నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రేషన్ కార్డులను స్మార్ట్‌గా మార్చేసింది.. రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ్టి నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయనున్నారు.. ఉదయం 10:30కు వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా.. మధ్యాహ్నం 12:00 గంటలకు కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో.. ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. మొత్తంగా నాలుగు విడతల్లో 1 కోటి 45 లక్షల మందికి రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు.. మొదటి విడతలో అంటే నేటి నుంచి 9 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డులు పంపిణ చేయనున్నారు.. ఇక, రెండో విడతలో అంటే ఈ నెల 30వ తేదీ నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఇవి అందించనున్నారు.. మూడో విడత వచ్చే నెల 6వ తేదీ నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లిలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.. నాలుగో విడత వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాలు – బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలో ఈ కార్యక్రమం ఉంటుంది.. గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు.. ఈకార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొంటారు..
యూరియా కొరతపై ఫోకస్ పెట్టిన సర్కార్.. ఈ నెలలోనే మొత్తం కోటా..!
రాష్ట్రంలో యూరియా కొరతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆగస్టులో లక్షా 65 వేల టన్నులు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 65 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఇంకా లక్ష టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే, జూలైలోనూ 50 వేల టన్నులు తక్కువ వచ్చింది. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. గత నెల, ఈ నెల వర్షాలు విస్తారంగా కురవడంతో పంటల సాగు ఎక్కువగా జరిగింది. దీంతో యూరియా డిమాండ్ అమాంతం పెరిగిపోయింది.. మరోవైపు ఐపీఎల్, సీఐఎల్ నౌకలు ఆలస్యం కావడం వల్ల రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమైంది. అధికారులు యూరియా కొరత పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందువల్ల కోటా ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన మొత్తం యూరియాను ఈ నెలలోనే పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నెల 25న నౌకలపై గంగవరం పోర్టుకు వచ్చే 18 వేల టన్నుల్లో సరుకు మొత్తం ఇవ్వాలని, 28న కాకినాడ పోర్టుకు రానున్న 42వేల టన్నుల్లో కనీసం 25వేల టన్నులు ఇవ్వాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు తెలిపారు… మరోవైపు యూరియా వినియోగంపై కూడా కీలక సూచనలు చేసింది ఏపీ సర్కార్.. వ్యవసాయ అవసరాలకు మాత్రమే ప్రస్తుతం యూరియా కొనుగోలు చేయాలని.. ఫ్యాక్టరీల అవసరాల కోసం యూరియా విక్రయాలు సాగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉన్నధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే..
చంద్రబాబు సీరియస్ వార్నింగ్..! నిజంగానే వారిపై చర్యలు ఉంటాయా..?
ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వైఖరికి సంబంధించి సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ప్రధానంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాలు విమర్శలు వస్తున్నాయి.. కొంతమంది ఎమ్మెల్యేలు వరస వివాదాలలో ఇరుక్కుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది.. సుమారు ఒక 25 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద వాళ్ల మీద వచ్చిన వివాదాలకు సంబంధించి సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తిగా ఉన్నారు.. సీఎం అసంతృప్తిని మంత్రి లోకేష్ ధ్రువీకరించారు కూడా, ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు సంబంధించి యాక్షన్ మొదలయింది… ఈ నియోజకవర్గాల్లో పవర్స్ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటారు.. అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొన్న జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని సీఎం హెచ్చరించారు. ఒకసారి చెప్తాను.. రెండుసార్లు చెప్తాను.. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే కఠిన చర్యలు తప్ప చెప్పే పరిస్థితి ఉండదని.. ఇక కఠిన చర్యలు మాత్రమే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు.. చాలా స్పష్టంగా ఈ విషయం చెప్పారు.. మరి ఆయన చెప్పినట్లు ఆచరణలో ఈ రకమైన వాతావరణం ఉంటుందా..? అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది.. ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవటం అంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పవర్ కట్ చేయాలి.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ వచ్చేలా చేయాలి… దీంతోపాటు కొత్త ఇంఛార్జ్‌ని పెట్టాలి. ఎమ్మెల్యే పాత్ర నామమాత్రం చేయాలి.. ఇవన్నీ చేస్తేనే ఎమ్మెల్యే పై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకున్నట్టు.. ఇవేమీ చేయకుండా కేవలం ప్రస్తుతం సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు.. అయితే, వార్నింగ్ ల వల్ల ఒకటి రెండు సందర్భాల్లో ఎమ్మెల్యేలు దారికి వస్తే పర్వాలేదు.. లేకపోతే కనుక మళ్లీ తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది.. సీఎం చంద్రబాబు కూడా రెండుసార్లు మించి ఎక్కువ చెప్పను అనే అన్నారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు రిపీటెడ్ గా తప్పులు చేస్తే సీఎం చంద్రబాబు నిజంగానే కఠిన చర్యలు తీసుకుంటారు అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతూనే ఉంది.
