NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఇవాళ, రేపు సీఎం వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.మంగళవారం కూడా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇవాళ సాయంత్రం సీఎం జగన్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రాత్రికి జన్‌పథ్‌ నివాసంలో సీఎం వైఎస్ జగన్‌ బస చేయనున్నారు. ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్‌ కార్యక్రమాలకు సీఎం వైయ‌స్ జగన్‌ హాజరుకానున్నారు. ఎల్లుండి 10.30-5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్‌ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం వైయ‌స్ జగన్‌ సమావేశమవుతారు. ఉదయం వినుకొండ పర్యటనలో పాల్గొని అక్కడినించి తాడేపల్లికి చేరుకుంటారు జగన్. ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అపాయింట్‌మెంట్లు ఇంకా ఖరారుకాలేదు. కాగా 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఉంది.

టీటీడీ యాప్ కి భక్తుల నుంచి అనూహ్య స్పందన

కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతుంటారు. టీటీడీ దర్శనం టికెట్లు జారీచేసిన, ఏ పథకం ప్రారంభించినా దానికి వెంటనే స్పందిస్తారు భక్తులు. తాజాగా టీటీడీ ప్రారంభించి యాప్ కి భక్తుల నుంచి ఆదరణ భారీగా కనిపిస్కతోంది. రెండు రోజులలోనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న భక్తుల సంఖ్య 10 లక్షలు దాటేసింది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. 16 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,639 మందిగా ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16కోట్లు అని టీటీడీ తెలిపింది. తలనీలాలు సమర్పించిన వారు 25131 మంది. మరోవైపు టీటీడీ ధార్మిక కార్యక్రమాలకు హిందు సాధు సంఘం మద్దతు తెలిపింది. తిరుమలలో నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలపై సాధు సంఘం స్వామిజీలకు వివరించారు టీటీడీ ఇఓ ధర్మారెడ్డి. టీటీడీ నిర్వహిస్తూన్న కార్యక్రమాల పై సంతృప్తి వ్యక్తం చేశారు స్వామిజీలు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకునేందుకు తమ నెట్ వర్క్ ద్వారా సహకారం అందిస్తామన్నారు స్వామీజిలు. ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విరాళాలు కూడా ఇదే యాప్‌ నుండి అందించవచ్చని ఆయన చెప్పారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చు.

రోగులకు పట్టించుకోకుంటే ఇంటికే

వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని వైద్యులు, సిబ్బందికి మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులను డిస్మిస్ చేస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో కలసి ఆయన వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022ను ఆవిష్కరించారు. ఒకట్రెండు ఘటనలు మినహా గతేడాది వైద్య, ఆరోగ్యశాఖ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని మీడియాతో మంత్రి చెప్పారు. ‘హెల్త్‌ ఫర్‌ ఎవ్రీ ఏజ్‌.. హెల్త్‌ ఎట్‌ ఎవ్రీ స్టేజ్‌.. టువార్డ్స్‌ ఆరోగ్య తెలంగాణ’ అనే నినాదాన్ని తాము ఎంచుకున్నామని వివరించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్ల బడ్జెట్‌ కేటాయించిందని… ఈ కేటాయింపులతో తలసరి హెల్త్‌ బడ్జెట్‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. నీతి ఆయోగ్‌ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌‌‌పై కేఏ పాల్ పిల్

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌‌‌పై కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.. పార్టీ ఇన్ పర్సన్‌‌గా వాదనలు వినిపించనున్నారు. రైతుల అభ్యంతరాలను తీసుకోకుండా మాస్టర్ ప్లాన్‌పై జీవో ఇచ్చారని తన పిల్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి జనవరి 25న హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందన్న పిటిషన్ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వ వైఖరి రెండు వారాల్లో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను కౌంటర్ అఫిడవిట్‌లో పొందుపరచాలని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.

వైసీపీలో కావలి ఎమ్మెల్యే కామెంట్ల కలకలం

రాజకీయాల్లో పరిస్థితులు ఒకేలా ఉండవు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఒకవైపు మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇటు ఎమ్మెల్యే ఆనం, నేదురుమల్లి మధ్య మాటల యుద్ధం, ప్రచ్చన్నయుద్దం ముదురుతోంది. తాజాగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీలో కాకరేపుతున్నాయి.వైసీపీ ప్రభుత్వ పనితీరుపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కావలి నియోజక వర్గంలో భారీగా గ్రావెల్ కుంభకోణం జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంలో చిన్నచిన్న అవకతవకలు జరుగుతున్నాయన్నారు. తమ అవసరాల కోసం కొందరు అనధికారకంగా గ్రావెల్ ను తవ్వుకుంటున్నారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికే టిడిపి నేతలు రాద్ధాంతం చేస్తున్నారని.. వారి హయాంలో జరిగిన అవినీతి గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు.

అనురాగ్ వాయిస్ లో ఉండే మ్యాజిక్ ఏ వేరు…

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘దర్శన’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయి ఎమోషన్ ని షేర్ చేసుకునే సమయంలో వచ్చే ఈ సాంగ్ కి  మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ మంచి ట్యూన్ ఇచ్చాడు. భాస్కరభట్ల రాసిన లిరిక్స్ ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకునేలా ఉన్నాయి. ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికీ ‘దర్శన’ సాంగ్ లిరిక్స్ కనెక్ట్ అవుతాయి. మంచి ట్యూన్, మంచి లిరిక్స్ కి సూపర్బ్ వోకల్స్ ని అందించాడు ‘అనురాగ్ కులకర్ణీ’. ఇతని వాయిస్ లోని మ్యాజిక్ దర్శన సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చింది. కిరణ్ అబ్బవరం, అనురాగ్ కాంబినేషన్ లో ఇప్పటికే ఎస్.ఆర్ కళ్యాణ మండపం సినిమాలోని ‘చుక్కల చున్నీనే’ అనే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ హీరో, సింగర్ కాంబినేషన్ లో ‘దర్శన’ కూడా హిట్ లిస్ట్ లో చేరింది. సాంగ్ మధ్యలో చూపించిన కిరణ్ అబ్బవరం డాన్స్ కూడా ఆకట్టుకుంది. మొత్తానికి ఒక ఫీల్ గుడ్ సాంగ్ ని ‘దర్శన’ రూపంలో గిఫ్ట్ గా ఇచ్చారు.

ఫిబ్రవరి 4న రిలీజ్ కానున్న బుట్టబొమ్మ…

అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్టబొమ్మ’. మలయాళ సినిమా ‘కప్పేలా’కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య నిర్మించిన ‘బుట్టబొమ్మ’ సినిమా జనవరి 26న విడుదల కావాల్సింది కానీ వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 4న బుట్టబొమ్మ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రమోషన్ ని పీక్ స్టేజ్ ని తీసుకోని  వెళ్తూ మేకర్స్ బుట్టబొమ్మ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒరిజినల్ వర్షన్ లో ఉన్న ఫీల్ ని అలానే మైంటైన్ చేస్తూ రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కూడా అదే ఫీల్ ని క్యారీ చేసింది. ఇందులో లీడ్ పెయిర్ మధ్య ఎమోషన్ వర్కౌట్ అయ్యింది.