NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

సంక్షేమానికి కోత పెట్టారు. బడ్జెట్ లో కొత్తదనం ఎక్కడ?

ఆర్థికమంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన 2023-24 వార్షిక బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. వైసీపీ ప్రభుత్వం డీబీటీల విషయంలో చెప్పేదొకటి.. చేసేదొకటి.గతేడా డీబీటీ స్కీంల కోసం జరిపిన కేటాయింపుల కంటే రూ. 2 వేల కోట్ల మేర తక్కువగా ఖర్చు పెట్టారు.సంక్షేమ పథకాల్లో కోత విధించడం వల్లే కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు పెట్టారని అర్తమవుతోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో డీబీటీల నిమిత్తం రూ. 54 వేల కోట్లు కేటాయించారు.సంక్షేమానికి ఈ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే కేటాయిస్తోంది.రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులు 60 శాతం మేర ఉంటే అరకొర కేటాయింపులు ఏ మాత్రం సరిపోతుంది..?విద్య, వైద్యం వంటి రంగాలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదు.ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు.ఫీజు రీ-ఇంబర్సుమెంట్ లోపభూయిష్టంగా ఉండడంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి.. డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి.దీని వల్ల విద్య, వైద్య సేవలు అందక పేదలు ఇబ్బంది పడడుతున్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో కొత్తదనం లేదు.ఇప్పటి వరకు వైసీపీ నాలుగు బడ్జెట్టులు ప్రవేశ పెట్టినా ఎలాంటి అభివృద్ధి చూపడం లేదు.

వెల్లుల్లితో ఆరోగ్యం మెరుగు.. రోజూ తినండి

మనలో చాలామందికి కొన్ని రకాల ఆహారపదార్ధాలు, చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు తినడం అంతగా అలవాటు ఉండదు. అందులో ముఖ్యమైంది వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కేవలం మాంసాహారం, చేపలు వంటివి తిన్నప్పుడు మాత్రమే వాడతారు. కానీ అల్లం, వెల్లుల్లిని విడిగా రోజువాడితే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో తెలీదు. వెల్లుల్లిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి. వెల్లుల్లిని ఏ రూపంలోనైనా మన డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. వెల్లుల్లిని ఎక్కువగా నూనె, క్రొవ్వు పదార్థములు తినేవారు వెల్లుల్లి తప్పని సరిగా వాడాలి. వెల్లుల్లి మాంసాహారం మరియు ఇతర క్రొవ్వు పదార్ధములలో ఉన్న క్రొవ్వునకు విరుగుడుగా పని చేస్తుంది. గుండె జబ్బులను రానివ్వదు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. వెల్లుల్లిని రోజూ వాడేవారు తక్కువగా అనారోగ్యం బారిన పడతారని డాక్టర్లు చెబుతున్నారు.

అమ్మాయిలకు కావాల్సింది అబ్బాయిలా.. ఆఫర్లా..

కొన్ని నిజాలు చెప్పడానికి కఠినంగా ఉన్నా.. అవి నిజాలు అంటారు కొంతమంది. వాటిని సామాన్యులు చెప్తే పెద్ద పట్టించుకోరు కానీ.. ఏ ఒక సెలబ్రిటీ చెప్తే మాత్రం ప్రతిఒక్కరు వింటారు. వినడం పక్కన పెడితే.. కొంతమంది సపోర్ట్ చేస్తారు.. ఇంకొంతమంది విమర్శిస్తారు. అయితే ఆ ప్రశంసలు, విమర్శలు సమానంగా తీసుకున్నవారే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వగలరు. తాజాగా బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి చేసిన స్టేట్మెంట్స్ సైతం అలానే ఉన్నాయి. ఒక మహిళ అయ్యి ఉండి మిగతా మహిళలను కించపరుస్తోంది అని కొంతమంది కామెంట్స్ చేసినా ఆమె అన్నదాంట్లో తప్పేం ఉంది అని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఇంతకు ఆమె ఏమన్నదీ..? ఎవరు ఈ హీరోయిన్ అనేది తెలుసుకుందాం. ఈ కామెంట్లు చేసింది ఎవరో కాదు సోనాక్షి కులకర్ణి.

కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది

తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన.. ఈ పేపర్ లీకేజ్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ, హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద శాంతియుత నిరసన చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని కూడా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పై నుంచి ఆదేశాలు లేనిదే ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ సాధ్యం కాదన్న ఆయన.. ఈ లీక్‌తో మోసపోయామని భావించిన వందలాది మంది యువకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడి చేయలేరన్నారు. మహిళలను సైతం విచక్షణారహితంగా కొట్టారన్నారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారన్నారు.

