేగిన గంటలోపే ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టామని జిల్లా పాలనాధికారి జోహార్ అలీ తెలిపారు. ప్రయాణికులతో మాట్లాడాం.. 500 నుంచి 700 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నట్టు తెలిపారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!