NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

Jagan Government

దేశానికే ఆదర్శంగా ఏపీ.. 11.42 శాతం గ్రోత్ రేటు

పల్నాడు జిల్లా వినుకొండ లో జగనన్న చేదోడు పథకం మూడో విడత నిధులు విడుదల.. దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు రూ.10 వేల సాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ.. నవరత్నాల ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు.. ఈ మూడేళ్ల కాలంలో రూ.927 కోట్లు లబ్ధిదారులకు అందించాం అన్నారు సీఎం జగన్. జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా పాలన సాగుతోందన్నారు. 11.43 శాతానికి పైగా అభివృద్ధి రేటుతో ముందుకెళుతున్నాం. జగన్ అంటే ఇష్టం లేనివారు, జగన్ పాలన చేస్తే శ్రీలంక అవుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కారణం రాష్ట్రమంటే ప్రతి రంగంలో ముందుకు నడిపించే శక్తి కావాలి. రాష్ట్రం లో ప్రతికుటుంబం సంతోషంగా ఉంటుంది. రైతన్నలు కష్టాలు పడకుండా చూసుకుంటున్నాం అన్నారు. వైఎస్ ఆర్ ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు లబ్ది పొందుతున్నారన్నారు సీఎం జగన్.

అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారు

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత చింతకాయల విజయ్. హైదరాబాదులో మా ఇంటి పైకి సీఐడీ అధికారులు వచ్చారు.చిన్న పిల్లలను కూడా బెదిరించారు.దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ విచారణకు వచ్చానన్నారు. నన్ను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పింది.వాళ్ల విచారణకు సహకరించాలని వచ్చాను. ఈ నెల 27న విచారణకు రావాలని చెప్పింది. నాకు ఆ రోజు వేరే పని ఉండటంతో రాలేదు. కోర్టు అనుమతి తీసుకుని ఇవాళ విచారణకు వచ్చాను. బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టింది. సెంటు భూమి కోసం మా ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారు. అక్రమ కేసులతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తాడేపల్లి పెద్దల ఆదేశాల మేరకు విజయ్ పై కేసు పెట్టారు.ఉన్నత విద్యావంతుడైన విజయ్ పై కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు.అయ్యన్నపాత్రుడు కుటుంబం నీతి నిజాయితీతో బతుకుతోంది.సెంటు భూమి కోసం ప్రభుత్వ అధికారులతో కేసు పెట్టించారు.తాడేపల్లి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్లో ఇదంతా జరుగుతోంది.ఇలా సజ్జల మాట విన్న గౌతం సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలి.భూమి గుండ్రంగా తిరిగినట్లు మాకూ సమయం వస్తుంది.అవినీతి సొమ్ము కాపాడుకునేందుకు కొడాలి, పేర్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కోసం బూతులు తిడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నానిలు ఇద్దరూ హైదరాబాద్ లో దాక్కున్నారు.ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్లు ఈ దేశంలోనే ఉండరు.

ల‌వ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ముంబైలో భారీ ప్రదర్శన

ల‌వ్ జిహాద్‌కు వ్యతిరేకంగా ముంబైలో వేలాదిమంది రోడ్లపై భారీ ప్రదర్శన చేపట్టారు. ముస్లింలు హిందువుల భూములను అక్రమంగా ఆక్రమించుకోవడం, హిందూ యువతులను ప్రేమ పేరుతో తీసుకెళ్లి, మతం మార్చుతుండటంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. అనేక హిందూ సంస్థలు, వాటి మద్దతుదారులు, సాధారణ ప్రజానీకం ఆదివారం ఉదయం శివాజీ పార్క్ వద్ద తమ నిరసన గళాన్ని వినిపించారు. వీరిలో బాలలు కూడా ఉన్నారు. సకల హిందూ సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మీనాతాయ్ థాకరే విగ్రహం నుంచి ప్రభాదేవి కామ్‌గార్ మైదానం వరకు ఈ ప్రదర్శన జరిగింది. లవ్ జీహాద్, ల్యాండ్ జీహాద్‌లకు వ్యతిరేక నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులను మేలుకొలిపే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరుపై హైకమాండ్ సీరియస్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహార శైలిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. తన ఫోను ఇంటలిజెన్స్ అధికారులు టైపింగ్ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు కలకలం రేపాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న తనపై అర్థం కావడం లేదని అన్నారు ఫోన్ టైపింగ్ చేస్తున్నారని సమాచారం అందువల్లే ఇతర ఫోన్లు ద్వారా రహస్యాలు మాట్లాడుకుంటున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు వైసిపి అధిష్టానం లో కలకలం రేపాయి. మీడియాలో వచ్చిన వార్తలను విశ్లేషించిన పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా మంత్రి తాకానికి గోవర్ధన్ రెడ్డిలతో మాట్లాడినట్లు తెలిసింది. శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యం.. అందుకు దారి తీసిన పరిణామాలు.. తదుపరి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించినట్లు సమాచారం.. ముఖ్యమంత్రి జగన్ వినుకొండ పర్యటన నుంచి వచ్చిన అనంతరం ఆయనతో శ్రీధర్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నా.. ఆర్థిక శాఖ నిధులను విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోందని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ పై కూడా ఆయన ఆరోపణలు చేశారు.

