Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 9 Am 21th May 2025

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

NTV Telugu Twitter
Published Date :May 21, 2025 , 9:14 am
By Sudhakar Ravula
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఫలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృషి.. నేడు రాష్ట్రానికి కుంకీ ఏనుగులు
ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృషి ఫలించబోతోంది.. రాష్ట్రంలో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నియంత్రించేందుకు, ఊళ్లపై పడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ.. ఎంతో మంది రైతుల, ప్రజల ప్రాణాలు తీసిన ఏనుగులను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు పవన్‌ కల్యాణ్.. అడవి ఏనుగులను కట్టడి చేయడానికి కుంకీ ఏనుగుల కోసం చర్చించి ఒప్పించారు.. ఇక, ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఆరు కుంకీ ఏనుగులను అందించబోతోంది కర్ణాటక ప్రభుత్వం.. అందులో భాగంగా నేడు బెంగళూరు వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణశాఖ మంత్రి పవన్ కల్యాణ్‌.. కుంకీ ఏనుగులను ఏపీకి రప్పించే కార్యక్రమానికి హాజరుకానున్నారు.. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది… శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను‌ అధికారికంగా ఈ రోజు ఏపీకి అప్పగించనుంది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరులో నేడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో కుంకీ ఏనుగులను అప్పగించనున్నట్టు ఇప్పటికే కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే తెలిపారు.. తమకు కుంకీ ఏనుగులు కావాలని గతేడాది ఆగస్టు 8వ తేదీన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కోరారు. ఇక, సెప్టెంబరు 27న విజయవాడకు నేను వెళ్లిన సమయంలో ఏనుగుల అప్పగింతకు ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు.. అందుకు అనుగుణంగా కుంకీ ఏనుగులను ఏపీకి అందించబోతున్నాం. ఏపీ నుంచి కర్ణాటకలోకి ఏనుగులు రాకుండా అక్కడి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే..

చల్లని కబురు.. ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు
రైతులకు చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను ముందుగానే పలకరించబోతున్నాయి.. కేరళ తీరాన్ని ముందుగానే తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు.. ఐదు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది.. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించి చురుగ్గా కదులుతున్నాయి రుతుపవనాలు.. ఇక, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ..

గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.. నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగనుంది.. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగ అమ్మవారికి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు.. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.. ఇక, కుప్పం పర్యటన ముగించుకొని సాయంత్రం తిరిగి అమరావతికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు… తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మకు సాంప్రదాయ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు, కుటుంబ సభ్యులు ఇవాళ కుప్పం రాబోతున్నారు.. ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీసు సూపరింటెండెంట్ మణికంఠ చందోలు ఇప్పటికే సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ (ASL) విధానాలను అధికారులు సమీక్షించారు, ద్రవిడియన్ యూనివర్సిటీ మైదానంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.. ప్రసన్న గంగమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ నిబంధనలు మరియు భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ మరియు ఎస్పీ సమీక్షించారు.

ఇది కదా సక్సెస్ అంటే.. మృత్యువును జయించి.. నేడు ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పిన స్వామీ వివేకానందా మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. తన లక్ష్యం పట్ల అంకితభావం, టార్గెట్ చేధించేందుకు తను చేసిన కృషి నేడు ఆయనను దేశ అత్యున్నత సర్వీసు అయిన ఐఎఫ్ఎస్ అధికారిని చేశాయి. మరణం అంచుల వరకు వెళ్లిన అతడు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌లో 112వ ర్యాంకును సాధించారు. అతను మరెవరో కాదు దేవానంద్ టెల్గోట్. ఇతడు మహారాష్ట్రకు చెందిన యువ సివిల్స్ అభ్యర్థి. మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన దేవానంద్ తీవ్రమైన కొవిడ్‌ భారినపడ్డాడు. 80 శాతం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ పాసయి ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలోనే కోవిడ్ సోకింది. మహారాష్ట్రలో కోవిడ్-19 చికిత్స పొందుతున్నప్పుడు, అతని ఊపిరితిత్తుల పరిస్థితి మరింత దిగజారింది. సివిల్స్ అభ్యర్థి కావడంతో, దేవానంద్ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్‌ను సంప్రదించగా, ఆయన KIMS ఆసుపత్రిని సంప్రదించమని సలహా ఇచ్చారు. వెంటనే దేవానంద్‌ను మహారాష్ట్ర నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ లోని బేగంపేట KIMSకు తీసుకువచ్చారు.

