Ntv top-headlines March 10, 2023 -at-1PM
ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక భేటీ
ఈరోజు భారత రాష్ట్ర సమితి, పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లను సమావేశానికి ఆహ్వానించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలు ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన ప్రచార ప్రణాళికతోపాటు పార్టీ చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పార్టీ నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. కవితకు ఈడీ నోటీసులను ఈ సమావేశంలో ఖండించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్ తీరుతో పాటు జాతీయ స్థాయిలో బీఆర్ ఎస్ విస్తరణ సహా ఇతర అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11 రోజులు మాత్రమే
ఏపీలో బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయింది. ఏపీ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు ఈ సారి 11 రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ నెల 14న ప్రారంభమయ్యే ఈ భేటీలు 29 వరకు జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మధ్యలో శని, ఆదివారాలు, ఉగాది సెలవు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సభ జరగనుంది. 17వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టి, 18, 19 సెలవులు ప్రకటించనుంది. అలాగే 22న ఉగాది సందర్భంగా సెలవు రానుంది. 25, 26 తేదీల్లో శని, ఆదివారాలు కాగా, 30న శ్రీరామనవమి సెలవు కావడంతో 29నే సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తేదీలను అధికారికంగా బిజినెస్ సలహా మండలి సమావేశంలో ఖరారు చేయాల్సి ఉంటుంది. ఉభయ సభలనుద్దేశించి నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు.
శాస్త్రవేత్తల అరుదైన రికార్డ్.. రెండు మగ ఎలుకల నుంచి సంతానం
జపాన్ సైంటిస్టులు ఓ అరుదైన రికార్డ్ సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి ఓ సంతానాన్ని ఉత్పత్తి చేశారు. జపాన్ లోని క్యుషు, ఒసాకా యూనివర్సిటీల శాస్ర్తవేత్తల టీం ఈ ఘనత సాధించింది. పురుష జీవుల జీవుల చర్మకాణాలలో నుంచి.. అండాలను సేకరించి ఈ ఎలుకలను రూపొందించినట్లు ది గార్డియన్ అనే వార్తా పత్రిక తెలిపింది. మానవులలో కొత్త సంతానోత్పత్తి చికిత్సలకు ఇది దోహదపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పద్దతిలో ఇద్దరు పురుషులు కలిసి.. పిల్లల్ని కనేందుకు దోహదపడుతుంది.టర్నర్స్ సిండ్రోమ్ వంటి సంతానోత్పత్తి చికిత్సకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎక్స్ క్రోమోజోమ్ పూర్తిగా,, పాక్షికంగా మిస్ అయిన ఈ పద్దతిలో విజయవంతంగా చికిత్స చేయవచ్చు. పరుష అండాలను ఉపయోగించి ఓ బలమైన క్షీరదాన్ని సృష్టించడం ఇదే ఫస్ట్ టైం. క్యుషు యూనివర్సిటీ శాస్త్రవేత్త.. కట్సుహికో హయాషి వెల్లడించారు.
అర్జా శ్రీకాంత్ ని వేధిస్తే తాటతీస్తాం
వైసీపీ పాలన, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు. గత ప్రభుత్వంలో అన్నీ స్పష్టంగా ఉన్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.బాబాయి హత్య కేసును పక్క దారి పట్టించేందుకు సీఐడీతో రిటైర్డ్ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.వివేకా హత్యపై నిజానిజాలు తేలుతున్న సమయంలో సీఐడీ భాస్కర్ అనే సీమెన్స్ ఉద్యోగిని అరెస్ట్ చేస్తే కోర్టు రిమాండును రిజెక్ట్ చేసింది.రూ. 370 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో సీఐడీ తేల్చలేకపోయింది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీకి సంబంధం లేదు.ఇది జీఎస్టీ కేసు దీనిపై ఈడి దర్యాప్తు చేస్తోంది.అర్జా శ్రీకాంత్ ఏ ఫైల్ పైనా సంతకం చేయలేదు..?తాడేపల్లి ఆదేశాలను పాటిస్తున్న అధికారులకు కూడా అదే గతి పడుతుంది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో పద్ధతి ప్రకారం టీడీపీపై బురద జల్లుతున్నారు . అర్జా శ్రీకాంత్ ను సీసీ కెమెరాలు, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలి.ఈ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టులో నిలబెడతాం. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణా కోర్టును ఆశ్రయించారు. శ్రీకాంత్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే తాట తీస్తాం అన్నారు.