ప్రేమ వివాహం కానీ, ప్రేమే లేదు.. ఆ కారణంతో భార్యను హత్య చేసి పెట్రోల్ పోసి తగుల బెట్టిన భర్త
హైదరాబాద్‌లోని మేడిపల్లి ప్రాంతంలో గర్భంతో ఉన్న తన భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రేమ వివాహమే అయినప్పటికీ భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మహేందర్ రెడ్డి, ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుగా చేసి మూసి నదిలోపడేశాడు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. భార్య ను హత్య చేసి అడవుల్లో తగుల బెట్టాడు ఓ భర్త. వీరిద్దరు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ భార్యపై ఏమాత్రం ప్రేమేలేదు. అసలు ఏం జరిగిందంటే? శ్రీశైలం, శ్రావణి ఇద్దరు భార్యభర్తలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు దంపతులు. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురంలో అనుమానం పెనుభూతంగా మారింది. శ్రావణి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానించాడు భర్త శ్రీశైలం. ఈ క్రమంలో భార్యను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా భార్య శ్రావణి తో సోమశిలకు వెళ్దామని చెప్పాడు.. మార్గమధ్యలో అడవిలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు భర్త శ్రీశైలం.
వరంగల్ లో దారుణం.. నాలుగు నెలల క్రితమే పెళ్లి.. భార్యపై దారుణం
అనుమానాలు, అదనపు కట్నాలు, అక్రమసంబంధాలు వివాహబంధంలో చిచ్చుపెడుతున్నాయి. భార్యలను అత్యంత దారుణంగా చంపేస్తున్నారు కొందరు భర్తలు. రెండ్రోజుల క్రితం గ్రేటర్ నోయిడాలో అదనపు కట్నం కోసం వేధించి భార్యకు నిప్పు పెట్టి చంపేశాడు. మేడిపల్లిలో భార్యపై అనుమానంతో ముక్కలుగా నరికి ప్రాణం తీశాడు భర్త. తాజాగా మరో ఘోరం చోటుచేసుకుంది. వరంగల్ లోని హంటర్ రోడ్డులో భార్య గౌతమిని(21) హత్య చేశాడు భర్త గణేష్( 22). మొహంపై దిండుపెట్టి నొక్కి హత్యకు పాల్పడ్డాడు. గౌతమి స్వస్థలం వీరారం గ్రామం బాల్యం తండ మహబూబాద్ జిల్లా. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న గౌతమి గణేష్. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడ గణేష్. కాగా తమ కూతురును అదనపు కట్నం కోసమే హత్య చేశాడని గౌతమి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గణేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు గౌతమి తండ్రి అశోక్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవపరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నేడు అహ్మదాబాద్‌లో మోడీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రధాని మోడీ సోమవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. ఆగస్టు 25న ఖోడల్ధామ్ మైదానంలో మోడీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నికోల్‌లో రోడ్లను మూసివేసి దారి మళ్లించారు. ఇక పర్యటనలో భాగంగా గుజరాత్లో రైల్వేలు, రోడ్లు, ఇంధనం, పట్టణాభివృద్ధికి సంబంధించిన రూ.5,400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. బహుళ ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేయనున్నారు. ఇక ఆగస్టు 26న సుజుకి హన్సల్పూర్ ప్లాంట్‌ను సందర్శించి హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ ఉత్పత్తిని ప్రారంభిస్తారు. ఇక సుజుకి ‘‘e VITARA’’ ఎగుమతులను 100 దేశాలకు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
జమ్మూలో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం.. 100 ఏళ్ల రికార్డ్ రెండోసారి బద్దలు
జమ్మూను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జమ్మూ అతలాకుతలం అయింది. భారీ వర్షం కారణంగా కథువా, సాంబా, రియాసి, ఉధంపూర్ సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో 100 సంవత్సరాల్లో ఆగస్టులో రెండో అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్మూ నగరంలో 190.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఆగస్టు 5న 1926న జమ్మూలో 228.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ రికార్డ్‌ను గతంలో ఆగస్టు 11, 2022న బద్దలు కొట్టింది. అప్పుడు 189.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఇదే ఆగస్టులో 190.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
మెగా స్టార్ ప్లానింగ్ మాములుగా లేదు.. వచ్చే రెండేళ్లు రఫ్ఫాడించబోతున్నారుగా
