NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

జమ్మలమడుగు కోర్టుకి కొమ్మా పరమేశ్వర్ రెడ్డి

రెండు తెలుగు రాష్ట్రాల్లో వివకానందరెడ్డి హత్య కేసు కలకలం రేపుతోంది. ఎప్పుడు సీబీఐ అధికారులు ఎవరిని విచారణకు పిలుస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. వివేకా హత్య కేసులో నిందితుడు ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతిని బెదిరించి, దాడి చేసిన కేసులో అరెస్టు అయిన కొమ్మా పరమేశ్వర రెడ్డి, అతని కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని కోర్టుకు తరలించారు పోలీసులు. పులివెందుల కోర్టులో జడ్జి అందుబాటులో లేక పోవడంతో జమ్మలమడుగు కోర్టుకు నిందితులను తరలించారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటుచేశారు.వివేకా హత్య కేసులో నిందితుడు ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతి పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను పులివెందుల పోలీసులు అరెస్టు చేశారు. కసునూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారికి నిన్న పులివెందుల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులిద్దరిని జమ్మలమడుగు కోర్టులో నేడు హాజరు పరచారు. పోలీసులు. కొమ్మా పరమేశ్వర రెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉండటంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది..

వయాగ్రాతో తీసుకుని మందేశాడు.. గర్ల్‌ఫ్రెండ్ చెప్పినా వినలే..
డాక్టర్ల సూచన లేకుండా ఏది పడితే అది వాడితే ఎలా ఉంటుందో తెలుసా..? ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. రతిలో శక్తి కోసం వయగ్రా వేసుకున్నాడు. దీంతో పాటు ఆల్కాహాల్ తాగాడు. చివరకు మరణించాడు. ఈ ఘటన మహరాష్ట్ర నాగ్ పూర్ లో జరిగింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి మరణాలు సంభవిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగ్‌పూర్‌లో 41 ఏళ్ల వ్యక్తి మద్యం తాగేటప్పుడు రెండు వయాగ్రా మాత్రలు తీసుకున్న తరువాత మరణించాడు. ఈ కేసు గురించిన వివరాలను ‘‘జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్’’లో ప్రచురించారు.ఓ వ్యక్తి హోటల్ గదిలో తన గర్ల్ ఫ్రెండ్ ను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ అతడు రెండు 50ఎంజీ సిల్డెనాఫిల్ టాబ్లెట్లను తీసుకున్నాడు. దీన్ని వయగ్రా బ్రాండ్ పేరుతో విక్రయిస్తుంటారు. ఇదే సమయంలో సదరు వ్యక్తి మద్యం సేవించాడు.

నేడు మేఘా-ట్రోపిక్-1 శాటిలైట్‌ను కూల్చేయనున్న ఇస్రో

ఇండియన్ స్పేస్ రీసెర్చ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఈ రోజు మేఘా-ట్రోపిక్-1 ఉపగ్రహాన్ని కూల్చేవేయబోతోంది. ఈ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం తీరడంతో దీన్ని భూమిపై కూల్చేసేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇది పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు దూరంగా కూల్చివేయనున్నారు. ఉపగ్రహం అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి రీఎంట్రీ అయ్యే సమయంలోనే వాతావరణ ఘర్షణ కారణంగా దాదాపుగా మండిపోతుంది. ఏదైనా శిథిలాలు మిగిలి ఉంటే అవి సముద్రంలో పడిపోతాయి.
మేఘా ట్రోపిక్-1
మేఘా ట్రోపిక్ 1ను అక్టోబర్ 12, 2011న భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు సంయుక్తంలో అంతరిక్షంలోకి పంపాయి. లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ఈ ఉపగ్రహం తిరుగుతూ.. ఉష్ణమండల వాతావరణం అధ్యయానికి ఎంతో తోడ్పడింది. మొదట్లో ఈ మిషన్ మూడేళ్ల పాటు పనిచేయాలని అనుకున్నారు. అయితే ఇది ఓ దశాబ్ధం పాటు తన సేవలను అందిస్తూ కీలక డేటాను భూమి పైకి పంపింది. సంస్కృతంలో మేఘాల పేరుతో ‘మేగా’ అని, ఫ్రెంచ్ లో ఉష్ణమండలం అని అర్థం వచ్చేలా ‘ట్రోపిక్’అని ఈ రెండు కలిసి వచ్చేలా ‘మేఘా ట్రోపిక్-1’గా నామకరణం చేశారు.