పెళ్లి పేరుతో మోసం.. బంజారాహిల్స్ లో లేడీ డాక్టర్ పై మరో వైద్యుడి లైంగిక దాడి
ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే రీతిలో ఓ వైద్యుడు లేడీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. తన కోరిక తీర్చుకున్నాక వివాహానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లేడీ డాక్టర్ హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ స్వామి పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అదికాస్త పెళ్లికి దారితీసింది. ఈ ఏడాది జనవరి లో పెళ్లి చేసుకుంటానని లేడీ డాక్టర్ ను నమ్మించాడు డాక్టర్ స్వామి. ప్రముఖ హోటల్ కు పిలిచి లేడీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి కి నిరాకరించాడు వైద్యుడు స్వామి. పెళ్లి పేరుతో మోసం చేయడంతో మహిళా వైద్యురాలు స్వామిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

బెంగళూరులో కుండపోత వర్షం కురిసే ఛాన్స్.. ఐఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా బెంగళూరు, ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక సోమవారం కురిసిన కుండపోత వర్షానికి ఇప్పటికే బెంగళూరు నగరం అతలాకుతలం అయింది. అలాగే మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఆర్థిక రాజధాని ముంబై కూడా నీట మునిగింది. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ బెంగళూరుకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం బెంగళూరులో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని 7 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే బెంగళూరు నగరం మునిగిపోయింది. ఇంతలోనే మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ -1533ను ఉపయోగించుకోవాలని పౌర సంస్థ సూచించింది.

బీజేపీ- కాంగ్రెస్ మధ్య పోస్టర్ వార్.. ప్రధాని మోడీ అలా.. రాహుల్ గాంధీ ఇలా..!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత అమెరికా జోక్యంతో పాక్ తో కాల్పుల విరమణకు భారత్ ఒప్పకోవడంతో ప్రధాని మోడీపై దేశ ప్రజలతో పాటు విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం కొనసాగుతుంది. ఇక, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ముఖాన్ని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో జత చేసి ‘వన్ అజెండా’ అని రాసిన పోస్టర్‌ను కమలం పార్టీ సమాచార్ శాఖ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ గాంధీ పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్నారు.. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాల్వియా ఆరోపించారు. అలాగే, ఆపరేషన్ సింధూర్‌తో విజయం సాధించిన భారత్ కు, ప్రధాన మంత్రిని రాహుల్ గాంధీ అభినందించలేదు అని అమిత్ మాల్వియా ఆరోపించారు. అభినందనలకు బదులుగా.. మనం ఎన్ని జెట్‌లను కోల్పోయామని పదే పదే అడుగుతాడు.. ఈ ప్రశ్నను ఇప్పటికే DGMO బ్రీఫింగ్‌లలో ప్రస్తావించారు.. యుద్ధ సమయంలో ఎన్ని పాకిస్తానీ జెట్‌లను కాల్చివేసారో తేల్చి చెప్పారని గుర్తు చేశారు. మాల్వియా వ్యాఖ్యలకు బీహార్ కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో పోల్చుతూ మరో ఫోటోను విడుదల చేసింది. ఈ ఫోటోకు “ఏక్ బిర్యానీ దేశ్ పర్ భరీ” అని క్యాప్షన్ పెట్టారు.

మరోసారి ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్.. అణు కేంద్రాలపై దాడికి ఐడీఎఫ్ ప్లాన్!
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు గాజాపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్ దళాలు.. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌తో అగ్ర రాజ్యం అమెరికా అణు ఒప్పందంపై కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఇజ్రాయెల్ దాడులకు సిద్ధపడుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఇరాన్ అణు కేంద్రాలపై ఐడీఎఫ్ దళాలు దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా నిఘా సంస్థ సూచించింది. అయితే దాడులపై ఇజ్రాయెల్ తుది నిర్ణయం తీసుకున్నారో లేదో స్పష్టం చేయలేదని నివేదికలు పేర్కొన్నాయి. ఒక ప్రణాళికతోనే ఇజ్రాయెల్ దాడులకు దిగుతున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అది జరిగితే అమెరికా చర్చలకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా నిఘా సంస్థ హెచ్చరికలపై వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఇప్పటి వరకు స్పందించలేదు. అమెరికా నుంచి ప్రకటన వచ్చి ఇన్ని గంటలు అవుతున్నా.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం కూడా స్పందించకపోవడం విశేషం.

