NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్ న్యూస్

Ntv Top Hl 9pm

Ntv Top Hl 9pm

జీవో నెంబర్ 1పై ఆందోళన వద్దు

ఏపీలో ఇప్పుడు జీవో నెంబర్ 1 పై రచ్చ సాగుతోంది. అయితే ఈ జీవోపై క్లారిటీ ఇచ్చారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. జీవో నెంబర్ 1 బేస్ చేసుకుని ఎవ్వరినీ బ్యాన్ చేయడం లేదనీ, జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన పడనవసరం లేదని అన్నారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్ కు హాజరయ్యారు డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డి. జీవో నెంబర్ 1 బేస్ చేసుకుని ఎవ్వరినీ బ్యాన్ చేయడం లేదన్నారు. జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన పడనవసరం లేదన్నారు. ఎక్కడా మేము ఎవరినీ బ్లాక్ చేయడం లేదని అన్నారు డిజిపి. జీవో వచ్చిన తరువాత కూడా పొలిటికల్ పార్టీల మీటింగులకు అనుమతులు ఇచ్చాం అన్నారు. ఎవరైనా పాదయాత్ర చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని డీజీపీ అన్నారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఇరవై ఐదు ఏళ్ళ నుండి నడుస్తుందనీ, లాస్ట్ ఇయర్ నుండి గంజాయి నాశనం చేస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న గంజాయి సాగును అక్కడ వాళ్ళు ధ్వంసం చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు.

ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ప్రభుత్వం పేదలకు అందించే వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఉదయం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల. మనోహర్ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ని ప్రతి విభాగాన్ని సందర్శించి రోగికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని సిటీ స్కాన్ విభాగాన్ని చూసి ఎందుకు పనిచెయ్యటం లేదని వైద్య సిబ్బందిని మనోహర్ ప్రశ్నించారు. ఎక్కువ శాతం రోగులను ఇక్కడ ట్రీట్మెంట్ చెయ్యకుండా గుంటూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా సేవలు మెరుగుపరచాలని వైద్యులకు పలు సూచనలు చేశారు. రోగుల దగ్గరకు వెళ్లి వారికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా వైధ్యం అందుతుందా అని ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఏమర్జన్సీ నుంచి ఐసీయూ విభాగంవరకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. బ్లడ్ బ్యాంక్ లో స్టాక్ ఎందుకు తక్కువ ఉన్నాయి మాకు చెబితే మేము బ్లడ్ డోనేషన్ క్యాంపులు పెట్టి మీకు బ్లడ్ పంపుతాము అని వైద్యులకు మనోహర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్కాన్ మిషన్లు పనిచెయ్యక బ్లడ్ కొరతలు ఉండి పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మీడియా తో మాట్లాడుతూ చాలా రోజుల తరువాత తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిని మూడు గంటల పాటు సందర్శించటం జరిగిందన్నారు.

వాల్తేరు వీరయ్య ఈవెంట్ లో అపశృతి.. పోలీసులతో ఫ్యాన్స్ వాగ్వాదం

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. మాస్ మహారాజా రవితేజ, చిరంజీవి అన్నదమ్ములుగా కనిపించడం, వింటేజ్ చిరంజీవి మాస్ గెటప్, సాంగ్స్ ప్రేక్షకులను థియేటర్స్ వైపు నడిపించాయి. దీంతో ఈ సినిమా విజయోత్సవ వేడుకను గ్రాండ్ గా ప్లాన్ చేశారు మేకర్స్. నేడు హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో వీరయ్య విజయ విహారం అనే పేరుతో ఈ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే ఘనంగా ప్రారంభమయ్యింది. అయితే వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో అపశృతి చోటుచేసుకొంది. వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగింది. హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లోకి వెళ్లేందుకు అభిమానులు గేటు ముందు నిలబడ్డారు. ఇక సమయం కావడంతో ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయడంతో అభిమానులు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట లో పలువురు అభిమానులకు గాయాలు కూడా అయ్యాయి. అయినా మెగాస్టార్ ను చూడాలనే అభిమానంతో వారు ఆ గాయాలను కూడా లెక్కచేయకుండా ముందుకు సాగరు.. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, అభిమానులకు మధ్య కొద్దిగా వాగ్వాదం చోటుచేసుకొంది. ఇక గాయాలైన వారిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా రాబోతున్నాడు. దీంతో మెగా అభిమానులందరూ.. ఒకే వేదికపై తండ్రి కొడుకులను చూడడానికి తరలివస్తున్నారు.

ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసం.. గ్యాంగ్ గుట్టురట్టు

ఫేక్ బ్యాంక్ గ్యారంటీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న 4 ముఠాలను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అయితే.. ఈ సందర్భంగా సీసీఎస్ అడిషనల్ డీసీపీ నేహా మెహ్రా మాట్లాడుతూ.. కోల్‌కతా కేంద్రంగా ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు చెక్కులు, నకిలీ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు,5 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తికి కోల్ కత్తాకు చెందిన నరేష్ శర్మ, దాసు, సుబ్రజిత్ గోషాల్ వారితో పరిచయం అయ్యిందని ఆమె తెలిపారు. హశ్రిత ఇన్ఫ్రా కంపెనీ కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ బయో మైనింగ్‌కు కాంట్రాక్టు వచ్చిందని, ప్రాజెవెల్, సందీప్ రెడ్డి, నాగరాజును అప్రోచ్ అయ్యారని ఆమె పేర్కొన్నారు. 14 శాతం కమీషన్ పై ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరుతో కోటి రూపాయల విలువ గ్యారంటీ పత్రాలు నాగరాజు అందించారని, 47 లక్షలు కమీషన్ గా పొందాడని వివరించారు. హార్షిత కంపెనీకి నల్గొండ జిల్లాలో 11 బయో మైనింగ్ కాంట్రాక్టులు మంజూరు అయ్యాయని, వీటికి బ్యాంక్ గ్యారంటీ పత్రాలు 2 కోట్ల 25 లక్షలకు అందించాడని ఆమె తెలిపారు. వెరిఫికేషన్ కు పంపగా ఈ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు ఫేక్ అని తేలాయని, నిందితులు ఇప్పటి వరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో60 నకిలీ పత్రాలను కమీషన్ పై అందించారని ఆమె వెల్లడించారు. ఆ నకిలీ పత్రాల విలువ 35 కోట్లు ఉంటుందని ఆమె వివరించారు.

స్పెర్మ్ బ్యాంక్ పడిపోతోందా? అయితే పెంచుకునే మార్గాలివే

ప్రేమ, వివాహం, పిల్లలు ప్రతి మనిషి జీవితంలో ఇవి ఓ భాగం. పెళ్లయ్యాక తల్లిదండ్రులుగా మారడం అనేది మన జీవితంలో ముఖ్యమైన దశ. బిడ్డ పుట్టాలంటే స్త్రీ, పురుషులు ఇద్దరికీ మంచి ఆరోగ్యం కావాలి. సెక్స్ అనేది మానవ జీవితంలో ఒక భాగం. ఈ లైంగిక సంబంధం వల్ల పిల్లలు పుడతారు. ఒక మహిళ పరిపక్వ పిండం, సంతానోత్పత్తి రేటు, సాధారణ రుతు చక్రం తల్లి కావడానికి ముఖ్యమైనవి. అలాగే, పురుషులకు స్పెర్మ్ కౌంట్(వీర్యకణాలు) చాలా ముఖ్యం. ఇటీవల ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో నేటి పురుషుల సంతానోత్పత్తి వేగంగా తగ్గిపోతున్నట్లు వెల్లడైంది. దీనికి కారణం తక్కువ స్పెర్మ్ కౌంట్. దీని వెనుక చెడు అలవాట్లు. మీకు కూడా ఈ అలవాట్లు ఉంటే, సమయానికి జాగ్రత్తగా ఉండండి. స్పెర్మ్ కౌంట్‌ను ఎలా పెంచుకోవాలి.. తగ్గిపోయేందుకు గల కారణాలు..ఎక్కువగా ధూమపానం చేసే పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్ సమస్యలను కలిగి ఉండవచ్చు. ఆఫీసు ఒత్తిడి పెరగడం వల్ల మీ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. నిరంతరం ఒత్తిడికి లోనవడం, తక్కువ నిద్రపోవడం, నిరంతరం టెన్షన్‌లో ఉండటం వల్ల మీ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. గంటల తరబడి కుర్చీలో కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం… పురుషుల్లో ఊబకాయం సమస్యకు కారణమవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఊబకాయం స్పెర్మ్ కౌంట్ తగ్గిస్తుంది. పురుషులు తమ సెక్స్ లైఫ్ బాగుండాలంటే రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి.రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి, ఊబకాయం సమస్యలు పెరుగుతాయి. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించగలదు. అంతే కాదు, రాత్రి పూట నిద్రపోవడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.

