10 Killed In Iraq Bomb Attack: ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో గురువారం బాంబు దాడి జరిగింది. స్థానిక ఎంపీ బంధువులపై జరిగిన ఈ దాడిలో పది మంది మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: LPG Price 1 December: ఇలా…
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ వరుస పేలుళ్లతో వణికిపోతోంది. బలూచిస్తాన్ పేలుళ్లలో 50 మందికి పైగా ప్రజలు చనిపోయిన తర్వాత మరో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పాకిస్తాన్ అణు కమిషన్ కార్యాలయం వద్ద పేలుడు జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ బీజేపీ నేత కుమారుడు ప్రయాణిస్తున్న కారుపై ఆరుగురు దుండగులు రెండు బాంబులు విసిరారు. కారు బీజేపీ నాయకురాలు విజయలక్ష్మి చందేల్ కుమారుడు విధాన్ సింగ్‌కు చెందినది. రెండు బైక్‌లపై వచ్చిన ఆరుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు కారు విండ్‌షీల్డ్‌పై రెండు బాంబులను విసిరారు.
తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తమైంది.. కుందుజ్‌లో మసీదుపై ఆత్మహుతి దాడి కలకలం రేపింది.. ఈ ఘటనలో మొత్తంగా 100 మంది మృతిచెందారు.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో.. మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది…