ప్యాకేజీ కోసమే పొత్తులు…. పవన్ ని నమ్మితే అంతే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాట్ కామెంట్లు చేశారు. పవన్ ప్రజల్లో తిరిగి వాస్తవం తెలుసుకుని మాట్లాడినట్టు ఉంది. పవన్ కళ్యాణ్ ఒక అపరిపక్వ నాయకుడుగా మిగులుతాడు. పవన్ స్పెషల్ ప్యాకేజీ కోసం పొత్తులు పెట్టుకుంటాడు.. ఎవరి ఎజెండాను పవన్ అమలు పరచాలనుకుంటున్నాడు. జనసైనికుల ఆశల మీద పవన్ నీళ్ళు చల్లాడన్నారు మంత్రి వేణుగోపాల్. పవన్ ను నమ్మిన వాళ్ళని దగా చేసాడు. చంద్రబాబు ను బార్ గెయిన్ చేయడానికి పనికొస్తుంది పవన్ బలం పెరిగిందని చెప్పడం. పవన్ వాస్తవం ఒప్పుకుని తప్పుకుని చంద్రబాబు కు అప్పగిస్తున్నట్టు కనిపించిందన్నారు. పవన్ చేసిన పనితో 2014-19 లో ప్రజలు నష్టపోయారని పవన్ ఆత్మసాక్షికి తెలియాలి. 2014-19 లో జరిగిన తప్పుల్లో పవన్ వాటాదారుడు. ప్రజలు, జగన్ పొత్తులను నమ్మలేదు… రైతుల దగ్గరకు వెళ్ళి కొంగజపం చేస్తున్నారు. ప్రకృతి వలన వచ్చిన కష్టాలను వికృతంగా చూపించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పవన్ స్వతంత్రంగా గెలవలేడు.. ఏ లక్ష్యాలతో పవన్ కు జనసైనికులు మద్దతిచ్చారో అది చేయలేనని చెప్పేశాడన్నారు మంత్రి వేణుగోపాల్.
జర్నలిస్ట్ హెల్త్ క్యాంప్ సద్వినియోగం చేసుకోవాలి
విధి నిర్వహణలో ఎన్నో వత్తిడులకు, వివిధ అనారోగ్య సమస్యలకు గురయ్యే జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణకు ఏపీ ప్రభుత్వం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. జర్నలిస్టులకు హెల్త్ క్యాంపు ప్రారంభించారు మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, విడదల రజని. లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో జర్నలిస్టులకు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ ఏర్పాటుచేసింది ప్రభుత్వం. అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు పూర్తి స్ధాయి వైద్య పరీక్షలకు ఏర్పాటు చేశారు. జర్నలిస్టులకు కుటుంబ సమేతంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు రోజులపాటు జరగనుంది హెల్త్ క్యాంప్. 11 ఆసుపత్రుల నుంచీ 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు.రెండవ రోజు వైద్యుల కన్సల్టేషన్ కు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. 47 నెలల పాలనలో సీఎం జగన్ 2.10 లక్షల కోట్లు డిబిటి ద్వారా ఇచ్చారు. జర్నలిస్టులు అనేక ఒత్తిడుల మధ్య పని చేస్తారు. జర్నలిస్టుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటుచేశామన్నారు. జర్నలిస్టు హెల్త్ స్కీం లో 1250 రూపాయలతో హెల్త్ కార్డు ఇస్తున్నామన్నారు. జర్నలిస్టులు అందరూ ఈ హెల్త్ క్యాంపు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు కమిషనర్ ఐ అండ్ పీఆర్ విజయ్ కుమార్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకోవాలంటే ఇన్స్యూరెన్స్ తప్పనిసరి. ఆరోగ్య శ్రీ మీద రూ.3300 కోట్లు ఖర్చు చేస్తున్నారు. EHS కి సమానంగా జర్నలిస్టు హెల్త్ స్కీం అమలు చేస్తున్నామన్నారు. కుటుంబం మొత్తం కవర్ అయ్యేలా ఇచ్చిన జర్నలిస్టు హెల్త్ స్కీం అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు కృష్ణబాబు. 5.3కోట్ల ఆంధ్రుల హెల్త్ రికార్డు ఫ్యామిలీ డాక్టర్ స్కీంలో పెట్టాం అన్నారు. ఈ క్యాంపులో మెమోగ్రామ్ ను భయం లేకుండా చేయించుకోవాలన్నారు.