ప్రధాని కార్యాలయ అధికారినంటూ ఫోజ్

ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంఓ) అధికారినంటూ గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగాన్నే బురిడి కొట్టించాడు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతూ.. స్టార్ హోటళ్లలో బస చేస్తూ సకలభోగాలను అనుభవించాడు. ఇదిలా ఉంటే సరిహద్దులోని సున్నిత ప్రాంతాలను పర్యటించాడు. ఆయనకు భద్రత కల్పిస్తున్న సిబ్బందితో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అయితే చివరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు పట్టుబడ్డాడు.మొత్తం అధికార యంత్రాంగాన్ని చీట్ చేసిన వ్యక్తి పేరు కిరణ్ భాయ్ పటేల్. పీఎంఓలో అడిషనల్ డైరెక్టర్ అని తనను తాను జమ్మూ కాశ్మీర్ అధికారులకు పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అక్కడి బీజేపీ కార్యకర్తలను, నాయకులను కలిశాడు. దూద్ పత్రి, గుల్ మార్గ్, దాల్ సరస్సుతో సహా పలు ప్రదేశాల్లో అత్యున్నత భద్రతా సిబ్బంది మధ్య వీఐపీ ట్రీట్మెంట్ ను పొందాడు. దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుండే వాడు.

మనీష్ సిసోడియా ఈడీ విచారణలో సంచలన విషయాలు

ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను ఈడీ విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కు అయి 5 శాతం నుంచి 12 శాతం మార్జిన్ పెంచినట్లుగా తేలింది. ఆధారాలు దొరక్కుండా అన్ని డిజిటల్ ఫోన్లను ధ్వంసం చేశారు. ఓబెరాయ్ హోటల్ కేంద్రంగా ఇవన్నీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి కీలక డిజిటల్ సాక్ష్యాలను మాయం చేశారు. లిక్కర్ స్కాం సమయంలో 14 ఫోన్లను ధ్వంసం చేశారని తేలింది. దర్యాప్త సంస్థల సోదాల్లో ఒక ఫోన్ మాత్రమే సీజ్ చేశారు. ఇంటరాగేషన్ లో మరోరెండు ఫోన్లను సీజ్ చేశారు అధికారులు.ఢిల్లీ లెఫ్టినెంగ్ గవర్నర్ ఫిర్యాదు చేసిన వెంటనే 8 నెలలుగా వాడుతున్న ఫోన్ ను సిసోడియా గతేడాది జూలైలో ధ్వంసం చేశారు. ఎల్జీ ఫిర్యాదు చేసిన తర్వాత నుంచే ఫోన్లను ధ్వంసం చేశారు. అక్రమ నగదు చలామణికి సంబంధించిన అనేక ఆధారాలు ఈ ఫోన్లలో ఉన్నాయి. ఇతరుల పేర్లలో సిమ్ కార్డులను ఈ ఫోన్లలో వాడారు. అయితే ఇదంతా రొటీన్ ప్రాక్టీస్ లో భాగంగానే చేసినట్లు సిసోడియా ఈడీకి సమాధానం చెప్పాడు. అయితే 6 నుంచి 12 శాతం కమిషన్ పెంచాలని మంత్రుల బృందం సమావేశంలో చర్చలు ఏం జరగలేదని, కమిషన్ పెంచాలన్న నిర్ణయంలో మద్యం శాఖ పాత్ర ఏమీ లేదని అధికారులు తెలిపారు.

బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ.. కేటీఆర్ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ అని మరోసారి రుజువైందని మంత్రి కే. కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని.. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం పరిమితం అనే కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ మహా అజ్ఞాని అని తేలిపోయిందని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్ధల పనితీరు, వాటి పరిధుల గురించి అవగాహన లేకుండా.. బండి సంజయ్ ఎంపీ ఎలా అయ్యాడో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా దిగజారుడు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన, సమర్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధరణిపై కూడా అర్థరహితమైన ఆరోపణలు చేయడం.. బండి సంజయ్ దగుల్బాజీ రాజకీయాలకు నిరద్శనమన్నారు. బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు.. ధరణి పోర్టల్, టీఎస్‌పీఎస్‌సీ అంశంతో ముడిపెట్టి తనపై అసత్యమైన ఆరోపణలు చేయడం సహించబోనని హెచ్చరించారు. గతంలో ఇంటర్ పరీక్షలపై కూడా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ పరువునష్టం కేసు ఎదుర్కోంటున్నారన్నారని, అయినా అతనికి బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. రాజకీయ దురుద్దేశంతో బండి సంజయ్ చేస్తున్న ఈ కుట్రలకు.. రానున్న రోజుల్లో క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడురోజులు భారీ వర్షాలు

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. రేపు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం వుంది. భారీ వర్షాలు, పిడుగుపాటు నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డా. బి ఆర్ అంబేద్కర్ విపత్తుల సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం ఉన్నపుడు పొలాల్లో, చెట్ల క్రింద ఉండరాదని పేర్కొంది. బయటకు వెళ్ళేటప్పుడు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.ఇటు తిరుపతిలో వర్షం పడింది. తిరుమలలోనూ భారీ వర్షం కురవడంతో భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులుతో పడుతున్న వర్షంతో వాతావరణం చల్లబడింది. పిడుగులు పడుతూ వుండడంతో తిరుపతిలో పలు ప్రాంతాలలో విద్యుత్త్ సరఫరా నిలిచిపోయింది. అనంతలో భారీ వర్షం పడుతోంది. ఇటు హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. రాత్రి నుంచి కురిసిన వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.