ఏంట్రా మీరు మారరా? పట్టుకుంటున్నా పదే పదే అదేపని చేస్తారేంట్రా?

ఎంతైనా నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా?.. తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండతలేదు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు. దొంగతనాలు చేస్తున్న వారికి కఠినంగా శిక్షిస్తున్నా.. అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. సినిమాలు, సోషల్‌ మీడియాలను ఫాలో అవుతూ మరీ దొంగతనాలు.. దొంగ తనం చేసిన డబ్బులను, వస్తువులను సులుగా తీసుకెలుతుంటారు. ఒక విదేశాలకు వెళ్లే వారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇటు నుంచి వెళ్లే ముందు ఒక ధైర్యం నేను ఏదైనా సరే ఏడు సముద్రాలైనా దాటించేస్తా అన్నట్లు బయలు దేరుతారు. ఇలా ఒకటి కాదు రెండు చాలా సర్లు విదేశీ సిగరెట్లు, గోల్డ్‌, మాదక ద్రవ్యాలు, డాలర్లు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో మరెన్నో విమానాశ్రయాలలో రోజూ ఏదో ఒకటి పట్టుకుంటూ వారిని శిక్షిస్తున్నా అవన్నీ పక్కనపెట్టి వీరి దారి మాత్రం దొంగదారే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఒక్కరోజులో ఏదో ఒకటి వస్తురూపేనా లేదా డబ్బురూపేనా కస్టమ్స్‌ అధికారులు పట్టుకుంటూనే ఉంటారు. కానీ దొంగబాబులు మాత్రం లగేజ్‌లలో, హ్యాండ్‌ బ్యాగులలో, పేస్ట్‌ రూపేనా, షూష్‌ లలో ఇలా రకాలుగా దొంగ సొమ్మును తరలించే ప్రయత్నం చేస్తూ అధికారుల చేతికి చిక్కుతుంటారు. ఇలాంటిదే తాజాగా ఇవాల శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ లో చోటుచేసుకుంది.

ప్రతిపక్షాలది కడుపుమంట.. అదంతా పేటిఎం బ్యాచ్

ఏపీలో ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయింది. గతంలో ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చాయా? 13 లక్షల కోట్ల రూపాయలతో అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్. పారిశ్రామిక విప్లవం ఆంధ్రప్రదేశ్ లో మొదలయింది. ప్రతిపక్షాలు కడుపు మంటతో విమర్శిస్తున్నాయి. దేశంలోని ముఖ్యమైన కంపెనీల పెద్దలు గ్లోబల్ సమ్మిట్ కి హాజరయ్యారు. పెట్టుబడులు పెడతాం అని వచ్చిన వాళ్ళను తప్పు పట్టడం బాధాకరం. లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేక పోయారు. పోటుగాడివి అయితే ఎమ్మెల్యేగా గెలవ వచ్చు కదా అని భరత్ ప్రశ్నించారు. అభివృద్ధిని నిరోధించే ప్రయత్నం చేసే వాళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి. ముఖ్యమంత్రి నమ్మకం కల్పించారు కాబట్టి ఇన్ని కంపెనీలు గ్లోబల్ సమ్మిట్ కు పంపించారు. పేటియం బ్యాచ్ తో భోజనాల వద్ద గొడవలు సృష్టించారు. టిడిపి హయాంలో స్కాం లు.. జగన్ హయాం లో స్కీం లు అని ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. పోలవరం ఆలస్యం అవడానికి కారకులు ఎవరు? కమిషన్ల కోసం పోలవరం నిర్మాణాన్ని గందరగోళం చేశారు. చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరం ఆలస్యం అవుతోందన్నారు. తప్పులు చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి. గతప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మోడీ డంపింగ్ యార్డ్ గా మార్చేస్తారా?

మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ నేత నారాయణ. విశాఖపట్నం సీల్ట్ ప్లాంట్ ను బిజెపి డంపింగ్ యార్డ్ గా మార్చబోతోందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోది హాటావో…దేశ్ బచావో నినాదంతో త్వరలో సిపిఐ అధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నాం అని ఆయన తెలిపారు. జనం మద్దతు ఉంటే ఎందుకు పోలీసుల వలయంలో తిరుగుతున్నావ్ జగన్ అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు అంత భయం జగన్ కి. కుటుంబ సభ్యులతో కూడా స్వేచ్ఛ గా తిరిగలేని జగన్… ప్రతిపక్ష పార్టీలకు మాత్రం సవాల్ విసురుతున్నాడు..మోది…జగన్ ది నియంత పాలన…వీరివల్ల రాష్ట్ర నాశనం అవుతోందని విమర్శించారు నారాయణ. ఎవరు ఎలా పోటీ చేయాలో జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది…వైసిపికి ఉండేది ఒక సంవత్సవం ఆయుష్షు.. విశాఖ పట్నం సమ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. అవన్నీ కాకి లెక్కలు. పారిశ్రామిక కంపెనీలను తరిమేసి ఇప్పుడు పెట్టుబడులంటే ఎలా అని నారాయణ ప్రశ్నించారు. మూడు రాజధానులు అన్నప్పుడు ఏపీపై పారిశ్రానిక వేత్తలకు నమ్మకం పోయిందన్నారు నారాయణ.

నిండు గర్భిణీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా గిరిజన ప్రాంతాల్లో గర్భిణీల ఇక్కట్లు మాత్రం తగ్గడం లేదు. అల్లూరి జిల్లాలో మరోసారి నిండు గర్భిణీ కష్టాలు వెలుగు చూసాయి.. నిన్న మధ్యాహ్నం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయితీ పాలమామిడిలో గర్భిణీ అష్ట కష్టాలు పడింది. ప్రభుత్వాలు మారుతున్న ఏజెన్సీల్లో ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమామిడి గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ నిన్న మధ్యాహ్నం దేనికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.పాలమామిడి నుంచి మాడేబందకు కేవలం ద్విచక్ర వాహనం వెళ్లే మార్గం ఒక్కటే వాళ్ళకి దిక్కు. అదే మార్గం గుండా గర్భిణీ స్త్రీని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోని నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి. అటవీ ప్రాంతం మధ్యలోనే ఆమె పురుడు పోసుకుంది. అక్కడి నుంచి అతి కష్టం మీద మాడేబందకు చేరుకున్నారు. మాడబంధ నుంచి తాజంగి లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి,బిడ్డను అంబులెన్స్ లో తరలించారు. రెండవ బిడ్డకు జన్మనిచ్చింది దేవి,. ఆమెకు పుట్టిన మగ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. 150 మంది నివాసం ఉంటున్న పాలమామిడి నుంచి మాడిబంద వరకు రోడ్డు మార్గాన్ని వేయాలంటూ ప్రభుత్వానికి గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తప్పదని గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

శిరస్సు వంచి పాదాలకు నమస్కరిస్తున్నా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా” అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. తారక్ ని అతి దగ్గర నుంచి చూసిన ఫాన్స్ సోషల్ మీడియాలో ఫోటోలతో హల్చల్ చేస్తున్నారు. తమ అన్నని చూసాం అంటూ ఫాన్స్ మీట్ నుంచి ఫోటోస్ ని పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ ఫాన్స్ మీట్ కి వెళ్లడం కన్నా ముందు ఒక టీ-షర్ట్ వేసుకున్న ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఎన్టీఆర్, పులి బొమ్మతో కనిపించాడు. యంగ్ టైగర్, టైగర్ టీషర్ట్ వేసుకున్న ఫోటో ఇంటర్నెట్ లో హావోక్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఫాన్స్ మీట్ ని ఇప్పటివరకూ పెట్టలేదు. ఇక్కడి ఫాన్స్ ని ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో కలవడం తప్ప ఎన్టీఆర్ నేరుగా అభిమానులని కలవలేదు. ఫారిన్ ఫాన్స్ కి మాత్రం ఆ ఛాన్స్ దొరికేసింది. అభిమానుల గురించి ఎప్పుడూ ఎమోషనల్ గా మాట్లాడే ఎన్టీఆర్, ఫారిన్ లో కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అని చెప్పాడు.