ఇప్పటికే కరోనా వైరస్ కలవరపెడుతోంది.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఓవైపు వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. మరోవైపు.. పాజిటివ్ కేసులు అదుపులోకి వచ్చినట్టే కనిపించడం లేదు.. ఈ తరుణంలో మరో కొత్త వైరస్ ఇప్పుడు కలవరడానికి గురిచేస్తోంది.. ఆఫ్రికా దేశం గినియాలో మార్బర్గ్ అనే వ్యాధి బయటపడింది.. ఎబోలా, కోవిడ్ లాంటి వైరస్ల తరహాలోనే మార్బర్గ్ కూడా ప్రాణాంతమైందని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకి ఉంటుందని అంచనా వేస్తోంది.. గబ్బిలా నుంచి సంక్రమించే ఈ వ్యాధి వల్ల మరణాల రేటు 88 శాతంగా ఉంటుందని హెచ్చరిస్తోంది.
గినియాలోని గుకిడెవో ఈ నెల 2వ తేదీన ఓ వ్యక్తి మరణించాడు.. అయితే, అతడి నుంచి సేకరించిన శ్యాంపిల్స్ ద్వారా మార్గ్ బర్గ్ కేసు నమోదు అయ్యింది… అయితే, ఈ వైరస్ గురించి అంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది డబ్ల్యూహెచ్వో.. మార్బర్గ్ వైరస్ జాతీయ, ప్రాంతీయ స్థాయిలో మాత్రమే విస్తరిస్తుంది.. కానీ, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశాలు లేవని వెల్లడించింది. గుహలు, గనుల్లోకి వెళ్లడం వల్ల ఈ వైరస్ గబ్బిలాల నుంచి సోకే ప్రమాదం ఉందని తెలిపింది. కాగా, మార్బర్గ్ వైరస్ కేసులు దక్షిణ కొరియా, అంగోలా, కెన్యా, ఉగాండా, కాంగో దేశాల్లో గతంలోనే నమోదు అయిన సందర్భాలున్నాయి.. కానీ, వెస్ట్ ఆఫ్రికాలో మాత్రం ఇదే తొలికేసుగా చెబుతున్నారు. ఈ వైరస్ సోకినవారిలో ఒక్కసారిగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఉంటాయని.. ఏ పని చేయడానికి కూడా శరీరం సహకరించదని డబ్ల్యూహెచ్వో చెబుతోంది.