అన్న ఆరోగ్యంపై తమ్ముడి ట్వీట్

నందమూరి తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వారు పేర్కొన్నారు. నేటి ఉదయం ఆయనకు మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు తరలించిన విషయం తెల్సిందే. ఐసీయూలో తారకరత్నకు డాక్టర్స్ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే హాస్పిటల్ వద్దకు తారకరత్న తల్లిదండ్రులు శాంతి, మోహనకృష్ణ.. భార్య అలేఖ్య రెడ్డి, కూతురు నిషిత, నందమూరి బాలకృష్ణ చేరుకున్నారు. మరోపక్క సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తారకరత్న కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజగా తారకరత్న తమ్ముడు నందమూరి కళ్యాణ్ రామ్.. అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు. “నా సోదరుడు శ్రీ నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను “అంటూ ట్వీట్‌ చేశారు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అమిగోస్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్ నేడు ఈ సినిమాలోని సాంగ్ ను రిలీజ్ చేయడానికి పముహూర్తం ఖరారు చేశారు. బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రం సినిమాలో ఎన్నో రాత్రులొస్తాయి కానీ సాంగ్ ను రీమిక్స్ చేశారు. ఈ లిరికల్ వీడియోను ఈరోజు రిలీజ్ చేయాలని చూడగా.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సైతం బెంగుళూరు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అక్కడ కూడా 100 డేస్.. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ అలాంటిది
టాలీవుడ్ గురించి ఎవరికైన చెప్పాలంటే అంతకుముందు బాహుబలికి ముందు.. బాహుబలికి తరువాత అని చెప్పేవారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ కు ముందు ఆర్ఆర్ఆర్ తరువాత అని చెప్తున్నారు. ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఇండియా.. ముఖ్యంగా టాలీవుడ్ పేరును మారుమ్రోగేలా చేస్తోంది. స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతఏడాది మార్చిలో రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఇక్కడ ప్రభంజనాలు సృష్టించిన విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమా 42 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు మరియు 114 కేంద్రాల్లో షిప్ట్ పద్దతిలో వంద రోజులు పూర్తి చేసుకుంది. అప్పట్లో అదో పెద్ద రికార్డ్.. ఇక్కడ చాలా సినిమాలు 50 రోజులు కూడా ఆడడం లేదు. కానీ, మన తెలుగు సినిమా.. జపాన్ లో కూడా వంద రోజులు పూర్తిచేసుకుంది. నిజం.. జపాన్ లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి 100 రోజులు పూర్తిచేసుకొంది. ఇంకా థియేటర్ లో సందడి చేస్తోంది. ఇలాంటి రికార్డ్ క్రియేట్ చేయడంలో కూడా ఆర్ఆర్ఆర్ ముందు వరుస లో ఉంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టినట్లు చరిత్ర లేదు.. అలాంటింది.. ఒక తెలుగు సినిమా జపాన్ లో 100 రోజులు ఆడడం అంటే మాటలు కాదు. దీంతో మరోసారి ఆర్ఆర్ఆర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది

నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్ కు, ఆయన తండ్రి చంద్ర శేఖర్ కు మధ్య విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్ కు తెలియకుండా చంద్రశేఖర్.. ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పేరుతో ఆఫీస్ పెట్టడం నచ్చని విజయ్.. సొంత తండ్రి మీదనే పోలీస్ కేసు పెట్టాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ విబేధాల గురించి ఇప్పటివరకు తండ్రి కొడుకుల ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. ఇక తాజాగా మొట్ట మొదటి సారి విజయ్ తండ్రి చంద్రశేఖర్ తమ విబేధాల గురించి ఓపెన్ అయ్యాడు. తమ మధ్య విబేధాలు ఉన్నాయని, కొడుకు విజయ్ కు తనకు మధ్య మాటలు లేవని చెప్పుకొచ్చాడు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఉన్నట్లే మా ఇద్దరి మధ్య కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మా మధ్య మాటల్లేవ్.. కానీ, అవేమి పెద్ద గొడవలు కావు. ప్రతి ఇంట్లో ఉండేవే.. వాటిని పెద్దవి చేసి చూపించకండి. చిన్న గొడవలు పడడం, మాట్లాడుకోకుండా మానేయడం, మళ్లీ కలుసుకోవడం మా మధ్య ఉన్నాయి. అంతెందుకు విజయ్ వారిసు సినిమా మేము ఇద్దరం కలిసే చూసాం. ఈ ఒక్కటి చాలదా మా మధ్య అనుబంధం ఎలా ఉందో చెప్పడానికి.. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నాయి.మీడియా అనుకునేంత పెద్ద తగాదాలు మాత్రం మా మధ్య లేవు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే విజయ్ కెరీర్ విషయానికొస్తే ఈమధ్యనే వారిసు తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్.. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో ఇంకో సినిమా చేయబోతున్నాడు.