మేషం :- స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. సంఘంలో మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వృషభం :- ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మకానికై…