సైనికుల దుస్తుల్లో టెర్రరిస్టులు.. భయపడుతున్న కాశ్మీరీలు..
పహల్గామ్ ఉగ్రవాద దాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతుంది. టెర్రరిస్టులు సైనికుల దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతుంది.. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు స్థానిక ప్రజలు. అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలోనూ ఇబ్బందులు వస్తున్నాయి. పహల్గామ్ దాడి జరిగినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. అయితే, ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు కూడా భారత సైనిక దుస్తుల్లో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు విచారణ చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది తేల్చింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో టెర్రరిస్టులు సైనికుల దుస్తుల్లో కనిపించినట్లు తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. అనుమానస్పందగా కనిపిస్తే.. తమకు సమాచారం అందించాలని ఇండియన్ ఆర్మీ పేర్కొనింది.

‘వార్ 2’ టీజర్‌లో కియారా బికినీ బ్యాక్‌పై ఆర్జీవీ బోల్డ్ కామెంట్..
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ .. గతంలో ఆయన సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకర్లేదు. కానీ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ కాస్త, వివాదాస్పద దర్శకుడిగా మారిపోయారు. నటినటులపై ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఎప్పుడు వార్తలో నిలుస్తున్నాడు, ముఖ్యంగా ఆయన వేసే ట్వీట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. వర్మ ఎక్కువగా అర్దరాత్రి ట్వీట్లు వేస్తుంటాడు. ఇందులో భాగంగా తాజాగా ‘వార్ 2’ టీజర్ మీద స్పందించాడు. తాజాగా విడుదలైన ‘వార్ 2’ టీజర్ తెలుగు,హిందీ భాషల్లో భారీ రెస్పాన్స్‌ని వచ్చింది. ముఖ్యంగా ఈ టీజర్‌లో హృతిక్, తారక్‌లు హైలైట్ అవుతారు అనుకుంటే.. అవుట్ ఆఫ్ ది సిలబస్ లా హీరోయిన్ కియారా అద్వానీ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆమెను చూపించిన ఆ కొన్ని షాట్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె మొదటిసారి బికినీ వేయడంతో ఆడియెన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలా, ‘వార్ 2’ టీజర్ నుంచి కియారా ఒక ఊహించని హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. ఇక, రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయం మీదనే బోల్డ్ కామెంట్స్ చేశారు.. ఎన్టీఆర్, హృతిక్ క్లోజప్ షాట్స్‌ను పెట్టి. కియారా బికినీ పోజులు, బ్యాక్ నుంచి స్టిల్స్‌ను షేర్ చేసి.. ‘కియారా బ్యాక్ ఎవరికి దక్కుతుందో’ అని తన స్థాయిని దిగజార్చుకునేలా వర్మ ట్వీట్ వేశాడు. వర్మ చేసిన ట్వీట్లు మీద నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

బాలయ్యతో క్రేజీ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న బోయపాటి ?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్ కాంబినేషన్‌ల్లో వస్తోన్న తాజా చిత్రం ‘అఖండ 2’. గతంలో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ కొట్టిందో చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘అఖండ 2’ని అంతకుమించి తీర్చిదిద్దేలా బోయపాటి శ్రీను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తుండగా బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించినప్పటికి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ రూమర్స్‌కి చెక్ పెడుతూ బోయపాటి శ్రీను కార్లిటీ ఇచ్చాడు. ‘ ‘అఖండ 2’ దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఈ సినిమా గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నప్పటికి. తాజాగా అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోల్ కోసం సీనియర్ హీరోయిన్‌ విజయశాంతి ను ఎంపిక చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నట. గతంలో బాలయ్య విజయశాంతి కాంబోలో మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి. దీంతో ఈ కలయిక మళ్లీ కుదిరితే అదిరిపోతుందని బోయపాటి ఫీల్ అవుతున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.ప్రజంట్ విజయ్ శాంతి కూడా ఫామ్ లోనే ఉంది. రీసెంట్ గా వైజయంతి మూవీతో మంచి హిట్ కూడా కొట్టింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • Off The Record: వైఎస్‌ జగన్‌ టీడీపీ మైండ్‌సెట్‌ని మార్చేశారా?

  • Off The Record: విశాఖలో ఎంపీ గొల్ల బాబూరావు ముందస్తు హంగామా..! దేనికి..?

  • Off The Record: వరంగల్ లో మంత్రి కొండా సురేఖపై ఎమ్మెల్యేల తిరుగుబాటు..?

  • Mylavaram Crime: మైలవరం చిన్నారుల హత్య కేసులో ఊహించని ట్విస్ట్..

  • Mohan Babu: ఈ “కన్నప్ప” సినిమాలో అందరూ హీరోలే

ట్రెండింగ్‌

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions