NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఇవాళ సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు

వివేకా హత్య కేసులో నేడు హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి అవినాష్ రెడ్డి. దీనిపై ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు సీబీఐ అధికారులు. ఈరోజు వేంపల్లి మండలంలో గృహసారధుల కార్యక్రమంలో పాల్గొననున్నారు ఎంపి అవినాష్ రెడ్డి. వేంపల్లి మధు రెడ్డి కళ్యాణ మండపంలో వైసిపి సమావేశం జరగనుంది. ఈరోజు కడప సెంట్రల్ జైలు లోని అతిధి గృహంలో సిబిఐ విచారణకు ఎంపి తండ్రి భాస్కర రెడ్డి హాజరయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు..పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సీబీఐ అధికారులు..ఈ నెల 10న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసులో పేర్కొన్న సీబీఐ..నాలుగు రోజుల క్రితం నేడు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ. ముందస్తు షెడ్యూల్ వల్ల హాజరు కాలేనని చెప్పిన ఎంపీ.. వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా మరోసారి నోటీసులు..12న కడపలో విచారణకు హాజరవ్వాలని నోటీసులిచ్చింది సీబీఐ.

మోడీజీ సిగ్గుపడండి.. ప్రధాని మోదీపై కేజ్రీవాల్ నిప్పులు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా కేవలం ఐదేండ్లలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేశారని, అందుకు బహుమానంగా ఆయనను జైల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. సాధువు, మహాత్ముని లాంటి సిసోడియాను జైలుకు పంపారు.. ఇందుకు మీరు సిగ్గు పడాలి అని వ్యాఖ్యానించారు. ఆదివారం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్‌ వసూలు చేస్తున్నదంటూ వచ్చిన ఆరోపణలను కేజ్రివాల్‌ ప్రస్తావించారు. సాధువు లాంటి మనీశ్‌ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్‌ వసూలు చేసిన వాళ్లను మాత్రం వదిలేశారని విమర్శించారు.

పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి సహకరించాలి

పారిశ్రామిక వేత్తలు సమాజానికి ఇతోధికంగా సహకారం అందించాలన్నారు భారతమాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయడు. విశాఖ ఐటీ హిల్స్‌లో కార్పొరేట్ బిజినెస్ కాన్ క్లేవ్ నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ హెడ్స్ కనెక్ట్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షేర్ అండ్ కేర్ అనేది భారతీయ తత్వమని, సంపద సృష్టించాలి…దాన్ని పంచడంలో వుండే ఆనందాన్ని కూడా పొందాలన్నారు. సంపద పెంచుకోకుండా పంచుకుంటూపోతే అప్పులకు వడ్డీలు కట్టాలని ఆయన అన్నారు. అవసరార్ధులకు చేయి అందించాలి.. భుజం ఎక్కించి మోయకూడదని ఆయన అన్నారు. మూడో అతిపెద్ద ఆర్ధికశక్తిగా భారత్ అవతరిస్తుందని, ప్రకృతిపరిరక్షణ పైనే భవిష్యత్తు ఆధారపడి వుందన్నారు వెంకయ్య నాయుడు. సహజవనరులను , నదులను, జలవనరులను దెబ్బతీసుకోవడం మంచిదికాదని ఆయన అన్నారు. ప్రకృతి ని పరిరక్షించడంలో పారిశ్రామిక వేత్తలే ముందుండాలన్నారు. నైతిక విలువలు, వ్యాపారంలోనూ , రాజకీయాల్లోనూ కనుమరుగవుతున్నాయని, G-20 ఫోరం పర్యావరణాన్ని కాపాడేందుకు , సమాజహితానికి సహకరించుకునేందుకు దోహదపడాలన్నారు. ట్రెండ్ సెట్టర్లు గా మన వాళ్లు ఎంతో మంది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచారని వెంకయ్య నాయుడు అన్నారు.

నవీన్ హత్యకేసులో నాలుగవ రోజు విచారణ

నవీన్ హత్య కేసులో నాలుగవ రోజు హరిహరకృష్ణ కస్టడీ కొనసాగుతోంది. మొదటి రెండు రోజుల్లో సీన్ రీకన్‌స్ఝ్రక్షన్ చేశారు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు. హరిహర కు నవీన్ హత్య కేసులో ఎవరన్నా సహకరించారా అన్నా కోణంలో కొనసాగుతుంది దర్యాప్తు. కీలకంగా మారనుంది టెక్నికల్ ఎవిడెన్స్ . వాట్సప్ ఛాటింగ్ లను రిట్రీవ్ చేస్తున్నారు దర్యాప్తు అధికారులు. హత్యకు ముందు హత్య తరువాత హరిహర చేసిన వాట్సప్ ఛాటింగ్ కీలకంగా మారనుంది. కస్టడీలో దర్యాప్తు కు హరిహర కృష్ణ సరిగా సహకరించడం లేదంటున్నారు అధికారులు. యూట్యూబ్లో హత్య కు సంబంధించిన అంశాలు, దర్యాప్తులో ఎలా వ్యవహరించాలో ఓ ఛానల్ ల్లో వచ్చే క్రైం బేస్డ్ సీరియల్ ద్వారా హరిహర నేర్చుకున్నాడు.

