నవంబర్ 7, ఆదివారం దినఫలాలు : నిరుద్యోగులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం :- స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
వృషభం :- ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ముఖ్యులతో సరదాగా గడుపుతారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మిథునం :- ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. దైవ, పుణ్య, సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. ప్రేమికులకు మధ్య వేదాంత ధోరణి కానవస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు.
కర్కాటకం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పరిచయాల వల్ల మీ జీవితం ఊహించని మలుపు తిరుగబోతోంది. వాహనంకొనాలనే ఆలోచన క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరుతుంది. ఇతరులకు సలహా ఇవ్వటం వల్ల మాటపడవలసి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
సింహం :- కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. రాబోయే సమస్యలను తేలికగా గ్రహించడం వల్ల రాజకీయాల్లో వారు కుదుటపడతారు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
కన్య :- వాతావరణంలో మార్పు మీకెంతో చికాకు కలిగించగలదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం అధికమవుతుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
తుల :- స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పుల వల్ల మాటవపడతారు. విందులు, వినోదాల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. ప్రముఖుల కలియిక ప్రయోజనకరంగా ఉంటుంది.
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. మీ కళత్ర మొండి వైఖరి వల్లకుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఆత్మీయుల అతిథి మర్యాదలు సంతృప్తిని ఇస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
ధనస్సు :- మీ సంతానం అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
మకరం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలుదైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ వహించండి. హోటల్, తినుబండారాలు, కేటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి.
కుంభం :- సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండు,పూలు, చల్లని పానియ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఖర్చులు ముందుగానే ఊహించినవి కావటంతో ఇబ్బందులు తలెత్తవు.
మీనం :- తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు విలువైన బంగారు వస్తువులపై దృష్టి సారిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వల్ల పైఅధికారులతో మాటపడక తప్పడు. మిత్రులకు ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం.
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!