అరుదైన ప్రయోగంలో హన్సిక ప్రధాన పాత్ర…

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ‘105 మినిట్స్’ అనే టైటిల్ తో ‘హన్సిక’ ఒక సినిమా చేస్తుంది. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న హన్సిక, ‘105 మినిట్స్’ సినిమా చేస్తుంది అనగానే హన్సిక అభిమానుల్లో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. రాజు దుస్సా డైరెక్ట్ చేసిన ఈ మూవీ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ రూపొందిన సినిమాగా చరిత్రకెక్కింది.’వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ అనే టైటిల్ కి తగ్గట్లే సరిగ్గా ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే థ్రిల్లర్ ని సింగిల్ షాట్ లో ఎంగేజింగ్ గా తెరకెక్కించడం సాహసమనే చెప్పాలి. హాలీవుడ్ లో సింగిల్ షాట్ టెక్నిక్ లో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాలు సింగిల్ షాట్ టెక్నాలజీతో రూపొందాయి. ఇదే తరహాలో ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రాలు సింగిల్ షాట్ తో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది కానీ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా కావడం విశేషం.

హెండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కంపెనీ విడుదల… ఆదానీ గ్రూప్ ఆగ్రహం 

హెండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కంపెనీ విడుదల చేసిన నివేదికలోని ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు 413 పేజీల సుదీర్ఘ లేఖను అదానీ గ్రూప్‌ విడుదల చేసింది. మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు సృష్టించేందుకు తమ సంస్థపై తప్పుడు నివేదిక ఇచ్చారని అదానీ గ్రూప్ మండిపడింది. హిండెన్‌బర్గ్‌ సంస్థ ఆరోపణలను భారత్‌పై చేసిన దాడిగా అభివర్ణించింది. ఆ నివేదికలో ఎలాంటి వాస్తవాలు లేవని వెల్లడించింది. ఇది కేవలం ఏదైనా నిర్దిష్ట కంపెనీపై అనవసరమైన దాడి కాదు, ఇది ఏకంగా భారతదేశంపై జరిగిన దాడి, భారత స్వతంత్రత, సమగ్రత, నాణ్యత, అభివృద్ధి ఆశయాలపై చేసిన దాడి” అని అదానీ గ్రూప్ పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ నివేదిక విడుదల చేసిన సమయంపై కూడా అదానీ గ్రూప్‌ ప్రశ్నలు సంధించింది. అదానీ గ్రూప్ ఎఫ్‌పీవో ప్రకటించిన సమయంలోనే ఈ నివేదిక రావడం ఆ సంస్థ తప్పుడు ధృక్పథాన్ని తెలియజేస్తోందని అదానీ గ్రూప్ పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ రిపోర్టు స్వతంత్ర నివేదిక కాదని మండిపడింది. హిండెన్‌బర్గ్‌ సంస్థ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అదానీ గ్రూపు కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. మరో 23 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు.. వాటాదార్లు, థర్డ్‌ పార్టీలకు సంబంధించినవని తెలిపింది. మిగిలిన 5 ప్రశ్నలు నిరాధార ఆరోపణలు అని వివరించింది. వీటిని తమ నమోదిత కంపెనీలు ఖండించాయని అదానీ గ్రూపు తెలిపింది. తమకు వర్తించే చట్టాలు, నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తున్నామని తెలిపింది. వాటాదార్ల ప్రయోజనాలు కాపాడడంతో పాటు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే అదానీ గ్రూపు సంస్థల ప్రాధాన్యమని తెలిపారు.

జస్ట్ అలా నడిచాడు అంతే సోషల్ మీడియాలో సునామీ

హీరోలు, స్టార్ హీరోలు, సూపర్ స్టార్ లు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ రేర్ గా ప్రతి ఇండస్ట్రీలో ఒకేఒక్క హీరో ఉంటాడు. అతను హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా ఫాన్స్ ని సొంతం చేసుకుంటాడు. అతనిలో ఒక స్వాగ్ ఉంటుంది, అతని స్టైల్ ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా అతని స్టార్ డమ్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది, ఎన్ని సినిమాలు వచ్చినా ఆ హీరో రికార్డుల పునాదులని కదిలించలేవు. తమిళ్ లో అలాంటి హీరో రజినీకాంత్ అయితే తెలుగులో అలాంటి హీరోకి ఒకేఒక్క పేరు ఉంది… ‘పవన్ కళ్యాణ్’. స్వాగ్, స్టైల్ కలిసి నడిస్తే పవన్ కళ్యాణ్ లా ఉంటుంది. పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ సుజిత్ ఒక సినిమా తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. గ్రాండ్ గా జరిగిన ఈ పూజా కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో వచ్చాడు. పవన్ కళ్యాణ్ కి హుడీలకి ఎదో లింక్ ఉన్నట్లు ఉంది. ఆయన ఎప్పుడు హుడీలో కనిపించినా సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది, ఇక బ్లాక్ హుడీలో కనిపిస్తే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.