జనసేన సభకు స్థలం ఇచ్చారని కక్ష కడతారా?

గన్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు క్షోభలో ఉంటే సైకో జగన్ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. కావాలని సమస్య సృష్టించి రాక్షస ఆనందంతో బతికే వ్యక్తి జగన్ అని ఆయన ఆరోపించారు. ఒక ఇంట్లో అనారోగ్యంతో మహిళ బాధపడుతున్నారని, మరో చోట పెళ్లి పెట్టుకున్న ఇంటిని కూలగొట్టారన్నారు. పాత మార్కింగ్ సమయంలో స్వచ్ఛందంగా ప్రజలే ప్రహరీ పడగొట్టుకున్నారని, ఇప్పుడు కాలువలు దాటి కొత్త మార్కింగ్ పెట్టడం దుర్మార్గమన్నారు. జనసేనకు సభ ఇచ్చారని కక్ష కడతారా..? అని ఆయన మండిపడ్డారు.మాకు సహకరించిన ప్రజలకు మేము అండగా ఉంటామన్న ఆయన.. మరోసారి అధికారులు ఇక్కడ హడావుడి చేస్తే ఊరుకోమన్నారు. మచిలీపట్నం సభకు ఆటంకాలు కలిగించేందుకు ఇక్కడ ఇబ్బంది పెడతారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి జగన్‌కి పిచ్చెక్కిందన్నారు.

ఎప్పటికీ అమరుల త్యాగాలు గుర్తుంచుకునేలా స్మారక చిహ్నం

మిరుదొడ్డి మండలం కొండాపూర్ గ్రామంలో అమరవీరుల స్థూపాన్ని మంత్రి హరీష్‌ రావు, మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ నడి బొడ్డున డాక్టర్.బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నామన్నారు. సెక్రటేరియట్ ని కూల గొడతామని ఓ ప్రతిపక్ష నాయకుడు అంటే… మరో ప్రతిపక్ష నాయకుడు పేల్చేస్తామనే ప్రతిపక్ష నేతలు తెలంగాణలో ఉండడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో కూడా జూన్ 2వ తేదీన అమరుల స్ఫూర్తి చిహ్నాన్ని కూడా ప్రారంభించి తెలంగాణ సమాజం ఎప్పటికీ అమరుల త్యాగాలు గుర్తుంచుకునేలా ఈ స్మారక చిహ్నం నిర్మిస్తున్నామని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ.10 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు.

‘నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి కారణం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహమే

నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమం: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తండ్రి ఎండి జమీల్ అహ్మద్ భావోద్వేగమయ్యారు. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తండ్రి ఎండి జమీల్ అహ్మద్ భావోద్వేగానికి గురయ్యారు. అవార్డుల ప్రధాన వేదికపై మాట్లాడిన జమీల్ అహ్మద్ నిఖత్ జరీన్ ఈ స్థాయిలో ఉండటానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల ప్రోత్సాహం, సహకారమే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఒక తండ్రిగా నేను చేసింది కొంతేనని, కేసీఆర్, కవితల సహకారం లేకపోతే నిఖత్ జరీన్ ఈ స్థాయికి వచ్చేది కాదని జమీల్ అహ్మద్ భావోద్వేగానికి గురయ్యారు. జమీల్ అహ్మద్ ప్రసంగానికి సభికులు చప్పట్లతో హర్షధ్వానాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద జరిగిన అనేక బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నిఖత్ జరీన్ నామినేట్ అయింది.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం.. యూట్యూబ్ ద్వారా డెలివరీ
ఓ టీనేజ్ అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడ్డ యువకుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. యూట్యూబ్ సాయంతో బాలిక ఇంట్లోనే ప్రసవించింది. ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో బాలిక కుటుంబ సభ్యులు పెద్ద షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఓ నవజాత శిశువు మృతి చెందింది. నిందితుడిపై బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నాగ్‌పూర్ పోలీసులు యువతి సోషల్ మీడియా ఖాతా నుండి యువకుడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ ఉదంతం నాగపూర్ ప్రాంతంలో కలకలం రేపింది.అసలేం జరిగిందంటే.. తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాన్ని అవకాశంగా తీసుకున్న యువకుడు ఆమెను కలిశాడు. ఇద్దరూ ఒక్కడవడంతో ఆమె గర్భం దాల్చింది. ఇది ఇంట్లో ఎవరికీ తెలియకుండా 15 ఏళ్ల మైనర్ ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే సాయంత్రం బాలిక తల్లి ఇంటికి రాగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మాయో ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు సమాచారం అందించారు.