NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

బండి సంజయ్ కి షాక్.. విచారణకు రావాల్సిందే

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించబోనని వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీసుకుంది. ఈ నెల 15 తేదీన ఉదయం 11 గంటలకు బండి సంజయ్ విచారణకు రావాలని మహిళా కమిషన్ నోటీసులను జారీ చేసింది.

రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే.. అది పవన్ కే వచ్చేది

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పేర్ని నాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ రసకందాయంగా నడుస్తోంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన మజీ మంత్రి పేర్ని నాని పవన్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ఆస్కార్ ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ కే వచ్చే ఉండేది. మరో నామినేషన్ కూడా వచ్చి ఉండేది కాదు.హరిరామ జోగయ్య ను చూస్తే జాలేస్తోంది.పవన్ కళ్యాణ్ నెలలో రెండు రోజులే కదా ఇక్కడ ఉండేది. మిగిలిన రోజులన్నీ తెలంగాణలోనే ఏడుస్తావ్ గా. తెలంగాణ లో ఎందుకు ప్రశ్నించవు?? కేసీఆర్ ను ఎందుకు నిలదీయవు?? అని ప్రశ్నించారు పేర్ని నాని. నిలకడ లేని పవన్ ను ప్రజలు ఎందుకు నమ్మాలి?? ధైర్యం ఉంటే మా ఉమ్మడి ప్రభుత్వం చేసిన పనులే మళ్ళీ చేస్తాం అని చెప్పండి. చంద్రబాబులో ఉన్న రాజకీయ నిబద్ధత కూడా పవన్‌కు లేదు. కాపుల రిజర్వేషన్ల కోసం పవన్ ఏం చేశాడు?పవన్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయ్యింది?? అన్నారు పేర్ని నాని. ఇటు పవన్ పై తనదైన రీతిలో ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో అంబటి రాంబాబు పవన్ పై సెటైర్లు వేశారు. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకి తాకట్టుపెట్టడమే సోషల్ ఇంజనీరింగ్ అనుకుంటున్న పవన్ ని జాతి క్షమించదు అన్నారు అంబటి రాంబాబు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రి ప్రకటన.. ఏం అన్నారంటే?

ఏపీలో విశాఖ స్టీల్ పై కేంద్రం వైఖరిని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే లిఖిత పూర్వక సమాధానం అందించారు. 2021 జనవరి 27 వ తేదీన జరిగిన “ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ” ( సిసిఈఏ) సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో 100 శాతం కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అలాగే, సంయుక్త రంగం, అనుబంధ రంగాల్లోని “విశాఖ స్టీల్” వాటాల ఉపసంహరణకు కూడా సిసిఈఏ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న వాటాల ఉపసంహరణ నిర్ణయాన్ని పునః సమీక్షించే ప్రతిపాదన ఏమీ లేదు. విశాఖ స్టీల్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. “విశాఖ స్టీల్” యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోందని సమాధానంలో పేర్కొన్నారు మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది

ఏపీలో ఇవాళ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అనేక చోట్ల అధికార పార్టీ అండదండలతో బోగస్ ఓట్లు పోలయ్యాయి. పదో తరగతి పాసైనవారు గ్రాడ్యుయేట్లుగా చలామణి అవుతూ ఓటేశారు. ఇవాళ జరిగిన ఎన్నికలపై టీడీపీ మండిపడింది. ఈసీకి మరోసారి కంప్లైంట్ కూడా చేసింది. బోగస్ ఓట్ల బాగోతంపై హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయ పోరాటం చేస్తాం అన్నారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. తిరుపతి ఎస్పీ అండతోనే దొంగ ఓటర్లు రెచ్చిపోయారు.తప్పు చేసిన అధికారులకు శిక్షపడక తప్పదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది.ఎమ్మెల్సీల గెలుపు కోసం ఇంతలా దిగజారిన ఘటనలు గతంలో లేవు.అక్రమాలు అరికట్ట లేనప్పుడు, ఇక ఎన్నికల అధికారులెందుకు..?తిరుపతిలో రౌడీ మూకలు ఇష్టారీతిన దొంగ ఓట్లు వేసుకున్నప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎందుకు..?జగన్ ప్రభుత్వంలో ఐదో తరగతి చదువుకున్న వాళ్ళు కూడా పట్టభద్రులయ్యారు.ఆధారాలతో సహా బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.వై నాట్ 175 ప్రణాళిక ఇదేనా..?లోకేషుని పాదయాత్ర సైట్లో ఉండనివ్వకుండా నోటీసులు మీద నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డికి ఎలా మినహాయింపు ఇచ్చింది..? అన్నారు బోండా ఉమా.