కరోనా లేదు.. కానీ కొచ్చిలో లాక్ డౌన్
కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అంత తేలికగా మర్చిపోరు. కానీ ఓ నగరంలో కరోనా వ్యాప్తి అంత లేకపోయిన అక్కడ లాక్ డౌన్ పరిస్థితి కనిపిస్తోంది. వివరాలు.. కోవిద్ వ్యాప్తి లేకపోయినా కేరళ రాష్ట్రం కొచ్చిలో లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొచ్చి సమీపంలోని బ్రహ్మపురం పరిసరాల్లో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అన్నీ బంద్ పెట్టి బయట అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదు. కారణం ఓ భారీ డంప్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదం. బ్రహ్మపురం డంప్‌యార్డులో గత వారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. కానీ, 110 ఎకరాల్లో విస్తరించిన ఆ డంప్ యార్డ్ లో ఇంకా అక్కడక్కడా మంటలు కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చెత్త, అందులోని ప్లాస్టిక్ కాలి విషపూరిత పొగలు రావడంతో చుట్టూ కొన్నికిలో మీటర్ల పరిధిలోని జనాలు వాటిని పీల్చి ఉక్కిరిబిక్కిరయ్యారు. ‘మొదట్లో బాగానే ఉంది కానీ ఆదివారం నుంచి వాసన మరీ ఎక్కువైంది. బాల్కనీ, కిటికీలు తెరవలేక పోయాం. కరోనా వాపస్ వచ్చినట్టు అనిపిస్తోంది. రాత్రి అయితే వాసన మరీ ఎక్కువగా వస్తోంది’ అని అక్కడి మహిళ తమ ఇబ్బందిని తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు బ్రహ్మపురంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఇది రాక్షస ప్రభుత్వం….సీఐడీని అడ్డంపెట్టుకుని రాజకీయాలా?
జగన్ ప్రభుత్వ పాలనపై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. దమ్ముంటే రాజకీయం చేయండి.గాలోల్ల చేత బూతులు తిట్టించి రాజకీయాలు చేయవద్దు…తప్పుడు కేసులు పెట్టి ఓ రిటైర్డ్ ఐఏఎస్ ను ఢిల్లీ నుండి తీసుకు వచ్చి కొడతారా? సీనియర్ మాజీ ఐఏఎస్ శ్రీకాంత్ ను ప్రభుత్వం వేధిస్తుంది…పోలీసు వ్యవస్థను దిగ జార్చి కొంతమంది అధికారులు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారు…నేను మంత్రి గా ఐదుగురు ముఖ్య మంత్రు ల వద్ద 14 ఏళ్లు పని చేశాను. సీఐడీని అడ్డం పెట్టి అధికారులను వేధించే ఇలాంటి సీఎంని నేను ఎక్కడ చూడలేదు. సీఎం జగన్ చేస్తున్న అరాచకం ఆపాలి…జగన్ బాబాయ్ కేసు లో సీబీఐ ఏం చెప్తుంది జగన్ కు వినపడటం లేదా..గత టీడీపీ ప్రభుత్వం లో మూడు లక్షల కోట్లు అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు..ఒక్క ఆధారం ఐనా నిరూపించ గలిగారా? అని ప్రశ్నించారు కన్నా.
ఇండోనేషియా రాజధాని మార్పు..?