70 ప్లస్ అయితే ఏంటీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్ డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానేమో నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీసు రప్పాడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జోనర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంది యువీ క్రియేషన్స్. వీఎఫ్ఎక్స్ కారణంగా డిలే అవుతున్న నేపథ్యంలో ఎక్కడా రాజీ పడటం లేదు టీం. డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసిన వశిష్ట చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఓ వింతైన ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు ఎలా రప్పించాలో టెక్నిక్ తెలిసిన అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఫిల్మ్ మన శంకర్ వర ప్రసాద్ గారూ. రౌడీ అల్లుడు, గ్యాంగ్ స్టర్, ఘరానా మొగుడు తరహాలో వింటేజ్ చిరంజీవిని చూపించబోతున్నాడు. చిరు స్వాగ్‌ని కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులు ఆయన్ను ఎలా కోరుకుంటున్నారో అలానే తన మూవీలో ఉండనున్నారని హైప్ క్రియేట్ చేస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను చిరుకు మరింత చేరువ చేసేందుకు పుష్కలమైన కంటెంట్ వండి వార్చనున్నాడు అనిల్. వెంకీతో కలిసి మరోసారి మ్యాజిక్ చేయబోతున్నాడు. ఇక మాస్ ఆడియన్స్ కోసం బాబీని రంగంలోకి దింపారు చిరు. మెగా 158 ఎలా ఉండబోతుందో ఒక్క పోస్టర్ చెప్పకనే చెప్పేసింది. ఫక్త్ వయెలెంట్, ఫుల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కబోతున్నట్లు అర్థమౌతుంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీగా ప్లాన్ చేస్తోంది. సో ఇలా ముగ్డురు డైనమిక్ దర్శకులతో క్లాస్, మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు చిన్నా పెద్దా తేడాలేకుండా అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి.
రష్మిక విజయ్ ను గట్టెక్కిస్తుందా..?
రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్ కు ఓ సెంటిమెంట్. గతంలో వీరిద్దరు నటించిన గీతాగోవిందం బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది ఆ మూవీ. ఆ తర్వాత వచ్చిన కామ్రేడ్ మూవీ కూడా యావరేజ్ గా ఆడింది. అందుకే ఇప్పుడు రష్మిక సెంటిమెంట్ తనను హిట్ ట్రాక్ ఎక్కిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు విజయ్ దేవరకొండ. పైగా రాహుల మీద నమ్మకంతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం కలిసొచ్చే అంశం. ఇలా అన్ని విధాలుగా ఈ సారి పర్ ఫెక్ట్ చేసుకుని రంగంలోకి దిగుతున్నాడు విజయ్. అన్ని ఆయుధాలకు తోడు రష్మిక సెంటిమెంట్ తన వెనకుంది కాబట్టి ఈ సారి గట్టిగానే కొట్టాలని ఫిక్స్ అవుతున్నాడు విజయ్. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. 2026లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ ఫీ తగ్గింపు.. బిగ్ బాస్ 19లో కొత్త ట్విస్ట్ ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా టాప్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ కొత్త సీజన్‌తో సిద్ధమైంది. హిందీ బిగ్ బాస్ 19వ సీజన్ ఆగస్టు 24 ప్రారంభం అయ్యింది. ఈ షోలో ఎప్పటిలాగే సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉండంటంతో ప్రేక్షకులు మరింత ఖుఫి అవుతున్నారు.. అయితే ఈ సారి ఆయన రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్లో సల్మాన్ ఏకంగా రూ. 250 కోట్లు వసూలు చేశారు. 17వ సీజన్ కోసం ఆయన రూ.200 కోట్లు తీసుకున్నారు. కానీ సీజన్ 19 కోసం ఆయన ఫీ కేవలం.. రూ.150 కోట్లుకి తగ్గిపోయింది. దీనికి కారణం ఆయన హోస్టింగ్ డ్యూటీలు తగ్గించడం. గతంలో పూర్తిగా షో నడిపిన సల్మాన్, ఈసారి కేవలం 15 వారాల పాటు హోస్ట్ అవుతాడు. ప్రతి వీకెండ్ కోసం ఆయనకు దాదాపు రూ.10 కోట్లు చెల్లించనున్నారు. సల్మాన్ లేని వారాల్లో ఫరా ఖాన్ లేదా కరణ్ జోహార్ వంటి ప్రముఖులు గెస్ట్ హోస్ట్‌గా పాల్గొననున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరు గతంలో కూడా కొన్ని సార్లు బిగ్ బాస్ హోస్టింగ్‌లో భాగమయ్యారు. అలాగే ఈ సీజన్లో పోలిటికల్ థీమ్‌ను ఫీచర్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ షో ప్రారంభం కానుంది. మొదట జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది, తర్వాత కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. ఫ్యాన్స్ కోసం రాబోయే ఎపిసోడ్లలో ఎలాంటి కొత్త ట్విస్టులు ఉంటాయో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. సల్మాన్ ఫీ తగ్గిన విషయం, గెస్ట్ హోస్టులు, కొత్త థీమ్ అని కలిపి బిగ్ బాస్ 19 సీజన్‌ను ప్రత్యేకంగా చేస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.