నిన్న పవన్ ఉమనైజర్ అన్నాడు.. నేడు సమంత అబార్షన్ అంటున్నాడు

క్రిటిక్స్ పేరుతో సోషల్ మీడియాలో కొంతమంది చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కేఆర్ కె, ఉమైర్ సంధు అనే ఈ ఇద్దరు చేసే రచ్చ అయితే అస్సలు తట్టుకోలేం. హీరోలు.. వారి పర్సనల్స్.. హీరోయిన్స్.. వారి నగ్న చిత్రాలు అన్ని నా దగ్గర ఉన్నాయని కేఆర్ కె అంటే.. టాలీవుడ్ హీరోలు ఇలాంటి వారు అంటూ ఉమైర్ సంధు చేసే ట్వీట్స్ కు అభిమానులు రెచ్చిపోయి ఆడేసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఉమైర్.. టాలీవుడ్ హీరోలనే టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ను ఉమనైజర్ అన్నాడు. ఆ తరువాత మహేష్ బాబు.. పూజా హెగ్డే తో కలిసి ఉంటుంది అన్నాడు. దీంతో అతగాడిని టాలీవుడ్ అభిమానులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. మా హీరోల గురించి నువ్వు చెప్పేంత మగాడివి అయ్యావా అంటూ వార్నింగ్ లు కూడా ఇచ్చేస్తున్నారు. అయినా ఉమైర్ తగ్గేదేలే అంటూ నోటికి ఏది వస్తే అది ట్వీట్ చేసి లైక్స్ కోసం షోలు చేస్తున్నాడు.

దారుణం.. గోవా పర్యటనకు వెళ్లిన ఢిల్లీ ఫ్యామిలీపై కత్తులతో దాడి

గోవాలో దారుణం చోటు చేసుకుంది. సరదాగా కాలక్షేపం చేద్దామని గోవాకి వచ్చిన ఢిల్లీ కుటుంబంపై.. ఒక దుండగుల ముఠా కత్తులతో దాడి చేసింది. అంజునా ప్రాంతంలోని ‘స్పాజియో లీజర్‌’ రిసార్టులో ఈ ఘోరం వెలుగు చూసింది. ఈ దాడి విషయాన్ని బాధితుడు జతిన్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. తమపై దాడి జరగడానికి ముందు.. హోటల్ సిబ్బందితో గొడవ జరిగిందని అతడు తెలిపాడు. తమ పట్ల సిబ్బంది అనుచితంగా ప్రవర్తించడంతో.. వారిపై తాము హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశామని, ఆయన వెంటనే సిబ్బందిని తొలగించాడని పేర్కొన్నాడు. అనంతరం తమ కుటుంబం హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్ వద్ద సేదతీరుతుండగా.. కొందరు వ్యక్తులు గేటు వద్ద గుడిగూడి ఉండటాన్ని గమనించామన్నారు. ఆ గుంపులో.. హోటల్‌లో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ దుండగులు తమపై కత్తులతో విరుచుకుపడ్డారని వెల్లడించాడు. ఈ దాడిలో జతిన్‌కి, అతని తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.