ఇండోనేషిమా రాజధాని ఏదంటే టక్కున చెప్పే ఆన్సర్ జకార్తా. అయితే మరికొద్ది నెలల్లోనే ఆ దేశ రాజధాని జకార్తా కాదు.. దానికి రెండు వేల కిలోమీటర్ల దూరంలోని బోర్నియో ద్వీపంలోని నుసంతర ప్రాంత్రం. ప్రస్తుతం కొత్త రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అసలు రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు.. ? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటీ..? కొత్త నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది?.ఇండోనేషియా అనేక దీవుల సమాహారం. ఎక్కువ భాగం అటవీ ప్రాంతం కావడం వల్ల నేలపై జనాభా ఒత్తిడి ఉంటుంది. జావా ద్వీపంలోని రాజధాని జకార్తా ఇప్పటికే ఒకటిన్నరకు పైగా జనాభాతో కిక్కిరిసిపోయింది. మరో పక్క సముద్రతీరంలోని జకార్తా ఏటా కిందకు కుంగుతోంది. ఏటా కొన్ని సెంటిమీటర్ల మేర నేల కుంగుతోంది. దీంతో జకార్తా ఎదుర్కొంటున్న భారీ పర్యావరణ సవాళ్ల నుంచి రిలీప్ పొందేందుకు ఇండోనేషియా ప్రభుత్వం రాజధాని నగరాన్ని మార్చుతుంది. బోర్నియో ద్వీపంలోని తూర్పున గల కాలిమాంటన్ అటవీ ప్రాంతంలో నుసంతర పేరిట కొత్త నగరాన్ని ఇండోనేషియా ప్రభుత్వం నిర్మిస్తోంది. అసలు ఇండోనేషియా రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు? ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి? పర్యావరణ కార్యకర్తలు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? కొత్త రాజధాని నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతుంది? బోర్నియో ద్వీపంలోని కొత్త రాజధాని నగరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
ఔను.. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు
అవును.. కొంతకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన తాము పెళ్లి చేసుకోబుతున్నామని చెప్పిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైంది. తమ పెళ్లికి సంబంధించిన వీడియోని ట్విటర్ మాధ్యమంగా నరేష్ పంచుకున్నారు. ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముడ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ.. మీ పవిత్ర నరేష్’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా.. కేవలం కొందరు సన్నిహితుల సమక్షంలోనే వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది.కాగా.. సినిమాల సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం, కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారింది. కొన్నాళ్లు సీక్రెట్‌గానే తమ ప్రేమాయణాన్ని కొనసాగించిన ఈ జంట.. ఆ తర్వాత బహిరంగంగా తమ ప్రేమ విషయాన్ని బట్టబయలు చేసింది. ఆమధ్య బెంగళూరు హోటల్‌లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు.. నరేష్ మూడో భార్య రమ్య పెద్ద రాద్ధాంతమే సృష్టించింది. ఇక అప్పటినుంచే నరేశ్, పవిత్ర వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల పాటు ఈ జంట గురించే చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే తాము ఒక్కటవ్వబోతున్నామని షాకిచ్చిన వీళ్లిద్దరు.. అందరు బాగుండాలి అందులో మేముండాలని చెప్తూ ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది.
ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై.. ఢిల్లీపై గ్రాండ్ విక్టరీ
మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో ముంబయి ఇండియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే గుజరాత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లపై హర్మన్ ప్రీతి కౌర్ సేన గెలుపొందాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై జయకేతనం ఎగురవేసి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీపై ముంబయి ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఢిల్లీ నిర్థేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని 15 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేధించింది. ముంబై ఓపెనర్లు యాస్తికా భాటియా ( 32 బంతుల్లో 41 రన్స్, 8 ఫోర్లు ), హీలీ మాత్యూస్ ( 31బంతుల్లో 32 రన్స్, 6 ఫోర్లు ) పరుగులతో రాణించారు. నాట్ సివర్ బ్రంట్ (23*), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్( 11* ) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లు అలిస్ క్యాప్సీ, తారా నోరిస్ చెరో వికెట్ తీసుకున్నారు.