తెలంగాణా తరహాలో రైతు పథకాలు ప్రారంభించాలి
సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జీవో 59 కింద లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు మంత్రి హరీష్‌రావు. జిల్లా కలెక్టర్ శరత్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ క్రమంలోనే.. కలెక్టరేట్ ఆవరణలో హరిత హారం కింద నాటిన చెట్లను పరిశీలించారు హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు.. జాతీయ రహదారిపై మురికినీరు ప్రవహించడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొందరు ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారన్నారు. హరిత హారం భవిష్యత్ తరాల కోసం సీఎం కేసీఆర్ ఆలోచన అని ఆయన వెల్లడించారు. 270 కోట్ల మొక్కలు నాటడం హరిత హారం లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల దృష్టితో అన్నీ చూడకూడదు
ఏపీలో బీజేపీ వైసీపీ పార్టీల మధ్య మాటల దాడి తారస్థాయికి చేరుకుంటోంది. ఈ నెల 13వ తేదీన జరగనున్న శాసనమండలి ఎన్నికలలో కూడా ఓటర్లను కోనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరం అన్నారు బీజేపీ నేత విష్ణువర్దన రెడ్డి. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం ఈ అంశం పై కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈనెల 13న ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏపీలో వైజాగ్ లో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని నిర్వహించారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన పెట్టబడుల సదస్సుపై విమర్శలు చేసిన వైసీపీ…ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులపై పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పెట్టుబడులకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చెయ్యాలన్నారు. జనసేన,బిజేపి మధ్య పొత్తు కొనసాగుతుంది. కొన్ని పార్టీలు మాత్రం విడిపోవాలని కోరుకుంటున్నాయన్నారు వారి కోర్కేలు తీరవన్నారు.
అనంత క్లాక్ టవర్ వేదికగా హాట్ పాలిటిక్స్
అనంతపురం ఏపీలో కీలక రాజకీయాలకు వేదిక. అలాంటి అనంతపురంలోని క్లాక్ టవర్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రాప్తాడు రాజకీయాలకు అనంత క్లాక్ టవర్ వేదికగా మారింది. టిడీపీ -వైసీపీ నేతల మద్దతుదారులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు రాజకీయ వేడిని రాజేశాయి. వైసీపీ మద్దతు దారుడు గతంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారంటూ పోస్ట్ చేసి క్లాక్ టవర్ వద్దకు రావాలని సవాల్ విసిరాడు. దీంతో పరిటాల వర్గీయులు పెద్దఎత్తున క్లాక్ టవర్ వద్దకు చేరుకోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. రాప్తాడులో ఎవరు అభివృద్ధి చేశారన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఒకరు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరికొందరు పరిటాల కుటుంబం పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతపురం వచ్చి మాట్లాడాలంటా టీడీపీ మద్దతుదారుడు సవాల్ విసిరాడు. నేను రాప్తాడు, అనంతపురం వచ్చానంటూ వైసీపీ మద్దతుదారుడు వీడియో రిలీజ్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. రాప్తాడులో పరిటాల వర్సెస్ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిల మధ్య వార్ గుంటూరుకు చేరింది. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మా నేత గొప్ప అంటే మా నేత గొప్ప అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకున్నారు. పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అటు వైపు వ్యక్తి దమ్ముంటే రాప్తాడు వెళ్లి మాట్లాడు అంటూ సవాల్ విసిరారు. గుంటూరు జిల్లాలో ఉండి మాట్లాడటం కాదు.. రాప్తాడుకు వస్తే ఎవరు ఏంటో తెలుస్తుందంటూ సవాల్ విసిరాడు.
ఈ నెల 8 నుంచి ఏపీ ఉద్యోగుల ఉద్యమం ప్రారంభం
ఈనెల 8వ తేదీనుంచి ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం ప్రారంభం కాబోతోంది. ఉద్యోగ సంఘాలలో ఐక్యత లేకపోయినా ఉద్యోగులు అంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలంటున్నారు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు,ప్రదర్శనలు చేస్తామని ప్రకటించినా జగన్ సర్కారులో కదలిక లేదంటున్నారు. ఇక నుంచి 10నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉద్యోగం చేస్తామని బొప్పరాజు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగుల నిరసన జగన్ సర్కార్ కు ఈ పరిణామం చెంపపెట్టులా మారిందంటున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లను జగన్ మోసారంటున్నారు. ఐఆర్ 27 శాతం ప్రకటించారు.. ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించారని ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులు.. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమం చేస్తామని ముందే హెచ్చరించారు ఉద్యోగ సంఘాల నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగుల ఆగ్రహం జగన్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మా ఉద్యోగ , ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆర్ధిక ఆర్ధికేతర సమస్యలను 4 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు ఏపిజేఏసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు. మా ఉద్యమానికి ఏపి సిపిఎస్ఏ కూడా మద్దతు ప్రకటించిందన్నారు.