స్వచ్చ తిరుమల-శుద్ధ తిరుమలలో పాల్గొనడం నా అదృష్టం
తిరుమల పవిత్రతకు, పరిశుభ్రతకు టీటీడీ ప్రాధాన్యత నిస్తోంది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి స్వచ్ఛ తిరుమల-శుద్ద తిరుమల కార్యక్రమం నిర్వహిస్తోంది. అలిపిరి వద్ద జెండా ఊపి స్వచ్చ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ. స్వచ్ఛ తిరుమల-శుద్ద తిరుమల కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టం అన్నారు మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వీ రమణ,ఇఓ ధర్మారెడ్డి. తిరుమల కొండల పరిశుభ్రంగా వుంచవలసిన బాధ్యత అందరి పైన వుంది. తిరుమల కొండలు ప్లాస్టిక్,వ్యర్ద రహిత ప్రాంతంగా వుంచడానికి కార్యక్రమాన్ని ప్రారంభించాం అన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. మొదటి ఘాట్ రోడ్డు ఏడవ మైలు వద్ద స్వయంగా పాల్గొన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. రెండు ఘాట్ రోడ్డులు, రెండు నడకమార్గాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భక్తులకు ప్లాస్టిక్ వ్యర్దాలను బయట ప్రాంతాలలో వెయ్యకుండా టీటీడీ సహకరించాలన్నారు. తిరుమలను రోజూ లక్షమంది వరకూ భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తులు వాడే వివిధ ప్లాస్టిక్ వస్తువుల వల్ల తిరుమలలో స్వచ్ఛత ప్రశ్నార్థకంగా మారుతున్న వేళ ఇటీవల టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ఎవరూ ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు, షాపుల యజమానులు కవర్లలో పెట్టి వస్తువులు అందించకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని, అతిక్రమిస్తే 25 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఈ నిబంధన కచ్చితంగా అమలు చేసేలా వారిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహిస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో రోడెక్కిన అన్నదాతలు
రాష్ట్రంలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది. వడగళ్ల వర్షానికి పంటలు తీవ్ర నష్టం జరిగింది. ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. వడగళ్లు పడటంతో రైతులకు తీవ్రంగా నష్టపోయారు. పొలాల్లో, రోడ్డుపై ఉన్న ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం కల్లాల్లోకి తీసుకువచ్చి నెల రోజులు అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆరబెట్టిన ధాన్యం రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్ద అయిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంట ఎలా వున్నా కొనాలని ఆదేశాలు జారీ చేసిన పంటలు కొనే దిక్కులేకుండా పోయింది. దీంతో సహనం కోల్పోయిన రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై ఆరేందుకు వేసిన వడ్లకుప్పపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ రేర్ రికార్డ్ ఉన్న ఏకైక హీరో ‘ప్రభాస్’…
రికార్డులో మన పేరు ఉండడం కాదు, మన పేరు మీదే రికార్డులు ఉంటాయి…” ఈ డైలాగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ప్రభాస్ ఏది చేసినా సంచలనమే. ప్రభాస్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా రికార్డులు బద్దలవుతున్నాయి. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ రికార్డ్స్ వేట కొనసాగుతునే ఉంది. ప్రజెంట్ ఆదిపురుష్‌తో కనివినీ ఎరుగని డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు, నెక్స్ట్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని సెట్ చేయబోతున్నాడు. రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ జూన్ 16న గ్రాండ్‌గా థియేటర్లోకి రాబోతోంది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. గ్రాఫిక్స్ పరంగా ఆదిపురుష్ విజువల్ వండర్‌గా నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్ వ్యూస్‌ని మార్క్‌ని టచ్ చేసింది. దీంతో వరల్డ్ వైడ్‌గా ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. గ్లోబల్ రేంజ్‌లో వరుసగా నాలుగు సినిమాలు, 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ట్రైలర్స్ ఉన్న ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బాహుబలి2, రాధే శ్యామ్, సాహూ, ఇప్పుడు ఆదిపురుష్.. ఈ సినిమాల ట్రైలర్లన్నీ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు సెట్ చేశాయి. మొత్తంగా ఈ రేర్ రికార్డు ఉన్న ఏకైక కటౌట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. ఇదే కాదు నెక్స్ట్ సినిమాలకి కూడా.. అంతకుమించి సెన్సేషన్ కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా. ఏదేమైనా… ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.