వర్మ.. నవీన్ హత్యకేసుపై ఓ సినిమా తీస్తే…

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది ఉందో వోడ్కా తాగేసి మొహమాటం లేకుండా ముఖం మీదే చెప్పుకొస్తాడు. అయితే కొన్నిసార్లు పాజిటివ్ గా ఇంకొన్ని నెగెటివ్ గా ఉండడంతో అభిమానులు ఎప్పుడు వర్మ ఎలా ఉంటాడో అర్ధం కాక తలలు పట్టుకుంటూ ఉంటారు. మొన్నటివరకు కుక్కలు.. మేయర్ వెనుక పడ్డ వర్మ.. తాజాగా నవీన్ హత్య కేసు మీద పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడును చంపేసిన హరిహర కృష్ణ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. ఆ స్టోరీని ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు. హరిహర కృష్ణ, నవీన్, నిహారిక ఫోటోలను చూపిస్తూ.. ఈ అమ్మాయి కోసం కింద ఉన్న యువకుడు పైనున్న యువకుడును హత్య చేశాడు. ప్రేమ గుడ్డిది అని నాకు తెలుసు కానీ.. మరీ ఇంత గుడ్డిది అని తెలియదు ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. అమ్మాయి అందంగా లేదు అంటే.. అందంగా ఉంటే చంపినా తప్పు లేదా అని కొందరు. ఇంకే ఇంకో కొత్త సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయ్యింది.. ఇక మొదలుపెట్టు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. నవీన్ హత్యకేసు గురించి అందరికి తెల్సిందే. హరిహర కృష్ణ, నిహారిక ప్రేమికులు.. హరిహరి కృష్ణ స్నేహితుడు అయిన నవీన్.. నిహారికతో చనువుగా ఉంటున్నాడని ప్లాన్ వేసి నవీన్ అతి క్రూరంగా హరిహర కృష్ణ హత్య చేసి.. శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి విసిరేశాడు. ప్రస్తుతం హరిహర కృష్ణ, నిహారిక జైల్లో ఉన్నారు.

నోరా ఫతేహి సర్దేసుకోవాల్సిందే.. ఏం ఊపుతున్నావు పిచ్చెక్కించావుపో

ఈ రోజుల్లో డ్యాన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే పెళ్లి వేడుకలోనో, మరేదైనా ఫంక్షన్లోనో చిన్నప్పటి నుంచి పెద్దల వరకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు. ఒక్కోసారి వాళ్ల డ్యాన్స్ చూసి నవ్వుకుంటారు, ఇంకొందరు బాగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. అలాంటి వ్యక్తి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి కంగుతింటున్నారు. ఈ వీడియోలో ఓ వృద్ధుడు బాట్ల హౌస్ సినిమాలోని ‘సాకి-సాకి’ పాటకు డ్యాన్స్ ఇరగదీశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, ఆ పాటకు ఓ అంకుల్ చాలా ఇంటెన్స్‌గా కూల్‌గా డ్యాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. అతడి లుక్, నడుము తిప్పడం.. హావభావాలు నోరా ఫతేహి డ్యాన్స్ ను మైమరిపించేశాయి. వివిధ రకాల డ్యాన్స్‌లను చూశాం.. కానీ, కాకా ఇంత కూల్ స్టైల్‌లో డ్యాన్స్ చేయడం చాలా అరుదు.. పిచ్చెక్కించేశాడు. శుభాకాంక్షలు అద్భుతమైన డ్యాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు ఒక మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. లక్ష 7 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. వీడియోను చూసిన ఒకరు సరదాగా ‘ఈయన నోరా ఫతేహీ తండ్రి’ అని అంటుంటే, ‘డాన్స్‌కి వయసు లేదు’ అని మరొకరు అంటున్నారు. అంకుల్ డ్యాన్స్ బాగా చేశాడు. అదేవిధంగా, మరొక వినియోగదారు “ఇప్పుడు నోరా ఫతేహి అవసరం లేదు, ఎందుకంటే నోరా ఫతేహి 2.0 మన దేశంలో కనుగొనబడింది. ఇప్పుడు ఆమె డ్యాన్స్ ప్రమాదంలో పడింది అంటూ కామెంట్లు చేశారు.