భద్రాద్రి ఆలయంలో సిబ్బంది నిర్లక్ష్యం.. ఇద్దరు అర్చకులకు మెమోలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య సన్నిధిలోనీ ఆలయ సిబ్బంది గత కొంతకాలంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఆలయ అధికారులు ఇద్దరు అర్చకులకు మెమోలు జారీ చేశారు. సీతారాములకు శనివారం సాయంత్రం జరిగిన సార్వభౌమ సేవలో హాజరుకాని ఇద్దరు అర్చకులకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే గత కొంతకాలంగా ఆలయ సిబ్బంది వారి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని స్వామివారికి జరిగే సేవలో ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా ఉత్సవాలు చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.. స్వామివారికి ప్రతీ నిత్యం జరిగే సేవల్లో సరైన సమయానికి హాజరు కాకపోవడం వల్లనే ఇద్దరు అర్చకులకు మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన ప్రధానార్చకులు ఈ విషయం పై ఆలయ అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. సీతారామ కల్యాణ పనులు ఈనెల 7న పాల్గున పౌర్ణమి నాడు శ్రీకారం చుట్టునున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రోలు, రోకలికి పూజలు చేసి పసుపు కొమ్ములు దంచి పనులు ప్రారంభిస్తారు. తదుపరి సీతారాముల కల్యాణానికి వాడే తలంబ్రాలను తయారు చేస్తారు. అదే రోజు డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు.ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని చిత్రకూట మండపంలో నిర్వహించే ఆలయ అధికారులు… ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని భావించి ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో కల్యాణానికి వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి కానీ భద్రాద్రి రామయ్య సన్నిధిలో వాడే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి.
శ్రీదేవి కూతురితో ఎన్టీవోడి మనవడు…
‘ఆకు చాటు పిందే తడిసే’, ‘జాబిలితో చెప్పనా’, ‘పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే’, ‘తెల్ల చీరా ఎర్ర బొట్టు కళ్ల కాటు’ లాంటి ఎవర్ గ్రీన్ పాటలని వినగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి ఎన్టీఆర్, శ్రీదేవిల జంట గుర్తొస్తుంది. విశ్వవిఖ్యాత నటుడిగా ఎన్టీఆర్, అతిలోక సుందరిగా శ్రీదేవి కలిసి 12 సినిమాల్లో నటించారు. సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ ని గుర్తు చేసేలా ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ కలిసి సినిమా చెయ్యబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలని అందుకోవాలంటే మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ కోసం ప్రయతించిన కొరటాల శివ అలియా భట్ ని అనుకున్నాడు కానీ డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక అలియా ‘ఎన్టీఆర్ 30’ నుంచి తప్పుకుంది. దీంతో అలియా ప్లేస్ జాన్వీ కపూర్ దక్కింది. ఈ మధ్యలో చాలామంది పేర్లు వినిపించాయి కానీ ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ జాన్వీ కపూర్ కి దక్కింది. ఈరోజు జాన్వీ పుట్టిన రోజు కావడంతో మేకర్స్ జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో శ్రీదేవిని గుర్తు చేసేలా విలేజ్ లుక్ లో నడుము అందాలు చూపిస్తూ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది.
పాన్ కార్డుతో ఆధార్ లింక్.. లాస్ట్ డేట్ వచ్చేస్తోంది
మీకు పాన్ కార్డు ఉందా? ఆధార్ కార్డుతో లింక్ చేశారా? అయితే త్వరపడండి. గడువు ముంచుకొచ్చేస్తోంది. ఈ ఏడాది మార్చి 31లోపు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయాలి. లేదంటే జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి గడువు చాలాసార్లు పొడిగించింది కేంద్రం. అయితే ఈసారి మాత్రం గడువు పొడిగించే అవకాశం లేదంటున్నారు. అయితే, ప్రస్తుత గడువులోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డు పని చేయదు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పాన్-ఆధార్ లింకింగ్ కొందరికి మినహాయింపు ఉంది.ఈశాన్య రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల నివాసితులకు మినహాయింపు ఉంది. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం నాన్-రెసిడెంట్, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, భారతదేశ పౌరుడు కాని వారికి మినహాయింపు ఉంది.
వీఆర్‌ఏల డిమాండ్లపై సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
Jagga Reddy
ప్రభుత్వం విఆర్ఏ ల డిమాండ్స్ ను వెంటనే అమలు చేయాలని సిఎం కేసీఆర్ కు లేఖ రాశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. చాలా రోజుల నుండి విఆర్ఏ లు వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా సమ్మె కూడా చేశారు. ప్రభుత్వం వారి డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ కూడ ఇచ్చింది. వెంటనే వి ఆర్ ఏ లు కోరిన్నట్లు పే స్కేల్ పెంచాలి..10th పాస్ ఐన వారికి అటెండర్ గ్రేడ్ పే స్కేల్ పెంచి 22వేల జీతం ఇవ్వాలి.ఇంటర్ పాస్ ఐన విఆర్ఏ లకు అసిస్టెంట్ గ్రేడ్ పే స్కేల్ ఇచ్చి 26వేల జీతం ఇవ్వాలి.గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే విఆర్ఏ లకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.ఎంఆర్వో, ఆర్డీఓ,జాయింట్ కలెక్టర్, కలెక్టర్ స్థాయి వారు కూడ వీరితో పని చేయించుకుంటారు.గ్రామీణ ప్రాంతాల్లో చాలా పని చేస్తూ చాలా కష్టపడుతారు.10వేల 500 రూపాయల జీతం వీరికి సరిపోవన్నారు జగ్గారెడ్డి.