దేశం సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ప్రజాజీవనం సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ను దాదాపుగా ఎత్తివేశారు. సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం నుంచి రవాణా వ్యవస్థను పునరుద్దరించారు. తమిళనాడు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తమిళనాడులోని 27 జిల్లాల్లో 19,920 బస్సలు రోడ్డెక్కాయి. దీంతో తమిళనాడులో ఒక్కరోజులో 22 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేశారు. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసినట్టుగా రవాణాశాఖ మంత్రి తెలిపారు.
Read: ఎమోషనల్ అయిన అనుష్క! సోషల్ మీడియాలో స్వీటీ భావోద్వేగం…