బీజేపీ గెలవాలని కాలినడకన తిరుపతికి కేంద్రమంత్రి
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్న నేపథ్యంలో కేంద్రమంత్రి ప్రహలాద్ జోషి అభ్యర్థన చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక అసెంబ్లీలోని మొత్తం 224 నియోజకవర్గాలకు 10వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు ముందు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మెజారిటీ అవసరమైన చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. సెక్యులర్ జనతాదళ్ అధినేత కుమారస్వామికి ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నికల అనంతర సర్వేలలో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని తేలింది. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి ప్రహలాద్ జోషి తిరుపతి వెంకన్నను సందర్శించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రహలాద్ జోషి దిగువ తిరుపతి నుండి ఎగువ తిరుపతికి నడిచారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే తనకు ముఖ్యమంత్రి పదవి దక్కాలని ప్రహలాద్ జోషి కాలినడకన వెళ్లి సామీ దర్శనం చేసుకున్నారని అంటున్నారు. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే ప్రహలాద్ జోషికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సెక్యులర్ జనతాదళ్ పార్టీ యోచిస్తోందని ఆ పార్టీ అధినేత కుమారస్వామి చెప్పారు.
పెళ్లికి రెడీ అంటున్న పరిణీతి.. అతనితోనే ఎంగేజ్ మెంట్
కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తి గా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో సోషల్ మీడియాలో పరిణీతి, రాఘవ్ చద్దా ప్రేమ వ్యవహారం వైరల్ అవుతోంది. పుకార్లకు నేటితో చెక్ పెట్టనున్నారు. పరిణీతి చోప్రా రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక మే 13న సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవనున్నట్టు తెలుస్తోంది. సిక్కు ఆచారాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుందని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఆర్దాస్ తర్వాత సుఖ్మణి సాహిబ్ తో ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొననున్నట్టు సమాచారం.పరిణీతి చోప్రా, రాఘవ్ చద్ధాల నిశ్చితార్థ వేడుక కోసం నటి ప్రియాంక చోప్రా ఢిల్లీ చేరుకున్నారు. అభిమానులు, ఫొటోగ్రాఫర్స్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కారులో అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ సమయంలో ప్రియాంక లేత గోధుమరంగు స్వెట్‌షర్ట్, మ్యాచింగ్ ప్యాంట్‌లను ధరించింది. తలపై నల్లటి టోపీ, మ్యాచింగ్ షూస్, డార్క్ సన్ గ్లాసెస్ కూడా ధరించింది. భుజానికి నల్ల బ్యాగ్ వేసుకుని.. కారు వైపు వెళుతుండగా, ఆమె ఒక చిరునవ్వు నవ్వి… ఫొటోగ్రాఫర్లకు రెండు చేతులు జోడించి నమస్కరించింది. దాంతో పాటు ఆమె తల ఊపుతూ ‘నమస్తే ‘ అని చెప్పి కారులో బయలుదేరింది.
ఎంత సక్కగున్నవే లీలా… ఎంత సక్కగున్నవే
ధమాకా సినిమాతో శ్రీలీల ఇండస్ట్రీలో హాట్ కేక్ అయ్యింది, ఎవరు ఏ సినిమా అనౌన్స్ చేసిన శ్రీలీలని హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల లేని తెలుగు సినిమా లేదంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా శ్రీలీల లైనప్ లో ఉన్న సినిమాల్లో PVT 04 కూడా ఒకటి. మెగా మేనల్లుడు, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ హీరోయిన్ అపర్ణ దాస్ మరో కీ రోల్ లో కనిపించనున్న #PVT04 సినిమాకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈరోజు గ్లిమ్ప్స్ అనౌన్స్మెంట్ ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి శ్రీలీల క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీలీలా చాలా క్యూట్ గా కనిపించి, అట్రాక్ట్ చేస్తోంది. ‘చిత్ర’ అనే పాత్రలో శ్రీలీల నటిస్తుందని మేకర్స్ పోస్టర్ ని లాంచ్ చేశారు. దీంతో ఈ యంగ్ హీరోయిన్ ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో #PVT04 పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. శ్రీలీల క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే యూత్ ని థియేటర్స్ కి రప్పించడం ఈజీ. మరి వైష్ణవ్ తేజ్ సినిమాకి శ్రీలీల క్రేజ్ ఎంత వరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.