కాంగ్రెస్‌లోనే చిరంజీవి.. సోనియా, రాహుల్‌తో మంచి సబంధాలు..!
ఒంగోలులో నిన్న మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారని తెలిపారు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయని మీడియా ప్రతినిధులకు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు.. ఇక, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని.. ఆ దిశగా జిల్లా కమిటీలు, నాయకులను సన్నద్ధం చేస్తున్నామని వెల్లడించారు గిడుగు రుద్రరాజు.. దీంతో, మరోసారి చిరంజీవి-కాంగ్రెస్ చర్చ తెరపైకి వచ్చినట్టు అయ్యింది.. కాగా, రాజకీయం తన నుంచి దూరం కాలేదని మెగాస్టార్ చిరంజీవి.. గాడ్‌ఫాదర్ డైలాగ్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఓ ఆసక్తికర పరిణామం జరిగింది.. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఐడీని విడుదల చేసింది. చిరంజీవిని ప్రతినిధిగా పేర్కొంటూ 2027 వరకు డెలిగేట్ ఐడీని కూడా జారీ చేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడు అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాద్యతలను నిర్వర్తించారు. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించారు. ఇక, ఈ మధ్య పలు సినిమా ఇంటర్వ్యూల్లో.. పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై కూడా స్పందించారు.. అవసరం అయినప్పుడు తన తమ్ముడిగా అండగా ఉంటానని చెప్పుకొచ్చారు చిరంజీవి.. మరి 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
కడప జిల్లా చాపాడు మండల కేంద్రంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మరో 30 నిమిషాలలో ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకుంటామనగా ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయడపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన వీరు బంధువులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో అనూష, ఓబుళమ్మ, రామలక్ష్మి మృతి చెందగా, గాయపడిన వారిని ప్రొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న లారీ చక్రానికి గాలి తక్కువగా ఉందని ఆపే క్రమంలో నిద్రమత్తులో ఉన్న డైవర్ ఆగివున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందగా , అనంతపురం, హైదరాబాద్‌లకు చెందిన బంధువులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో రామలక్ష్మి, ఓబులమ్మ అక్కచెల్లెళ్లు కాగా.. అనూష రామలక్ష్మి కుమార్తె. ప్రస్తుతం గాయపడిన ఏడుగురు ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అదుపులోకి రాని మంటలు.. భవనం కూల్చివేసేందుకు..
సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో రెండు రోజులు గడుస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటి నుంచి ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో.. షాప్ యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. హుటా హుటిన అక్కడకు చేరుకున్న సిబ్బంది. మంటలను అదుపులో తెచ్చేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే మంటలు షార్ట్ సెక్యూర్ట్ వల్ల సంభవించాయని తేల్చారు. కాగా.. భారీగా మంటలు చెలరేగడంతో.. మంటలు కొందరు చిక్కుకున్నారు. వారిలో ముగ్గురిని కాపాడారు. మరో వైపు భవనంలో ముగ్గురు చిక్కుకున్నట్లు దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపు 40కిపైగా ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఇంకా రెండురోజు మంటలు అదుపులోకి రాలేదు. దక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనం అంతా పూర్తీగా దగ్ధం మయ్యింది. మంటల వేడికి పిల్లర్లు పూర్తీగా దెబ్బతిన్నాయి. దీంతో పిల్లర్ల సపోర్ట్ తో ముందు భాగం ఉన్న భవనం ఏ క్షణంలో అయినా కూలిపోయే అవకాశం ఉంది. మంటల వేడికి పిల్లర్లు, స్లాబ్ లోని ఐరన్ కరిగిపోయాయి. దీంతో భవనం ఏక్షణంలోనైనా కూలిపోయే స్థితిలో వున్నందున అపార్ట్మెంట్ వాసులు, స్థానిక బస్తీ వాసులు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు.
టీవీ సీరియల్ స్ఫూర్తితో.. ఐఫోన్ కోసం వైర్లను ఎత్తుకెళ్లారు.. చివరకు?
ఐఫోన్ కొనుక్కోవాలని వైర్ల దొంగతనానికి ఒడిగట్టారు ముగ్గురు యువకులు. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని నస్రుల్లాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు మైనర్‌లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్‌లో చోరీ సీన్ నుంచి ప్రేరణ పొంది ‘ఐఫోన్‌లు’ కొనుగోలు చేయడానికి, ఇండోర్ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు. జనవరి 12 రాత్రి సెహోర్‌లోని కృషి ఉపాజ్ మండి ప్రాంతంలోని ఒక దుకాణంలో జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించి ముగ్గురిని బుధవారం అరెస్టు చేశారు. నిందితులను అశుతోష్ విశ్వకర్మగా, మరో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 3.52 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నస్రుల్లగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృషి ఉపాజ్ మండి సమీపంలో మోటార్ వైండింగ్ దుకాణం నడుపుతున్న లోకేంద్ర శర్మ జనవరి 13న దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. అతను దుకాణానికి తాళం వేసినట్లు పోలీసులకు చెప్పాడు. రాత్రి సమయంలో షాపింగ్ చేసి, మరుసటి రోజు ఉదయం దుకాణానికి చేరుకునే సరికి తాళం పగులగొట్టి ఉంది. షాపులోపల తనిఖీ చేయగా రాగి తీగలు, మోటారు రోటర్ ప్లేట్ కనిపించడం లేదు. అతని ఫిర్యాదు మేరకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించామని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (SDOP) ఆకాష్ అమల్కర్ వెల్లడించారు. విచారణలో సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ముగ్గురు యువకులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
హెల్మెట్‌లపై జీఎస్టీ వద్దు.. తొలగించండి..
రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలతో బయటపడాలంటే హెల్మెట్లు ఎంతో అవసరం.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేవారికి హెల్మెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. బైక్ నడిపేవారు మాత్రమే కాదు.. వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సింది.. ఈ నిబంధనలు ఇప్పుడు కొన్ని నగరాలకే పరిమితం అయ్యాయి.. అయితే, రోడ్డు ప్రమాదాలు జరిగినా.. ప్రాణాలతో బయటపడ్డారంటే.. వాళ్లు హెల్మెట్ ధరించినవారే ఉంటున్నారు.. అయితే, హెల్మెట్‌లపై విధించిన జీఎస్టీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అంతర్జాతీయ రహదారి సమాఖ్య (ఐఆర్‌ఎఫ్).. ప్రస్తుతం హెల్మెట్‌లపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. దానిని పూర్తిగా ఎత్తివేయాలని కోరింది.. ఈ మేరకు ఐఆర్‌ఎఫ్… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది.. రాబోయే కేంద్ర బడ్జెట్ 2023లో ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం లైఫ్ సేవింగ్ డివైజ్ హెల్మెట్‌లపై జీఎస్టీని తొలగించాలని.. ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించాలని కోరింది.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్‌లో హెల్మెట్‌లపై విధించిన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీని) తొలగించాలని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్‌ఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే రోడ్డు ప్రమాద మరణాలలో భారత్‌లో 11 శాతం జరుగుతున్నాయని ఐఆర్‌ఎఫ్ ఎమెరిటస్ ప్రెసిడెంట్ కేకే కపిల ఈ సందర్భంగా పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుల విషయంలో ఇది దాదాపు 31.4 శాతంగా ఉందన్నారు. ద్విచక్ర వాహన ప్రమాద గాయాలు మరియు మరణాలను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన చర్యలలో ఒకటి ప్రామాణిక హెల్మెట్‌ల వాడకం అని ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో తెలిపారు కేకే కపిల.
క్లీన్ యమునా.. రూ.1,028 కోట్ల గ్రాంట్‌కు ఢిల్లీ అసెంబ్లీ ఆమోదం
దేశ రాజధానిలో యమునా నదిని శుభ్రపరిచే ప్రాజెక్ట్ కోసం రూ.1,028 కోట్ల అనుబంధ గ్రాంట్‌ను ఢిల్లీ జల్ బోర్డుకు ఇచ్చేందుకు ఢిల్లీ అసెంబ్లీ గురువారం ఆమోదించింది. అసెంబ్లీలో ఘాట్‌ల కోసం అనుబంధ డిమాండ్‌ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సమర్పించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకోనివ్వదని అన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి యమునా నదిని శుభ్రపరిచే పనిని ఆపడానికి ఎల్జీ అన్ని ప్రయత్నాలు చేసిందని మనీష్ సిసోడియా ఆరోపించారు. బడ్జెట్‌ను సభ ఆమోదించినప్పటికీ, ఢిల్లీ జల్ బోర్డు పనులు ఆగిపోయాయన్నారు. ఇంతకు ముందు ప్రాజెక్టులను ఆపాలని ప్రయత్నించారని.. ప్రాజెక్టులు ఆగకపోగా నిధులను నిలిపివేశారని అన్నారు. అయితే యమునానది ప్రక్షాళన పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. నిర్ణీత సమయంలో యమునా నదిని శుభ్రపరిచేందుకు, యమునా నదిని శుద్ధి చేసే పనిని వేగవంతం చేయడానికి ఢిల్లీ జల్ బోర్డుకు రూ. 1028 కోట్ల అదనపు నిధిని అందజేస్తున్నారు. రాబోయే కాలంలో యమునా నదిని శుద్ధి చేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కర్మాగారాల శుభ్రపరిచే పనులను స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దగ్గరుండి చూస్తున్నారు.
ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్.. “క్వైట్ మోడ్”
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామం మరో కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు మాతృ సంస్థ మెటా ఇన్‌స్టాలో మరో అద్భుత ఫీచర్‌ను తీసుకువచ్చారు. అయితే.. ఇన్‌స్టాగ్రామ్ తన టైమ్ మేనేజ్‌మెంట్ టూల్స్ విభాగాన్ని విస్తరించే ప్రయత్నంలో “క్వైట్ మోడ్” అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ ఇన్‌కమింగ్ నోటిఫికేషన్‌లను నిశ్శబ్దం చేయడం, DM లకు అటోమెటిక్‌గా ప్రత్యుత్తరం ఇవ్వడం, మీరు ప్రస్తుతం యాప్‌లో యాక్టివ్‌గా లేరని స్నేహితులకు తెలియజేయడానికి మీ స్థితిని తెలియజేస్తుంది. ఈ ఫీచర్‌తో పాటు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యాప్‌లోని టీనేజర్ల భద్రతపై దృష్టి సారించే ఇతర ఫీచర్‌ల సమూహాన్ని రూపొందించింది. ఇందులో మరిన్ని తల్లిదండ్రుల నియంత్రణ సాధనాలు మరియు సిఫార్సులను నిర్వహించడానికి ఇతర సాధనాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ సమయాన్ని నిర్వహించడంలో సహాయపడే ఫీచర్‌లతో ముందుకు రావడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. యాప్‌లో గడిపిన రోజువారీ సమయాన్ని తెలుసుకోవడం, ట్రాక్ చేయడం మరియు నియంత్రించడంలో సహాయపడే ఫీచర్ ఇప్పటికే యాప్‌లో ఉంది. అయితే.. ఇది వారికి హెచ్చరికలను పంపుతుంది. వ్యక్తిగత యాప్ సెషన్‌లు నిర్దిష్ట సమయం దాటిన తర్వాత “విరామం తీసుకోండి” రిమైండర్‌లను కాన్ఫిగర్ చేయడానికి ఒక ఫీచర్ కూడా ఉంది. అయినప్పటికీ, క్వైంట్ మోడ్ విభిన్నంగా ఉంటుంది, ఇది మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్ నుండి కొంత దూరం కోసం ప్రయత్నించే వాస్తవ ప్రపంచ ప్రభావాలపై దృష్టి పెడుతుంది. ఈ మోడ్ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను విశ్రాంతి తీసుకోవడానికి – అధ్యయనం చేయడానికి, నిద్రించడానికి లేదా యాప్‌నుంచి కొంత సమయం తీసుకోవాలని ఉపయోగపడుతుంది. ఇది మీ ఇన్‌స్టంట్ మెసేజింగ్ లైట్‌ను ఆఫ్ చేయడానికి సమానమైన Instagram లాంటిది.
మారిన వికీపీడియా.. కొత్త హంగులతో
ఇంటర్నెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సైట్‌లలో వికీపీడియా ఒకటి. కొన్నేళ్లుగా, వికీపీడియా అదే రూపాన్ని మరియు అనుభూతిని కలిగి ఉంది. అయితే ఇప్పుడు వికీపీడియా కొత్త రూపాన్ని సంతరించుకుంది. “పదేళ్ల తర్వాత మొదటిసారిగా వికీపీడియా కొత్త రూపాన్ని సంతరించుకుంది. వికీపీడియా యొక్క డెస్క్‌టాప్ ఇంటర్‌ఫేస్‌కు మెరుగుదలల శ్రేణి సైట్‌ను ఉపయోగించడానికి సులభతరం చేస్తుంది. అంతేకాకుండా పాఠకులు, సహకారులకు మరింత సులువుగా ఉపయోగించే విధంగా మార్చబడింది. ” అని వికీపీడియా మాతృ సంస్థ వికీమీడియా ఫౌండేషన్ తెలిపింది. వికీమీడియా ఫౌండేషన్ యాజమాన్యంలో, ఉచిత ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా జనవరి 15, 2001న ప్రారంభించబడింది. 2022లో, గ్లోబల్ డిజిటల్ ట్రెండ్స్ రిపోర్ట్, ఇంటర్నెట్‌కు కనెక్ట్ కాని వారి సంఖ్య మొదటిసారిగా 3 బిలియన్ల కంటే తక్కువగా పడిపోయిందని వెల్లడించింది. Wikipedia యొక్క కొత్త డెస్క్‌టాప్ ఇంటర్‌ఫేస్ ఈ తర్వాతి తరం ఇంటర్నెట్ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ఇది ఇంటర్నెట్‌తో వారికున్న పరిచయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ విశ్వసనీయమైన సమాచారాన్ని కనుగొనడాన్ని సులభతరం చేస్తుంది.